PoliticsNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/massive-job-replacement-in-telangana6003bdd4-e395-4cad-afd4-45f25f86a7bb-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/massive-job-replacement-in-telangana6003bdd4-e395-4cad-afd4-45f25f86a7bb-415x250-IndiaHerald.jpgతెలంగాణలో ఉద్యోగాల భర్తీకి కసరత్తు ప్రారంభమైంది. ఉపాధ్యాయ, పోలీసు ఉద్యోగాలతో పాటు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులన్నింటినీ భర్తీ చేసేందుకు త్వరలోనే నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలు సేకరించాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌ను ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ శాఖల్లో దాదాపు 50 వేల వరకు ఖాళీలున్నట్లు ప్రాథమిక సమాచారమని ప్రభుత్వం చెబుతోంది. ఇంకా ఏయే శాఖల్లో ఎంత మంది ఉద్యోగుల అవసరం ఉందో లెక్క massive job replacement in telangana;kcr;kumaar;telangana rashtra samithi trs;telangana;traffic police;partyతెలంగాణలో భారీగా ఉద్యోగాల భర్తీ !తెలంగాణలో భారీగా ఉద్యోగాల భర్తీ !massive job replacement in telangana;kcr;kumaar;telangana rashtra samithi trs;telangana;traffic police;partyWed, 16 Dec 2020 22:00:00 GMTతెలంగాణ ప్రభుత్వం సమాయత్తమవుతోంది. ఖాళీల లెక్క తేల్చి నోటిఫికేషన్లు ఇవ్వాలని సీఎం కేసీఆర్ ఇప్పటికే అధికారులను ఆదేశించారు. నియామకాల కోసం ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేస్తామని సీఎస్ సోమేశ్ కుమార్ ప్రకటించారు.

తెలంగాణలో ఉద్యోగాల భర్తీకి కసరత్తు ప్రారంభమైంది. ఉపాధ్యాయ, పోలీసు ఉద్యోగాలతో పాటు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులన్నింటినీ భర్తీ చేసేందుకు త్వరలోనే నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలు సేకరించాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌ను ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ శాఖల్లో దాదాపు 50 వేల వరకు ఖాళీలున్నట్లు ప్రాథమిక సమాచారమని ప్రభుత్వం చెబుతోంది. ఇంకా ఏయే శాఖల్లో ఎంత మంది ఉద్యోగుల అవసరం ఉందో లెక్క తేలాల్సి ఉంది. వాటిని భర్తీ చేయడం కోసం వెంటనే నోటిఫికేషన్లు విడుదల చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.

ఇక...సీఎం కేసీఆర్ ప్రకటనతో ఏయే శాఖల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయనే చర్చ మొదలైంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆరున్నర ఏళ్లలో టీఎస్పీఎస్సీ ద్వారా 31 వేల 52 పోస్టులకు అభ్యర్థులను ఖరారు చేశారు. మరో 4 వేల 6 వందలకు పైగా పోస్టులకు అభ్యర్థుల సెలక్షన్ తుది దశలో ఉంది. టీఎస్పీఎస్సీ ద్వారా ఏడాదికి కనీసం 6 వేల ఉద్యోగాలు కూడా భర్తీ కాలేదు. వీటితో పాటు పోలీసు ఉద్యోగాలను పోలీస్ రిక్రూట్‌మెంట్‌బోర్డు ఫిలప్ చేసింది. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అసెంబ్లీలో మాట్లాడిన ప్రభుత్వ పెద్దలు రాష్ట్రంలో వివిధ శాఖల్లో లక్షా 7 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని ప్రకటించారు. ఈ ఆరేళ్లలో మరో 50 వేల మంది ఉద్యోగులు రిటైర్ అయి ఉంటారని అంచనా. అన్నీ కలుపుకుంటే రాష్ట్రంలో రెండు లక్షల వరకు ఖాళీలు ఉండే అవకాశం ఉంది. రాజకీయ పార్టీ లు..నిరుద్యోగులైతే రాష్ట్రంలో మూడు లక్షల ఖాళీలు ఉన్నాయని అంటున్నారు.




300 రోజులు .... రెండు సినిమాలు... పక్కా ప్లానింగ్ ... సక్సెస్ ఖాయమట .....??

సాగు చట్టాలా మజాకా.. దేశంలోనే తొలిసారి వ్యాపారికి జరిమానా!

ప్రేయసి కోసం సముద్రాన్ని దాటి.. చివరకు జైలు పాలైన లవర్!

పెద్ద సినిమాలు తొక్కిపడేస్తాయట...?

ఆ సినిమా కోసం డైరెక్టర్ వేటలో కింగ్ నాగార్జున.. కథేంటంటే..

పాక్ యుద్ధంపై ప్రధానిని వ్యతిరేకించిన భారత జనరల్.. భయపడి కాదు..!

ఆదిపురుష్ నుంచి సైఫ్ ఆలీఖాన్ అవుట్...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>