PoliticsSRISHIVAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/komatireddy-venkat-reddy0dfa271b-5eba-4177-a6f3-53e689b9a595-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/komatireddy-venkat-reddy0dfa271b-5eba-4177-a6f3-53e689b9a595-415x250-IndiaHerald.jpgటీపీసీసీ కోసం హైకమాండ్ ముందు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కొత్త ప్రతిపాదన పెట్టారని చెబుతున్నారు. బీజేపీలో బండి సంజయ్‌కి ఇచ్చినట్టే పార్టీ మనిషికే అధ్యక్ష పదవి ఇవ్వాలని ఆయన కోరారని తెలుస్తోంది. ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలు ఎంతకాలం పార్టీలో ఉంటారో తెలియదని, పార్టీ ప్రయోజనాల కంటే స్వప్రయోజనాలే చూసుకుంటారని సోనియా గాంధీ తో కోమటిరెడ్డి చెప్పినట్లు చర్చ జరుగుతోంది. komatireddy venkat reddy;soniagandhi;rahul new;rahul;revanth;venkat;k l rahul;telangana rashtra samithi trs;telangana;mohandas karamchand gandhi;sonia gandhi;revanth reddy;congress;mp;parliment;tpcc;rahul sipligunj;yuva;reddy;partyపీసీసీకి కోమటిరెడ్డి బండి ఫార్మూలా! సోనియా, రాహుల్ కు ప్రతిపాదనపీసీసీకి కోమటిరెడ్డి బండి ఫార్మూలా! సోనియా, రాహుల్ కు ప్రతిపాదనkomatireddy venkat reddy;soniagandhi;rahul new;rahul;revanth;venkat;k l rahul;telangana rashtra samithi trs;telangana;mohandas karamchand gandhi;sonia gandhi;revanth reddy;congress;mp;parliment;tpcc;rahul sipligunj;yuva;reddy;partyWed, 16 Dec 2020 17:04:27 GMTతెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటి అధ్యక్ష ఎన్నిక ఢిల్లీకి చేరింది. అశావాహులంతా హైకమాండ్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఒక్కొక్కరుగా ఢిల్లీకి చేరుకుని తమకు తెలిసిన పెద్దల ద్వారా లాబీయింగ్ చేసుకుంటున్నారు. తెలంగాణ పీసీసీ చీఫ్ పదవి తనకే వస్తుందని మొదటి నుంచి చెబుతున్న  భువనగిరి ఎంపీ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. ఢిల్లీలో తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, యువ నేత రాహుల్ గాంధీని కలిశారు.  పీసీసీ పదవిని చేపట్టే అన్ని అర్హతలు తనకు ఉన్నాయని, తనకు అవకాశాన్ని ఇవ్వాలని సోనియాను కోరారు.ఎన్నో ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీకి తమ కుటుంబం సేవలందిస్తోందని... అధికార టీఆర్ఎస్ ను ఢీకొనగల సత్తా తమకు ఉందని చెప్పారు.

            అయితే టీపీసీసీ కోసం హైకమాండ్ ముందు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కొత్త ప్రతిపాదన పెట్టారని చెబుతున్నారు. బీజేపీలో బండి సంజయ్‌కి ఇచ్చినట్టే పార్టీ మనిషికే అధ్యక్ష పదవి ఇవ్వాలని ఆయన కోరారని తెలుస్తోంది. ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలు ఎంతకాలం పార్టీలో ఉంటారో తెలియదని, పార్టీ ప్రయోజనాల కంటే స్వప్రయోజనాలే చూసుకుంటారని సోనియా గాంధీ తో కోమటిరెడ్డి చెప్పినట్లు చర్చ జరుగుతోంది. పార్టీలో మొదటి నుండి వచ్చిన వారికే పీసీసీ పగ్గాలు ఇస్తేనే నిజమైన కార్యకర్తలకు న్యాయం జరుగుతుందని రాహుల్ తోనూ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారని కాంగ్రెస్ వర్గాల సమాచారం.


          మరోవైపు టీపీసీసీ రేసులో ఉన్న మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీలోనే ఉన్నారు.రాహుల్ గాంధీతో కలిసి ఆయన పార్లమెంట్ డిఫెన్స్ స్టాండింగ్ కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ నుంచి ఈ సమావేశంలో రాహుల్, రేవంత్ రెడ్డి ఇద్దరే పాల్గొన్నారు. దీంతో రాహుల్ ను కలిసే అవకాశం దక్కిన రేవంత్ రెడ్డి.. పీసీసీ పదవి గురించి అతనితో చర్చించారని చెబుతున్నారు.

 


బెజవాడలో వైసీపీ కీలక కార్యక్రమం

రోజుకు 100మందికే కరోనా వ్యాక్సిన్?.. కేంద్రం ప్రకటన!

మైండ్ బ్లాక్ అయ్యే రెమ్యునరేషన్.. F3 కోసం అనీల్ రావిపుడికి అంత ఇస్తున్నారా..?

ఆ నెలలో సాగర్ ఉపఎన్నిక ఉంటుందట..

సీఎంల ఢిల్లీ పర్యటనపై రాజకీయాల్లో ఉత్కంఠ..!

ఇటు ఎస్ఈసీ...అటు సర్కార్ నడుమ స్థానిక సమరం

20 నిమిషాల రోల్.. 20 కోట్ల రెమ్యునరేషన్.. సలార్ అంటే ఇదే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SRISHIVA]]>