PoliticsVasueditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/landregistrationstechnicalproblem97c76c77-6385-4f0f-b963-7bd3a0e73f6f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/landregistrationstechnicalproblem97c76c77-6385-4f0f-b963-7bd3a0e73f6f-415x250-IndiaHerald.jpgవ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల ప్రక్రియను వారం రోజుల్లో గాడిలో పెడతామని, సాంకేతికపరంగా ఎదురవుతున్న అన్ని సమస్యలను పరిష్కరించి ప్రజలకు సులభతరంగా రిజిస్ట్రేషన్‌ సేవలు అందుబాటులోకి తెస్తామని ఆర్‌ అండ్‌ బీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి పేర్కొన్నారు. వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లపై ఏర్పాటైన కేబినెట్‌ సబ్‌కమిటీ మంగళవారం మూడు గంటల పాటు సమావేశమైంది. ఈ సబ్‌ కమిటీ చైర్మన్‌గా వ్యవహరిస్తున్న ప్రశాంత్‌రెడ్డి సమావేశం అనంతరం మాట్లాడుతూ.. రాష్ట్రంలోని భూములు, ఆస్తులకు సంబంధించిన అన్ని క్రయవిక్రయాలు పారదర్శకmeeting;ktr;ali;dharani;minister;96రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కు సాంకేతిక సమస్యలురిజిస్ట్రేషన్ల ప్రక్రియ కు సాంకేతిక సమస్యలుmeeting;ktr;ali;dharani;minister;96Wed, 16 Dec 2020 08:32:02 GMT
వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల ప్రక్రియను వారం రోజుల్లో గాడిలో పెడతామని, సాంకేతికపరంగా ఎదురవుతున్న అన్ని సమస్యలను పరిష్కరించి ప్రజలకు సులభతరంగా రిజిస్ట్రేషన్‌ సేవలు అందుబాటులోకి తెస్తామని ఆర్‌ అండ్‌ బీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి పేర్కొన్నారు. వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లపై ఏర్పాటైన కేబినెట్‌ సబ్‌కమిటీ మంగళవారం మూడు గంటల పాటు సమావేశమైంది. ఈ సబ్‌ కమిటీ చైర్మన్‌గా వ్యవహరిస్తున్న ప్రశాంత్‌రెడ్డి సమావేశం అనంతరం మాట్లాడుతూ.. రాష్ట్రంలోని భూములు, ఆస్తులకు సంబంధించిన అన్ని క్రయవిక్రయాలు పారదర్శకంగా జరగాలని, ప్రజలకు సులభతరంగా అందుబాటులోకి తేవాలనే ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్‌.. మంత్రి వర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారని, ప్రజలు తమంతట తామే రిజిస్ట్రేషన్‌ చేసుకునేలా ధరణి పోర్టల్‌ను ప్రారంభించారని చెప్పారు. సీఎం ఆదేశాలకు అనుగుణంగా సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ నేతృత్వంలోని ప్రభుత్వ యంత్రాంగం 100 రోజుల పాటు నిర్విరామంగా కష్టపడ్డారని, దేశంలో ఎక్కడా లేని విధంగా పారదర్శకంగా ఉండే పోర్టల్‌ను ప్రజలకు అందుబాటులోకి తెచ్చారని వివరించారు. ఉపసంఘం సమావేశం అనంతరం సభ్యులు కేటీఆర్, మహమూద్‌ అలీ, ఎర్రబెల్లి దయాకర్‌రావు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతూ.. వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల విషయంలో అన్ని అవరోధాలను త్వరలోనే అధిగమిస్తామని చెప్పారు. ఇందుకోసం అధికారులను మూడు బృందాలుగా విభజించామని వెల్లడించారు. సాంకేతిక సమస్యల పరిష్కారానికి ఓ బృందం, చట్టపరమైన ఇబ్బందులకు మరో బృందం, క్షేత్రస్థాయిలో పర్యవేక్షణకు మరో బృందంగా ఏర్పడి అధికారులు పనిచేస్తారని చెప్పారు.


నాలుగు కేటగిరీలుగా విభజన..
ఏ ప్రక్రియ ప్రారంభించినా మొదట్లో ఇబ్బందులు ఉంటాయని, వాటిని అధిగమించి ప్రజలకు సులభతర రిజిస్ట్రేషన్‌ సేవలను త్వరలోనే అందుబాటులోకి తెస్తామని ప్రశాంత్‌రెడ్డి చెప్పారు. సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాలను నాలుగు కేటగిరీలుగా విభజించామని వివరించారు. డాక్యుమెంట్‌ పేపర్ల విషయంలో బ్యాంకర్లకు ఎలాంటి అపోహలున్నా తొలగిస్తామని, రాష్ట్రంలో రియల్‌ ఎస్టేట్‌ రంగం అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. జీపీఏ, ఎస్పీఏలను త్వరలోనే అందుబాటులోకి తెస్తామని పేర్కొన్నారు. ఆగిన రిజిస్ట్రేషన్లను పూర్తి చేయడానికి ఎక్కువ రిజిస్ట్రేషన్లు జరిగే కార్యాలయాల్లో అదనపు ఉద్యోగులను నియమించి 3 నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. సేల్‌ డీడ్‌లపై ఉన్న అపోహలను తొలగిస్తామని చెప్పారు



రికార్డు స్థాయిలో డిగ్రీ అడ్మిషన్లు.. ఎక్కువ ఏ గ్రూప్ తీసుకున్నారో తెలుసా..?

భారీ బడ్జెట్ 'రామాయణం'.. డైలాగ్స్ రాసేసిన మాటల మాంత్రికుడు!

పశ్చిమ బెంగాల్లో రసవత్తర రాజకీయం..!

కొవిడ్ వ్యాక్సిన్ ఎంట్రీకి కౌంట్ డౌన్..!

వ్యవసాయ చట్టాలపై.. రైతులతో మోదీ మాటామంతీ..

ఆ సూర్య గ్రహణాన్ని చూడాలంటే..!

బిగ్‌బాస్-4: గ్రాండ్ ఫినాలేలో హాట్ హీరోయిన్ల ఆటపాట?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vasu]]>