MoviesP Subhadra devieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-kalyanbdde283d-61df-4502-bf8a-b0d5b6144667-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-kalyanbdde283d-61df-4502-bf8a-b0d5b6144667-415x250-IndiaHerald.jpgదర్శకుడు క్రిష్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో ఒక మూవీ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. అయితే, అనుకుంటున్నట్టుగా అన్నీ సక్రమంగా జరగడంలేదని, దాంతో దర్శకుడు క్రిష్ ఇరిటేట్ అవుతున్నాడనీ ఒక రూమర్ వినిపిస్తోంది. క్రిష్ కు ఈ సినిమా షూటింగ్ ని తొందరగా మొదలుపెట్టాలని ఉందట. అయితే, పవన్ కళ్యాణ్ వైపు నుంచి ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అవుతూ వస్తోందట. దాంతో, దర్శకుడు క్రిష్ ఎంతో అసౌకర్యానికి గురవుతున్నాడని ఇండస్ట్రీలో ఒకటే వార్తలు వినిపిస్తున్నాయి.pawan kalyan;pawan;harish shankar;kalyan;krish;pawan kalyan;shankar;cinema;producer;remake;producer1;letter;pink;partyపవన్తో అసౌకర్యానికి గురవుతున్న క్రిష్?పవన్తో అసౌకర్యానికి గురవుతున్న క్రిష్?pawan kalyan;pawan;harish shankar;kalyan;krish;pawan kalyan;shankar;cinema;producer;remake;producer1;letter;pink;partyWed, 16 Dec 2020 10:00:00 GMTదర్శకుడు క్రిష్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో ఒక మూవీ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. అయితే, అనుకుంటున్నట్టుగా అన్నీ  సక్రమంగా జరగడంలేదని, దాంతో దర్శకుడు క్రిష్ ఇరిటేట్ అవుతున్నాడనీ ఒక రూమర్ వినిపిస్తోంది. క్రిష్ కు ఈ సినిమా షూటింగ్ ని తొందరగా మొదలుపెట్టాలని ఉందట. అయితే, పవన్ కళ్యాణ్ వైపు నుంచి ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అవుతూ వస్తోందట. దాంతో, దర్శకుడు క్రిష్ ఎంతో అసౌకర్యానికి గురవుతున్నాడని ఇండస్ట్రీలో ఒకటే వార్తలు వినిపిస్తున్నాయి.



పవన్ కళ్యాణ్ ఎన్నో సినిమాలను ఒప్పుకున్నాడని సమాచారం. పవన్ ఇప్పటికే 'పింక్' తెలుగు రీమేక్ ని ఫినిష్ చేశాడట. ఇదిలా ఉంటే మరోపక్క 'అయ్యప్పనుమ్ కోషియమ్' సినిమాని పవన్ ఒప్పుకున్నట్టు వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే. హరీష్ శంకర్, మైత్రితో కూడా మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట పవన్. అయితే, వీటిలో ఏ ప్రాజెక్టు ముందు ఉంటుందో ఏ ప్రాజెక్టు వెనుక ఉంటుందో అన్న విషయంపై స్పష్టత లేదు. ఈ కారణం చేత క్రిష్ ఎంతో అసౌకర్యానికి గురవుతున్నాడని టీ టౌన్ కోడై కూస్తోంది.



సినిమా కమిట్మెంట్లను పక్కన పెడితే, పొలిటికల్ మీటింగ్స్ తో, పార్టీ డిస్కషన్స్ తో కూడా పవన్ బిజీగా ఉన్నాడని సమాచారం. వీటి ప్రభావం కూడా పవన్ సినిమా షూటింగ్ ప్లాన్స్ పై పడుతోందని వినికిడి. వీటన్నిటి కారణంగా దర్శకుడు క్రిష్ ఎంతో ఇరిటేట్ అవుతున్నాడట. 



ఇంకా సినిమా కోసం సిటీలోనే ఒక భారీ సెట్ ని నిర్మించిందట సినిమా బృందం. సముద్రం, పడవ సెట్ అట అది. ఈ సెట్ సినిమాలో ఎంతో ప్రముఖమైన పాత్రను పోషిస్తుందట. సహజంగా కనిపించాలన్న ఉద్దేశ్యంతో ఈ సెట్ ని నిర్మించారట. అయితే, వర్షాల కారణంగా ఈ సెట్ దెబ్బతిందని తెలుస్తోంది. దాంతో, నిర్మాత ఏ.ఎం. రత్నంకు బాగా లాస్ వచ్చిందని వినికిడి. ఈ కారణంగా కూడా షూటింగ్ కి మరింత ఆలస్యం అయినట్టు తెలుస్తోంది.




మిల్క్ బ్యూటీ కి బ్రేకప్ ఉందంటున్న సామ్

భారీ బడ్జెట్ 'రామాయణం'.. డైలాగ్స్ రాసేసిన మాటల మాంత్రికుడు!

పశ్చిమ బెంగాల్లో రసవత్తర రాజకీయం..!

కొవిడ్ వ్యాక్సిన్ ఎంట్రీకి కౌంట్ డౌన్..!

వ్యవసాయ చట్టాలపై.. రైతులతో మోదీ మాటామంతీ..

ఆ సూర్య గ్రహణాన్ని చూడాలంటే..!

బిగ్‌బాస్-4: గ్రాండ్ ఫినాలేలో హాట్ హీరోయిన్ల ఆటపాట?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P Subhadra devi]]>