PoliticsSRISHIVAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/telangana-dgp-mahender-reddy-on-friendly-policing20c93041-7bd9-4ecd-8adb-032e9c7ded5e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/telangana-dgp-mahender-reddy-on-friendly-policing20c93041-7bd9-4ecd-8adb-032e9c7ded5e-415x250-IndiaHerald.jpg తెలంగాణ వ్యాప్తంగా నేరాల నివారణ కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని డీజీపీ మహేందర్ రెడ్డి చెప్పారు. ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమన్నారు. సికింద్రాబాద్ ఖార్ఖానా పోలీసు స్టేషన్ కొత్త భవనాన్ని హోంమంత్రి మహముద్ ప్రారంభించారు. dgp mahender reddy;kumaar;pragathi;srinivas;hyderabad;telangana;police;mla;minister;traffic police;international;reddy;mantraఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానం!ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానం!dgp mahender reddy;kumaar;pragathi;srinivas;hyderabad;telangana;police;mla;minister;traffic police;international;reddy;mantraWed, 16 Dec 2020 14:53:27 GMTరెడ్డి  చెప్పారు. ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమన్నారు. సికింద్రాబాద్ ఖార్ఖానా పోలీసు స్టేషన్ కొత్త భవనాన్ని హోంమంత్రి మహముద్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్‌, మల్లారెడ్డి, ఎమ్మెల్యే సాయన్న, డీజీపీ మహేందర్ రెడ్డి, సీపీ అంజనీ కుమార్, పోలీస్ హౌసింగ్ బోర్డు చైర్మన్ దామోదర్ గుప్తా పాల్గొన్నారు.ఈ సందర్భంగా డీజీపీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో ఆరున్నర లక్షల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ కెమెరాలను ఏర్పాటు చేయడంలో కాలనీ వాసులతో పాటు ప్రజాప్రతినిధులు, ఇతర ప్రముఖుల పాత్ర ఉందన్నారు.

           పోలీసు వ్యవస్థ గురించి ప్రజలకు తెలియాలని, నేరం జరగకముందే నేరస్తులను గుర్తిస్తే సమాజం పోలీసు శాఖను మరింత హర్షిస్తుందన్నారు డీజీపీ మహేందర్ రెడ్డి. నేరాల నివారణ కోసం నగరంలో లక్షల సంఖ్యలో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. రక్షణపై  ప్రజల్లో సృజనాత్మకత వచ్చిందని, గ్రామాల్లో కూడా కెమెరాలను ఏర్పాటు చేసుకుంటున్నారని డీజీపీ చెప్పారు.
 ఫ్రెండ్లీ పోలీసింగ్‌తో పోలీసు శాఖపై ప్రజల్లో మరింత ఆదరణ పెరిగిందన్నారు డీజీపీ మహేందర్ రెడ్డి.

           కేసుల విషయంలో రాష్ట్రమంతా  ఒకే రకమైన విధానాన్ని అవలంబిస్తున్నామని తెలిపారు తెలంగాణ డీజీపీ. రాష్ట్రం శాంతి భద్రతలు అద్భుతంగా ఉన్నాయన్నారు.హైదరాబాద్ కు పెట్టుబడులు వస్తున్నాయంటే అందుకు శాంతిభద్రతలు అదుపులో ఉండటమే కారణమన్నారు. దీని వెనుక ప్రభుత్వం, పోలీసు శాఖతో పాటు ప్రజల కృషి ఉందన్నారు. రాబోయే కాలంలో మరింత ప్రగతి సాధించాలన్నదే పోలీసు శాఖ తపన అని డీజీపీ మహేందర్ రెడ్డి స్పష్టం చేశారు.తెలంగాణ పోలీస్ శాఖకు అంతర్జాతీయంగా గుర్తింపు వచ్చిందన్నారు. ఇతర రాష్ట్రాలు కూడా మన విధానాలను ఫాలో అవుతున్నాయన్నారు మహేందర్ రెడ్డి





ఒక్క ఓటుతో ఓడిపోయిన కాంగ్రెస్‌ మేయర్ అభ్యర్థి

20 నిమిషాల రోల్.. 20 కోట్ల రెమ్యునరేషన్.. సలార్ అంటే ఇదే..!

స్క్రీన్ షేర్ చేసుకోనున్న బాలయ్య, నాగశౌర్య?

బ్లాక్ కాఫీతో వెయిట్ లాస్ సాధ్యమేనా

వీరిలో టాలీవుడ్ నెంబర్ 1 స్టార్ హీరోయిన్ ఎవరు

స్టైలిష్ స్టార్ ని టాప్ హీరోగా నిలబెట్టిన ఆ సినిమాని ఆ హీరో రిజెక్ట్ చేశాడట..

మాట నిలబెట్టుకున్న తెలంగాణా సర్కార్... డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళకు సూపర్ సౌకర్యాలు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SRISHIVA]]>