MoviesVasueditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/talivooda80ef6f8-e6a5-48f2-abab-f94a16bd8ee5-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/talivooda80ef6f8-e6a5-48f2-abab-f94a16bd8ee5-415x250-IndiaHerald.jpgఎస్పీ బాలసుబ్రహ్మణ్యం..’’ ఈ పేరు వింటే పాటమ్మ పరవశిస్తుంది. ఆయన స్వరం వింటే.. సంగీత ప్రియులు తన్మయత్వంతో మైమరచిపోతారు. దేశంలోనే అత్యంత గొప్ప గాయకుల్లో ఒకరిగా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి గడించిన ఈ స్వరశిఖరం.. నేలకొరిగి దాదాపు మూడు నెలలు కావస్తోంది. అయితే.. బాలు మా తెలుగువాడు అని చెప్పుకోవడం మినహా.. ఆయనకు నివాళిగా మనవాళ్లు ఏం చేశారు అంటే.. సమాధానం కనిపించదు. తెలుగు సినీ పరిశ్రమ తరపున కనీసం ఒక సంతాప సభ కూడా ఏర్పాటు చేయకపోవడం తలుచుకుంటే మనసు చివుక్కుంటుంది.talivood;auto;anirudh ravichander;anjali;geetha;madan;prema;srinivas;tollywood;industries;cinema;sangeetha;telugu;tamil;love;film industry;industry;international;vబాలును మరిచిపోయిన టాలీవుడ్బాలును మరిచిపోయిన టాలీవుడ్talivood;auto;anirudh ravichander;anjali;geetha;madan;prema;srinivas;tollywood;industries;cinema;sangeetha;telugu;tamil;love;film industry;industry;international;vWed, 16 Dec 2020 09:52:20 GMTబాలురు మరిచిపోయిన తెలుగు సినిమా ఇండస్ట్రీ

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం..’’ ఈ పేరు వింటే పాటమ్మ పరవశిస్తుంది. ఆయన స్వరం వింటే.. సంగీత ప్రియులు తన్మయత్వంతో మైమరచిపోతారు. దేశంలోనే అత్యంత గొప్ప గాయకుల్లో ఒకరిగా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి గడించిన ఈ స్వరశిఖరం.. నేలకొరిగి దాదాపు మూడు నెలలు కావస్తోంది. అయితే.. బాలు మా తెలుగువాడు అని చెప్పుకోవడం మినహా.. ఆయనకు నివాళిగా మనవాళ్లు ఏం చేశారు అంటే.. సమాధానం కనిపించదు. తెలుగు సినీ పరిశ్రమ తరపున కనీసం ఒక సంతాప సభ కూడా ఏర్పాటు చేయకపోవడం తలుచుకుంటే మనసు చివుక్కుంటుంది.


అంత్యక్రియలకూ వెళ్లలేదు..
బాలు చనిపోయినపుడు కరోనా సాకు చూపి తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి అంత్యక్రియలకు కూడా ఎవ్వరూ హాజరు కాలేదు. ఇక సంగీత విభాగం నుంచి కూడా బాలుకు నివాళిగా ప్రత్యేకంగా చేసింది ఏమీ లేదు వివిధ కార్యక్రమాల్లో ఆయనను తలుచుకోవడం తప్ప. కానీ.. తమిళ జనాలు బాలును తమ వాడిని చేసుకుని ఎప్పటికప్పుడు కురిపిస్తున్న ప్రేమాభిమానాలు చూస్తే ఆనందం ఆశ్చర్యం కలగక మానదు

అనేక సంతాప సభలు..

బాలు ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడినపుడు తమిళులు ఎంతగా తల్లడిల్లిపోయారో అందరికీ తెలిసిందే. ఇక ఆయన మరణాన్ని జీర్ణించుకోలేకపోయారు. బాలు మీద తమకున్న ప్రేమను చాటుకుంటూ.. ఆయన మరణానంతరం చెన్నైలో అనేక సంతాప సభలు జరిగాయి. అక్కడి చిత్రపరిశ్రమ సైతం నివాళిగా పలు కార్యక్రమాలు నిర్వహించింది.

స్వర నీరాాజనం..
బాలుకు నివాళిగా తమిళ సంగీత దర్శకులు గాయకులు ప్రత్యేక గీతాలు ఆలపిస్తూనే ఉన్నారు. తాజాగా.. ప్రముఖ గాయకులు శ్రీనివాస్ హరిచరణ్లతో పాటు సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ తదితరులు తమదైన రీతిలో అంజలి ఘటించారు. బాలు ఎవర్ గ్రీన్ క్లాసిక్ సాంగ్ అయిన ‘‘అంజలీ.. అంజలీ..’’ గీతాన్ని అనుకరిస్తూ మదన్ కార్కీ రాసిన ఓ గీతాన్ని ఆలపించారు. ఆ పాటకు అందమైన విజువల్స్ కూడా జోడించి వీడియో రిలీజ్ చేశారు. అది చూస్తే బాలు అభిమానుల మనసు ఉప్పొంగకుండా ఉండదు. ఈ విధంగా బాలును తమవాడిని చేసుకున్నారు తమిళులు. ఆయనపై తమకున్న ప్రేమ ఎలాంటిదో బాలును వాళ్లెంతగా ఆరాధిస్తారో చాటి చెబుతూనే ఉన్నారు. ఇవన్నీ చూసినప్పుడు.. మన గాన గంధర్వుడిని మనవాళ్లు విస్మరించడం గుర్తురాక మానదు. తెలుగువాడిని తమిళులు సొంతం చేసుకుంటే.. మనవాళ్లు పరాయి వాడిని చేశారన్న ఆవేదన కలగక మానదు. దీనికి మన సినీ పెద్దలు ఏం చెబుతారో


మిల్క్ బ్యూటీ కి బ్రేకప్ ఉందంటున్న సామ్

భారీ బడ్జెట్ 'రామాయణం'.. డైలాగ్స్ రాసేసిన మాటల మాంత్రికుడు!

పశ్చిమ బెంగాల్లో రసవత్తర రాజకీయం..!

కొవిడ్ వ్యాక్సిన్ ఎంట్రీకి కౌంట్ డౌన్..!

వ్యవసాయ చట్టాలపై.. రైతులతో మోదీ మాటామంతీ..

ఆ సూర్య గ్రహణాన్ని చూడాలంటే..!

బిగ్‌బాస్-4: గ్రాండ్ ఫినాలేలో హాట్ హీరోయిన్ల ఆటపాట?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vasu]]>