PoliticsP.Phanindraeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/romeo16759075-58e0-4d7c-9d3a-640a50dbfd17-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/romeo16759075-58e0-4d7c-9d3a-640a50dbfd17-415x250-IndiaHerald.jpgప్రియురాలి కోసం నదిని దాటి, గడ్డకట్టే మంచులో ప్రయాణించి.. చివరకు ఊచలు లెక్క పెడుతున్నారు యువకుడు. అదేంటి? ఎందుకలా? అనుకుంటున్నారా.. అయితే ఈ కథ చదవాల్సిందే. స్కాట్లాండ్‌కు చెందిన 28 ఏళ్ల డేల్ మెక్‌లాగన్ నెట్టింట ఇప్పుడో స్టార్ అయిపోయాడు. తాను ప్రేమించిన అమ్మాయి కోసం ఐరిష్ సముద్రాన్ని దాటడంతో సోషల్ మీడియాలో టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాడు. romeo;police;sea;girl;international;red;loverప్రేయసి కోసం సముద్రాన్ని దాటి.. చివరకు జైలు పాలైన లవర్!ప్రేయసి కోసం సముద్రాన్ని దాటి.. చివరకు జైలు పాలైన లవర్!romeo;police;sea;girl;international;red;loverWed, 16 Dec 2020 20:49:06 GMTఅమ్మాయి కోసం ఐరిష్ సముద్రాన్ని దాటడంతో సోషల్ మీడియాలో టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాడు. అసలు విషయానికి వస్తే.. మన డేల్ ప్రేమించిన అమ్మాయి పేరు జెస్సికా రెడ్ క్లిఫ్.

ఐరిష్ సముద్రంలోని ‘ఐల్ ఆఫ్ మన్‌’ అనే దీవిలో ఉన్న రామ్సే ప్రాంతంలో ఆమె నివాసం ఉంటుంది. గత సెప్టెంబర్‌లో ఆ దీవిలో పని చేయడానికి వెళ్లిన డేట్.. జెస్సికాతో ప్రేమలో పడ్డాడు. అయితే అక్కడ తన కాంట్రాక్ట్ పూర్తవడంతో సొంత ఊరికి వెళ్లిపోయాడు. ప్రేయసికి దూరంగా ఉండటంతో తీవ్ర విరహానికి గురయ్యాడు. ఆమెను ఎలాగైనా చూసి తీరాల్సిందే అని డిసైడ్ అయ్యాడు. జెస్సికా ఉండే దీవికి వెళ్లేందుకు అనుమతి అడిగితే అధికారులు అతని విజ్ఞప్తులను తిరస్కరించారు. దీంతో ఓ జెట్ స్కై (బోటు) కొనుక్కుని, ఎవరికీ చెప్పకుండా ఆ దీవికి వెళ్లిపోయాడు. ఐరిష్ సముద్రం దాటి రామ్సేకి చేరుకున్నాడు. 25మైళ్ల దూరాన్ని ఈజీగా 40 నిమిషాల్లో చేరుకోవచ్చని అనుకున్న అతనికి ఆ ప్రయాణం చాలా కష్టంగా మారింది. అయితే ఎప్పుడూ పడవ నడిపిన అలవాటు లేకపోవడంతో అతని ప్రయాణం నాలుగు గంటలకు పైనే సాగింది.  

సముద్రం దాటిన తర్వాత మరో 15 మైళ్లు నడవాల్సి వచ్చింది. చివరకు ప్రేయసి ఇంటికి చేరుకున్నాడు. అయితే అతను ఇంకా ఆ ఐలాండ్‌లోనే పని చేస్తున్నాడని ఆమె అనుకుంది. ఇదంతా గత శుక్రవారం నాటి ముచ్చట. తర్వాత రోజు ఇద్దరు కలిసి ఓ నైట్ క్లబ్‌కు వెళ్లారు. అక్కడ
వీళ్లిద్దరూ పోలీసుల కంట పడటంతో ఆరా తీశారు. అప్పుడు అసలు విషయం బటయపడింది. ఎంత మొత్తుకున్నా పోలీసులు వినలేదు. న్యాయస్థానం ముందు నిలబెట్టారు. అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించి.. కోవిడ్ నిబంధనలు పూర్తిగా పక్కన పెట్టి.. మొత్తం నగరాన్ని రిస్క్‌లో పెట్టేలా అతని చర్యలు ఉన్నాయంటూ న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. నాలుగు వారాల జైలు శిక్ష విధించింది. 


తెలంగాణ బీజేపీ లో అప్పుడే విబేధాలు మొదలయ్యాయా..?

పెద్ద సినిమాలు తొక్కిపడేస్తాయట...?

ఆ సినిమా కోసం డైరెక్టర్ వేటలో కింగ్ నాగార్జున.. కథేంటంటే..

పాక్ యుద్ధంపై ప్రధానిని వ్యతిరేకించిన భారత జనరల్.. భయపడి కాదు..!

ఆదిపురుష్ నుంచి సైఫ్ ఆలీఖాన్ అవుట్...?

కేసీఆర్ నగర్ ను ప్రారంభించిన హరీష్ రావు

వరదసాయంపై నో రెస్పాన్స్.. ఆందోళనలో నగరవాసులు..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Phanindra]]>