MoviesP Subhadra devieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore////images/movies/movies_latestnews/naga-chaitanyad779b0f1-86ad-42c8-abba-b4b30d4a1660-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore////images/movies/movies_latestnews/naga-chaitanyad779b0f1-86ad-42c8-abba-b4b30d4a1660-415x250-IndiaHerald.jpgవిక్రమ్ కుమార్ కే, అక్కినేని నాగ చైతన్య కలిసి వర్క్ చేస్తోన్న ప్రాజెక్టు పేరు 'థాంక్ యూ'. వీళ్లిద్దరు కలిసి ఇదివరకు 'మనం' సినిమా కోసం వర్క్ చేశారు. అక్కినేని మూడు తరాలు నటించిన ఈ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది.naga chaitanya;ravi;naga chaitanya;kumaar;shiva;naga;nageshwara rao akkineni;ravi anchor;sekhar;siva nirvana;vikram;kamma;cinema;naga aswin;majili;love;lord siva;letter;heroine;shiva nirvana;chaitanya 1;dil;sai pallavi;love story;chitramఆ ముగ్గురి హీరోయిన్లకు నాగచైతన్య 'థాంక్ యూ'?ఆ ముగ్గురి హీరోయిన్లకు నాగచైతన్య 'థాంక్ యూ'?naga chaitanya;ravi;naga chaitanya;kumaar;shiva;naga;nageshwara rao akkineni;ravi anchor;sekhar;siva nirvana;vikram;kamma;cinema;naga aswin;majili;love;lord siva;letter;heroine;shiva nirvana;chaitanya 1;dil;sai pallavi;love story;chitramWed, 16 Dec 2020 11:00:00 GMTవిక్రమ్ కుమార్ కే, అక్కినేని నాగ చైతన్య కలిసి వర్క్ చేస్తోన్న ప్రాజెక్టు పేరు 'థాంక్ యూ'. వీళ్లిద్దరు కలిసి ఇదివరకు 'మనం' సినిమా కోసం వర్క్  చేశారు. అక్కినేని మూడు తరాలు నటించిన ఈ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది.



ఇదిలా ఉంటే... 'థాంక్ యూ' ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చేసింది. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ వచ్చే ఏడాది మొదలవనుంది. ఆసక్తికరమైన విషయమేమిటంటే... ఈ చిత్రంలో నాగచైతన్యని మూడు వైవిధ్య పాత్రలలో చూడవచ్చట.



శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన 'మజిలీ' సినిమా తరువాత, నాగ చైతన్య ఏ ప్రాజెక్టు పడితే ఆ ప్రాజెక్టు ఒప్పుకోవడం లేదు. ప్రయోగాత్మకంగా, నటనకు ఆస్కారం ఉండే స్క్రిప్ట్ లకు మాత్రమే నాగచైతన్య గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు.



'థాంక్ యూ'లో చైతన్య ఒక గ్రామీణ యువకుడిగా అలాగే ఎన్ఆర్ఏగా నటిస్తున్నాడని వినికిడి. ఈ ప్రాజెక్టు కోసం ముగ్గురు కథానాయకుల పేర్లను ఈ సినిమా బృందం ఫైనలైజ్ చేయడానికి ఆలోచిస్తోందట. వాళ్ళని ఇంకా ఫైనలైజ్ చేయాల్సి ఉంది. ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందని సమాచారం. 



ఇంకా ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా ఆఖరి దశల్లో ఉన్నట్టు సమాచారం. బివిఎస్ రవి ఈ సినిమాకు కథను అందించాడు. విక్రమ్ కుమార్ ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే ని అందిస్తున్నాడు. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నాడు. ఈ మూవీకి సంబంధించిన పూర్తి వివరాలు తొందరలోనే బయటకు వస్తాయి.  



ఇదిలా ఉంటే నాగచైతన్య ప్రస్తుతం 'లవ్ స్టోరీ' చిత్రం రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ మూవీకి శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించాడు. ఇందులో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. శేఖర్ కమ్ముల - నాగచైతన్య కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి.




మళ్ళీ మొదలైన మాజీ ప్రేమికుల గొడవ...!

అమరావతి ఏకైక రాజధాని... జగన్ పప్పులు ఉడకవా..?

ఏపీ స్థానిక ఎన్నిక‌లు ఇప్ప‌ట్లో లేన‌ట్లేనా..? కోర్టు విచార‌ణ సారాంశం అదేనా...?

భారీ బడ్జెట్ 'రామాయణం'.. డైలాగ్స్ రాసేసిన మాటల మాంత్రికుడు!

పశ్చిమ బెంగాల్లో రసవత్తర రాజకీయం..!

కొవిడ్ వ్యాక్సిన్ ఎంట్రీకి కౌంట్ డౌన్..!

వ్యవసాయ చట్టాలపై.. రైతులతో మోదీ మాటామంతీ..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P Subhadra devi]]>