MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/saidharam-tej1d56838f-98b4-4019-99f2-f513606db0ce-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/saidharam-tej1d56838f-98b4-4019-99f2-f513606db0ce-415x250-IndiaHerald.jpgవాస్తవానికి తెలుగు రాష్ట్రాలలో ధియేటర్లు ఓపెన్ అయినప్పటికీ చాల చోట్ల ఇంగ్లీష్ సినిమాలు ఇప్పటికే ఓటీటీ లో విడుదలైన సినిమాలు ప్రదర్శింపబడుతున్న నేపధ్యంలో ప్రేక్షకుల స్పందనను పూర్తిగా అంచనా వేయలేకపోతున్నారు. ఇలాంటి పరిస్థితులలో ఇప్పుడు అందరి దృష్టి క్రిస్మస్ రోజున విడుదల కాబోతున్న సాయి ధరమ్ తేజ్ ‘సోలో బ్రతుకే సో బెటర్’ మూవీ పై ఉంది.వాస్తవానికి ఈ సినిమా ధియేటర్లలలో విడుదల అవుతున్నా సాంప్రదాయబద్ధమైన బయ్యర్ల కొనుగోలు లేకుండా ఈమూవీ డైరెక్ట్ గా ధియేటర్లలలో విడుదల అవుతోంది. ఈ మూవీని ఇప్పటికే జీ స్టూడిsaidharam tej;kranthi;kranti;raj;sai dharam tej;christmas;makar sakranti;tollywood;cinema;sankranthi;solo bathuke so better;dil;krack;redటాలీవుడ్ ను కన్ఫ్యూజ్ చేస్తున్న సాయి ధరమ్ తేజ్ !టాలీవుడ్ ను కన్ఫ్యూజ్ చేస్తున్న సాయి ధరమ్ తేజ్ !saidharam tej;kranthi;kranti;raj;sai dharam tej;christmas;makar sakranti;tollywood;cinema;sankranthi;solo bathuke so better;dil;krack;redWed, 16 Dec 2020 10:00:00 GMTక్రిస్మస్ రోజున విడుదల కాబోతున్న సాయి ధరమ్ తేజ్ ‘సోలో బ్రతుకే సో బెటర్’ మూవీ పై ఉంది.


వాస్తవానికి ఈ సినిమా ధియేటర్లలలో విడుదల అవుతున్నా సాంప్రదాయబద్ధమైన బయ్యర్ల కొనుగోలు లేకుండా ఈమూవీ డైరెక్ట్ గా ధియేటర్లలలో విడుదల అవుతోంది. ఈ మూవీని ఇప్పటికే జీ స్టూడియోస్ టోకుగా కొనుక్కోవడంతో ఈ మూవీ నిర్మాతలకు ఎటువంటి టెన్షన్ లేదు.


ఈ మూవీని కొనుక్కున్న జీ స్టూడియోస్ తెలుగు రాష్ట్రాలలో ఈ మూవీ ధియేట్రికల్ రైట్స్ ను చాల తక్కువ ధరకు యూవీ డిస్ట్రిబ్యూటర్స్ మరియు దిల్ రాజ్ కు అమ్మినట్లు తెలుస్తోంది. ఈ విధానం విజయవంతం అయితే మరిన్ని విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాలను జీ స్టూడియో కొనడానికి ఆశక్తి కనపరుస్తోంది అన్న వార్తలు వస్తున్నాయి. దీనితో ఈ ప్రయోగం జయాపజయాలను బట్టి సంక్రాంతి సినిమాల పరిస్థితి ఆధారపడి ఉంటుంది అని అంటున్నారు.


ధియేటర్లు ఓపెన్ అయినప్పటికీ ఇప్పటికీ ప్రభుత్వ నిబంధనల కారణంగా ధియేటర్ లోని సగం సీట్లు ఖాళీ ఉంచి మిగతా సగం సీట్ల టిక్కెట్లు అమ్మకం జరిపే విధానం సంక్రాంతి వరకు కొనసాగుతుంది అని అంటున్నారు. ఇలాంటి పరిస్థితులలో సంక్రాంతి రేస్ కు రెడీ అవుతున్న ‘రెడ్’ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్’ ‘క్రాక్’ సినిమాలకు సంబంధించి బయ్యర్ల సపోర్ట్ లేకుండా డైరెక్ట్ గా విడుదల చేసే సాహసం చేసే పరిస్థితులలో ఈమూవీ నిర్మాతలు లేరు. అదే జరిగితే రాబోతున్న సంక్రాంతికి కూడ కేవలం చిన్న సినిమాల హడావిడి మాత్రమే ఉంటుంది అన్న అంచనాలు ఉన్నాయి. దీనితో సాయి తేజ్ ఇండస్ట్రీని కన్ఫ్యూజ్ చేస్తున్నాడు అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి..    


మిల్క్ బ్యూటీ కి బ్రేకప్ ఉందంటున్న సామ్

భారీ బడ్జెట్ 'రామాయణం'.. డైలాగ్స్ రాసేసిన మాటల మాంత్రికుడు!

పశ్చిమ బెంగాల్లో రసవత్తర రాజకీయం..!

కొవిడ్ వ్యాక్సిన్ ఎంట్రీకి కౌంట్ డౌన్..!

వ్యవసాయ చట్టాలపై.. రైతులతో మోదీ మాటామంతీ..

ఆ సూర్య గ్రహణాన్ని చూడాలంటే..!

బిగ్‌బాస్-4: గ్రాండ్ ఫినాలేలో హాట్ హీరోయిన్ల ఆటపాట?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>