PoliticsP.Phanindraeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/eluru207f486a-959d-48a8-8237-952222609dcf-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/eluru207f486a-959d-48a8-8237-952222609dcf-415x250-IndiaHerald.jpg ఏపీలోని ఏలూరులో ఇటీవల పుట్టుకొచ్చిన వింత వ్యాధి కలకలం రేపింది. దీని భయంతో ఏలూరు ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ఊరు వదిలి పారిపోవాల్సి వచ్చింది. డిసెంబర్ నెలలో జరగాల్సిన వందలాది కార్యక్రమాలు ఈ వింత వ్యాధి కారణంగా ఆగిపోయాయి. ఈ వింత వ్యాధి వచ్చి రోజులు గడిచినా దీనికి గల కారణాలపై ఇప్పటి వరకు స్పష్టమైన రిపోర్టు రాలేదు.eluru;manu;jagan;mandula;cm;december;eluru;vఏలూరు వింత వ్యాధికి కారణమిదే.. బయటపెట్టిన అధికారులుఏలూరు వింత వ్యాధికి కారణమిదే.. బయటపెట్టిన అధికారులుeluru;manu;jagan;mandula;cm;december;eluru;vWed, 16 Dec 2020 22:34:40 GMTడిసెంబర్ నెలలో జరగాల్సిన వందలాది కార్యక్రమాలు ఈ వింత వ్యాధి కారణంగా ఆగిపోయాయి. ఈ వింత వ్యాధి వచ్చి రోజులు గడిచినా దీనికి గల కారణాలపై ఇప్పటి వరకు స్పష్టమైన రిపోర్టు రాలేదు. అయితే తాజాగా ఈ వ్యాధికి సంబంధించి ప్రభుత్వానికి నిపుణుల కమిటీ ఓ నివేదికను సమర్పించింది. ఏలూరులో అంత మంది అస్వస్థతకు గురవడానికి పురుగుల మందుల అవశేషాలే కారణమని నిపుణులు అభిప్రాయపడ్డారు. ఎయిమ్స్‌, నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్ కెమికల్స్‌ సంస్థలు ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి. అయితే పురుగుల మందుల అవశేషాలు అసలు మనుషుల శరీరాల్లోకి ఎలా వెళ్లాయన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

దీనిపై మరింత అధ్యయనం అవసరమని నిపుణులు సీఎంకు వివరించినట్టు తెలుస్తోంది. ఏలూరులో వింత వ్యాధి ఎప్పుడైతే కలకలం సృష్టించిందో ఆరోజు నుంచే తాగునీటిని పూర్తిగా అధికారులు ఆపివేశారు. ఇప్పుడు పురుగుల మందు అవశేషాలు కలిశాయంటూ రిపోర్టు రావడంతో.. ఏలూరులో తాగునీరు, మట్టి, ఆహారంపై పరీక్షలు చేయాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు. పరీక్షలు చేసిన అనంతరం వచ్చిన ఫలితాల ఆధారంగా దీనికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన చీఫ్ సెక్రటరీ నీలం సాహ్నిని ఆదేశించారు. ఏలూరు ఘటన ప్రజల్లో ఎంతో భయాన్ని పుట్టించిందని, ఇలాంటి ఘటనలు భవిష్యత్‌లో పునరావృతం కాకుండా చూడాలని సీఎం జగన్ సూచించారు.

అంతేకాకుండా ప్రతీ జిల్లాలోనూ ల్యాబ్‌లు ఏర్పాటు చేయాలని, ప్రజలు భయభ్రాంతులకు గురవకుండా ఉండేలా చర్యలు తీసుకుంటూ ముందుకు పోవాలని సీఎస్‌కు సీఎం జగన్ తెలిపారు.కాగా.. ఇంతకు ముందు ఏలూరు బాధితులకు పరీక్షలు నిర్వహించగా సీసం కలిసినట్టుగా రిపోర్టులో తెలిసినట్టు అధికారులు సీఎంకు వివరించిన విషయం తెలిసిందే.


నిర్భయ తల్లి సంచలన ప్రతిజ్ఞ

సాగు చట్టాలా మజాకా.. దేశంలోనే తొలిసారి వ్యాపారికి జరిమానా!

ప్రేయసి కోసం సముద్రాన్ని దాటి.. చివరకు జైలు పాలైన లవర్!

పెద్ద సినిమాలు తొక్కిపడేస్తాయట...?

ఆ సినిమా కోసం డైరెక్టర్ వేటలో కింగ్ నాగార్జున.. కథేంటంటే..

పాక్ యుద్ధంపై ప్రధానిని వ్యతిరేకించిన భారత జనరల్.. భయపడి కాదు..!

ఆదిపురుష్ నుంచి సైఫ్ ఆలీఖాన్ అవుట్...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Phanindra]]>