PoliticsN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/whats-app97532e9f-01aa-4503-9fd9-61c170556b64-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/whats-app97532e9f-01aa-4503-9fd9-61c170556b64-415x250-IndiaHerald.jpgనేటి సమాజంలో చాల మంది వాట్సాప్ ని వాడుతున్నారు. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ కొత్త కొత్త ఫీచర్స్ ని తీసుకొస్తుంది. వాట్సాప్ లో కొత్త స్కామ్ మొదలైంది. పార్ట్ టైం జాబ్ లు కల్పిస్తామంటూ కొన్ని నంబర్ల నుంచి మెసేజ్లు వస్తున్నాయి. ఇంటి నుంచే పని చేస్తూ నెలకు రూ.50వేల వరకు సంపాదించండి అంటూ పోస్టర్లు, పాంప్లెట్లు చూస్తుంటాం. కొంతకాలంగా వెబ్సైట్లలో ఈ యాడ్లు కనిపిస్తున్నాయి.whats app;maya;samsung;apple;huawei;nokia;sony;lg;htc;motorola;redmi;dell;hp;asus;acer;whatsapp;job;partyవాట్సాప్ లో కొత్త మోసం.. ఆ లింక్ లపై టచ్ చేస్తే కొంప కొల్లేరే..!?వాట్సాప్ లో కొత్త మోసం.. ఆ లింక్ లపై టచ్ చేస్తే కొంప కొల్లేరే..!?whats app;maya;samsung;apple;huawei;nokia;sony;lg;htc;motorola;redmi;dell;hp;asus;acer;whatsapp;job;partyWed, 16 Dec 2020 14:30:26 GMTవాట్సాప్ ని వాడుతున్నారు. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ కొత్త కొత్త ఫీచర్స్ ని తీసుకొస్తుంది.  వాట్సాప్ లో కొత్త స్కామ్ మొదలైంది. పార్ట్ టైం జాబ్ లు కల్పిస్తామంటూ కొన్ని నంబర్ల నుంచి మెసేజ్లు వస్తున్నాయి. ఇంటి నుంచే పని చేస్తూ నెలకు రూ.50వేల వరకు సంపాదించండి అంటూ పోస్టర్లు, పాంప్లెట్లు చూస్తుంటాం. కొంతకాలంగా వెబ్సైట్లలో ఈ యాడ్లు కనిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు కొందరు నేరుగా వ్యక్తిగత వాట్సాప్ నంబర్లకు మేసేజ్ లు పంపడం మెుదలు పెట్టారు. లాక్డౌన్ సమయంలో చాలా మంది ఉద్యోగాలు కోల్పోయి, ఆదాయం తగ్గిపోయి బాధ పడుతున్న తరుణంలో దీన్నేఅదునుగా చేసుకున్న కొందరు హ్యాకర్లు మోసాలకు తెరలేపారు.

వేగంగా డబ్బు సంపాదించే అవకాశం అంటూ కొన్ని గుర్తుతెలియని నంబర్ల నుంచి కొందరి ఫోన్లకు మెసేజ్ లు వస్తున్నాయి. సింపుల్ పనులు చేయండి. అధిక మొత్తంలో డబ్బు పొందండి అంటూ ఆశ పెడుతున్నాయి. అయితే ఇవి ఎక్కువగా ఇతర దేశాల నంబర్ల నుంచి వస్తున్నాయి. వీటిలో కొన్ని వెబ్సైట్ల లింక్లు ఉంటున్నాయి. వాట్సాప్ ద్వారా వచ్చిన మెసేజ్ ల్లోని ఆ లింక్లను క్లిక్ చేస్తే ఫోన్లకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ లింక్లు మాల్వేర్తో ఉంటున్నాయి.

అలాగే కొన్ని లింక్ లను క్లిక్ చేస్తే వివరాలతో పాటు ఆర్థికపరమైన సమాచారం, సెక్యూరిటీ పిన్లు తదితర వివరాలను ఎంటర్ చేయాలని వస్తోంది. కొందరు ఈ విధంగా సమాచారం ఇచ్చి డబ్బులు కోల్పోయిన వారిలో చాలా మంది ఉన్నారు. మరికొందరి డాటా చోరీకి గురైంది. ఇలా వస్తున్న ఫేక్ మెసేజ్ల్లోని లింక్ను క్లిక్ చేస్తే ఏదో వెబ్సైట్ కు వెళ్తోంది. అన్ని వివరాలను ఎంటర్ చేయాలని అడుగుతోంది. ఒకవేళ మీరు కాని సమాచారం ఇస్తే ఇల్లీగల్ పనులకు ఆ సమాచారాన్ని హ్యాకర్లు వాడే అవకాశం ఉంటుంది.

బ్యాంకు ఖాతాల్లోని డబ్బు మాయం కావొచ్చు అని ఆర్థిక రంగ నిపుణులు సూచిస్తున్నారు. అలాంటి మెసేజ్ లు వచ్చినప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. అలాంటి మెసేజ్ లు వస్తే.. ఎక్కడి నుంచి మెసేజ్ వచ్చిందో ఓ సారి వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. మొత్తం స్పష్టంగా చదవాలి. సంస్థ వివరాలు ఇంటర్నెట్లో సెర్చ్ చేయండి. అసలు ఆ మెసేజ్ లోని విషయం వాస్తవికంగా ఉందో లేదో చూడాలి. ఏ చిన్న అనుమానం వచ్చినా, ఒకవేళ తప్పుడు మెసేజ్ అని తేలినా వెంటనే బ్లాక్ చేయడమో..రిపోర్ట్ చేయడమో చేయాలి.

ఇకపోతే తప్పుల కోసం వెతకండి.. మెసేజ్ల్లో గ్రామర్ తప్పులు, వాక్య నిర్మాణం(సెంటెన్స్ ఫార్మేషన్) సరిగా లేకపోతే అది కచ్చితంగా తేడా మెసేజ్ అని గుర్తించాలని నిపుణులు సూచిస్తున్నారు. అయితే కొన్ని ఎలాంటి తప్పులు లేకుండా ప్రొఫెషనల్ గా వస్తున్నాయి. వాటి విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. యాంటీ వైరస్లు.. ఒకవేళ లింక్ లను క్లిక్ చేస్తే వచ్చే మాల్ వేర్ నుంచి రక్షించుకునేందుకు ఫోన్లో యాంటీ వైరస్ యాప్స్ వాడొచ్చు. ఒకవేళ థర్జ్ పార్టీ యాప్స్ ఇస్టాల్ చేసుకున్నా.. ఇంటర్నెట్ నుంచి ప్రమాదకర ఫైల్స్ డౌన్ లోడ్ చేసుకున్నా చాలా ప్రమాదకరం అని గుర్తించి హెచ్చరిస్తాయి.


బ్లాక్ కాఫీతో వెయిట్ లాస్ సాధ్యమేనా

వీరిలో టాలీవుడ్ నెంబర్ 1 స్టార్ హీరోయిన్ ఎవరు

స్టైలిష్ స్టార్ ని టాప్ హీరోగా నిలబెట్టిన ఆ సినిమాని ఆ హీరో రిజెక్ట్ చేశాడట..

మాట నిలబెట్టుకున్న తెలంగాణా సర్కార్... డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళకు సూపర్ సౌకర్యాలు

అమరావతి ఏకైక రాజధాని... జగన్ పప్పులు ఉడకవా..?

ఏపీ స్థానిక ఎన్నిక‌లు ఇప్ప‌ట్లో లేన‌ట్లేనా..? కోర్టు విచార‌ణ సారాంశం అదేనా...?

భారీ బడ్జెట్ 'రామాయణం'.. డైలాగ్స్ రాసేసిన మాటల మాంత్రికుడు!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>