EditorialVijayaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/why-naidu-telling-lies-about-modi-in-connection-with-amaravati69787537-be55-4e48-8a70-dcf186ca77a1-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/why-naidu-telling-lies-about-modi-in-connection-with-amaravati69787537-be55-4e48-8a70-dcf186ca77a1-415x250-IndiaHerald.jpgఇక మూడో అంశంగా ప్రతిపక్షాలన్నీ అమరావతికే కట్టుబడుంటే జగన్మోహన్ రెడ్డి మాత్రం మూడు రాజధానులంటూ ఎందుకు మంకు పట్టుపట్టుపడుతున్నాడని ప్రశ్నించటమే విచిత్రంగా ఉంది. ఎందుకంటే ఆరోజుల్లో అమరావతిని రాజధానిగా వద్దని, స్విస్ ఛాలెంజి పద్దతిలో రాజధాని నిర్మాణం వద్దని చాలామంది చెబితే చంద్రబాబు విన్నారా ? ఏడాదికి పచ్చని మూడు పంటలు పండే ప్రాంతాన్ని నాశనం చేయద్దని ఎంతమంది మొత్తుకున్నా చంద్రబాబు ఎందుకు పట్టించుకోలేదు ? ఇక ఫైనల్ గా అమరావతే రాజధానిగా ఉండాలని మోడి కూడా చెప్పారట. రాజధాని గురించి మోడి ఏరోజు నోరిప్పి చెmodi amaravati naidu bjp jagan ycp high court;cbn;bharatiya janata party;switzerland;narendra modi;n. chandrababu naidu;congress;high court;telugu;capital;assembly;industry;mangalagiri;central government;ycp;sardar vallabhai patel;reddy;parliament;partyహెరాల్డ్ ఎడిటోరియల్ : మోడి గురించి చంద్రబాబు ఇంత అబద్ధం చెబుతున్నాడా ?హెరాల్డ్ ఎడిటోరియల్ : మోడి గురించి చంద్రబాబు ఇంత అబద్ధం చెబుతున్నాడా ?modi amaravati naidu bjp jagan ycp high court;cbn;bharatiya janata party;switzerland;narendra modi;n. chandrababu naidu;congress;high court;telugu;capital;assembly;industry;mangalagiri;central government;ycp;sardar vallabhai patel;reddy;parliament;partyWed, 16 Dec 2020 05:00:00 GMTఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబునాయుడుకు ఏదో అయ్యింది. ఏవోవే ఊహించుకునేసి, కలలు కనేసి అదంతా నిజమే అనే భ్రమల్లో నోటికొచ్చింది మాట్లాడేస్తున్నారు. తాజాగా మంగళగిరి పార్టీ కార్యాలయంలో మాట్లాడిన మూడునాలుగు అంశాలు వినటానికే విచిత్రంగా ఉంది. ముందు సర్దార్ వల్లభాయ్ పటేల్, పొట్టిశ్రీములు వర్ధంతికి నివాళులర్పించారు. తర్వాత నేతలు, మీడియాతో మాట్లాడిన విషయాలే విచిత్రంగా ఉన్నాయి. వల్లభాయ్ పటేల్, పొట్టి శ్రీరాములు తెలుగువారిని ఐక్యం చేశారని చెప్పారు. మరి పొట్టి శ్రీరాములు తెలుగువారిని ఐక్యం చేసింది నిజమైతే రాష్ట్రవిభనకు చంద్రబాబు ఒకటి కాదు రెండుకాదు ఏకంగా మూడుసార్లు లేఖలు ఎందుకిచ్చినట్లు ? ఒకవైపు రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ లోని సీనియర్లలో విభేదాలున్నాయి. ఇదే సమయంలో బీజేపీ అగ్రనేతల్లో కూడా కొందరు రాష్ట్ర విభజనకు మద్దతుగా మాట్లాడారు. మరి తెలుగువాళ్ళ ఐక్యం గురించి ఇంతగా మాట్లాడుతున్న చంద్రబాబు ఆరోజు రాష్ట్ర విభజనకు లేఖలు ఎందుకిచ్చినట్లు ? పొట్టి శ్రీరాములు ఆశయానికి తూట్లుపొడిచిన చంద్రబాబు ఇపుడు వర్ధంతిని జరపటమే విచిత్రంగా ఉంది.




అమరావతిలో తాను తలపెట్టినట్లుగానే పార్లమెంటులో కూడా అన్నీ కార్యాలయాలను ఒకేచోటకు చేర్చేందుకు ప్రయత్నం జరుగుతోందన్నారు. అంటే తనను నరేంద్రమోడి ఫాలో అవుతున్నారన్నట్లుగా చంద్రబాబు చెప్పుకున్నారు. కానీ ఇక్కడ గమనించాల్సిందేమంటే నాలుగంతస్తుల పార్లమెంటు భవనానికి కేంద్రం ఖర్చుపెడుతున్నది రూ. 927 కోట్లు మాత్రమే. కానీ చంద్రబాబు మాత్రం తాత్కాలిక అసెంబ్లీ, తాత్కాలిక సచివాలయం, తాత్కాలిక హైకోర్టుకే రూ. 1200 కోట్లు ఖర్చుపెట్టారు. పై భవనాలకు తాత్కాలికం పేరుతో చంద్రబాబు భారీ ఎత్తున అవినీతికి పాల్పడినట్లు వైసీపీ నేతల ఆరోపణలు అందరికీ తెలిసిందే.




ఇక మూడో అంశంగా ప్రతిపక్షాలన్నీ అమరావతికే కట్టుబడుంటే జగన్మోహన్ రెడ్డి మాత్రం మూడు రాజధానులంటూ ఎందుకు మంకు పట్టుపట్టుపడుతున్నాడని ప్రశ్నించటమే విచిత్రంగా ఉంది. ఎందుకంటే ఆరోజుల్లో అమరావతిని రాజధానిగా వద్దని, స్విస్ ఛాలెంజి పద్దతిలో రాజధాని నిర్మాణం వద్దని చాలామంది చెబితే చంద్రబాబు విన్నారా ? ఏడాదికి పచ్చని మూడు పంటలు పండే ప్రాంతాన్ని నాశనం చేయద్దని ఎంతమంది మొత్తుకున్నా చంద్రబాబు ఎందుకు పట్టించుకోలేదు ? ఇక ఫైనల్ గా అమరావతే రాజధానిగా ఉండాలని మోడి కూడా చెప్పారట. రాజధాని గురించి మోడి ఏరోజు నోరిప్పి చెప్పలేదు. పైగా రాష్ట్ర రాజధాని నిర్ణయంతో కేంద్రానికి సంబంధం లేదని స్పష్టంగా మూడుసార్లు అఫిడవిట్లు దాఖలు చేశారంటేనే మోడి ఆలోచనేంటో అర్ధమైపోతోంది. మరి మోడి చెప్పని మాటను చెప్పినట్లుగా చంద్రబాబు ఎందుకిన్ని అబద్దాలు చెబుతున్నారో ఎవరికీ అర్ధం కావటం లేదు.




భారీ బడ్జెట్ 'రామాయణం'.. డైలాగ్స్ రాసేసిన మాటల మాంత్రికుడు!

పశ్చిమ బెంగాల్లో రసవత్తర రాజకీయం..!

కొవిడ్ వ్యాక్సిన్ ఎంట్రీకి కౌంట్ డౌన్..!

వ్యవసాయ చట్టాలపై.. రైతులతో మోదీ మాటామంతీ..

ఆ సూర్య గ్రహణాన్ని చూడాలంటే..!

బిగ్‌బాస్-4: గ్రాండ్ ఫినాలేలో హాట్ హీరోయిన్ల ఆటపాట?

లండన్‌లో కొత్త రకం కరోనా.. మామూలు కన్నా వేగంగా వ్యాప్తి!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>