Viralyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/girl-died-in-bathtub-while-charging-iphoneb1fd62df-5387-46d4-86ea-678216b2e27d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/girl-died-in-bathtub-while-charging-iphoneb1fd62df-5387-46d4-86ea-678216b2e27d-415x250-IndiaHerald.jpgమొబైల్‌కు చార్జింగ్ పెట్టి స్నానం చేయబోయిన 24 ఏళ్ల యువతి దారుణంగా చనిపోయింది. ఈ ఘటన రష్యాలో జరిగింది. ఒలీసియా సెమినోవా అనే యువతి రష్యాలోని అర్ఖన్‌గెల్క్స్‌లో తన స్నేహితురాలితో కలిసి నివశిస్తోంది. బాత్‌టబ్‌లో పడుకుని తన ఐఫోన్ చూస్తోంది. అయితే చార్జింగ్ అయిపోవడంతో ..iphone;vidya;smart phone;iphone;police;electricity;heartఐఫోన్ చార్జింగ్ ప్రాణం తీసిందిఐఫోన్ చార్జింగ్ ప్రాణం తీసిందిiphone;vidya;smart phone;iphone;police;electricity;heartWed, 16 Dec 2020 13:57:13 GMTఇంటర్నెట్ డెస్క్: మొబైల్‌కు చార్జింగ్ పెట్టి స్నానం చేయబోయిన  24 ఏళ్ల యువతి దారుణంగా చనిపోయింది. ఈ ఘటన రష్యాలో జరిగింది. ఒలీసియా సెమినోవా అనే యువతి రష్యాలోని అర్ఖన్‌గెల్క్స్‌లో తన స్నేహితురాలితో కలిసి నివశిస్తోంది. బాత్‌టబ్‌లో పడుకుని తన ఐఫోన్ చూస్తోంది. అయితే చార్జింగ్ అయిపోవడంతో పక్కనే ఉన్న చార్జింగ్ పోర్టుతో చార్జింగ్ పెట్టింది. అయితే తొందరలో చేతిలోని ఐఫోన్‌తో పాటు వైర్ కూడా బాత్‌టబ్‌లో పడింది. దీంతో ఒక్కసారిగా బాత్‌టబ్‌లోని నీరు మొత్తం కరెంట్ వచ్చేసింది. కనీసం బయటకు వచ్చేందుకు కూడా ఒలీసియాకు అవకాశం లేకుండా పోయింది. ఆ నీటిలోనే చనిపోయింది.   

ఎంతసేపటికీ స్నేహితురాలు బయటకు రాకపోవడంతో తన రూమ్‌మేట్ దరియా బాత్‌రూం తలుపు కొట్టింది. ఎంతకీ అవతలి నుంచి సమాధానం రాకపోవడంతో కంగారు పడిన దరియా వెంటనే తలుపు గడియ బయటనుంచి తీసి లోనికి వెళ్లింది. అప్పటికే అక్కడ ఒలీసియా అచేతన స్థితిలో ఉంది.

ఒలీసియా బాత్‌టబ్‌లో ఆమె ఐఫోన్-8 మొబైల్ పడి ఉండడాన్ని దరియా గుర్తించింది. ఆమెను మెలకువలోకి తెచ్చేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.  దీంతో భయపడిపోయిన దరియా.. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది.

‘ఒలీసియాను అచేతన స్థితిలో చూడగానే నా గుండె ఆగినంత పనైంది. వెంటనే దగ్గరకు వెళ్లగానే తన బాత్‌టబ్‌లో చార్జింగ్ పెట్టి ఉన్న ఐఫోన్ కనపడింది. అయితే వెంటనే దగ్గరకు వెళ్లి ఫోన్ చార్జింగ్ తీసేశాను. తర్వాత ఆమెను లేపేందుకు ప్రయత్నించాను. కానీ లేవలేదు. వెంటనే భయపడిపోయాను. అయినే తేరుకుని పోలీసులకు ఫోన్ చేశాను. వారు వచ్చి ఆమె మరణించినట్లు నిర్ధారించారు. నాకేం అర్థం కాలేదు. దు:ఖం తన్నుకొచ్చింది’ అని దరియా చెప్పుకొచ్చింది.

 అక్కడకు చేరుకున్న పోలీసులు.. కరెంటు షాక్ వల్లే ఒలీసియా మరణించిందని ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. అనంతరం నిర్వహించిన పోస్ట్ మార్టంలో కూడా ఆమె విద్యుత్ షాక్ వల్లే మరణించిందని తేలింది.


బి బి 4: ఇంటి సభ్యుల పై కీలక వ్యాఖ్యలు చేసిన సింగర్ గీతా మాధురి...!

వీరిలో టాలీవుడ్ నెంబర్ 1 స్టార్ హీరోయిన్ ఎవరు

స్టైలిష్ స్టార్ ని టాప్ హీరోగా నిలబెట్టిన ఆ సినిమాని ఆ హీరో రిజెక్ట్ చేశాడట..

మాట నిలబెట్టుకున్న తెలంగాణా సర్కార్... డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళకు సూపర్ సౌకర్యాలు

అమరావతి ఏకైక రాజధాని... జగన్ పప్పులు ఉడకవా..?

ఏపీ స్థానిక ఎన్నిక‌లు ఇప్ప‌ట్లో లేన‌ట్లేనా..? కోర్టు విచార‌ణ సారాంశం అదేనా...?

భారీ బడ్జెట్ 'రామాయణం'.. డైలాగ్స్ రాసేసిన మాటల మాంత్రికుడు!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>