MoviesAnilkumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/samantha648d568e-9817-4952-8abf-2f16c328122a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/samantha648d568e-9817-4952-8abf-2f16c328122a-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఇండస్ట్రీలో నాగ చైతన్య సరసన ఏమాయ చేసావే' చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చినసమంత.. అందం, అభినయంతో ఎన్నో వైవిధ్యమైన పాత్రలలో నటించి ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుంది. స్టార్ హీరోల సరసన నటించి అతి కొద్ది సమయంలోనే స్టార్ స్టేటస్ ని అందుకుంది.ఆ తర్వాత తన మొదటి హీరో అయిన నాగ చైతన్యను ప్రేమించి.. తమ కుటుంబ సభ్యుల సమ్మతంతోనే ప్రేమ వివాహం చేసుకొని అక్కినేని ఇంటికి కోడలైపోయింది..ఇక పెళ్ళైన తర్వాత కూడా నటనను కొనసాగిస్తూ ఒకవైపు వైవాహిక జీవితాన్ని మరోవైపు సినీ జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకsamantha;naga chaitanya;abinaya;naga;nageshwara rao akkineni;prema;sam;samantha;tollywood;cinema;naga aswin;tamil;majili;marriage;love;hero;heroine;mahanati;oh baby;chaitanya 1;super deluxe;sam mendes;chitramఅసలు సమంత పెళ్లి చేసుకోవాలని ఎందుకు డిసైడ్ అయ్యిందో తెలుసా..??అసలు సమంత పెళ్లి చేసుకోవాలని ఎందుకు డిసైడ్ అయ్యిందో తెలుసా..??samantha;naga chaitanya;abinaya;naga;nageshwara rao akkineni;prema;sam;samantha;tollywood;cinema;naga aswin;tamil;majili;marriage;love;hero;heroine;mahanati;oh baby;chaitanya 1;super deluxe;sam mendes;chitramWed, 16 Dec 2020 15:00:00 GMTటాలీవుడ్ ఇండస్ట్రీలో నాగ చైతన్య సరసన  ఏమాయ చేసావే' చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చినసమంత.. అందం, అభినయంతో ఎన్నో వైవిధ్యమైన పాత్రలలో నటించి ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుంది. స్టార్ హీరోల సరసన నటించి అతి కొద్ది సమయంలోనే స్టార్ స్టేటస్ ని అందుకుంది.ఆ తర్వాత తన మొదటి హీరో అయిన నాగ చైతన్యను ప్రేమించి.. తమ కుటుంబ సభ్యుల సమ్మతంతోనే  ప్రేమ వివాహం చేసుకొని అక్కినేని ఇంటికి కోడలైపోయింది..ఇక పెళ్ళైన తర్వాత కూడా నటనను కొనసాగిస్తూ ఒకవైపు వైవాహిక జీవితాన్ని మరోవైపు సినీ జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తోంది. సహజంగా వివాహం అనంతరం కథానాయికలకు హీరోయిన్ అవకాశాలు రావని అంటుంటారు మన ఇండ్రస్టీ లో.

అయితే మన సమంత మాత్రం పెళ్లి అనేది హీరోయిన్ల కెరీర్ కు అడ్డంకి కాదని నిరూపిస్తోంది. సినిమాలతోనే కాకుండా హోస్ట్ గా కూడా వ్యవహరిస్తూ అదరగొడుతోంది.ప్రముఖ ఓ.టి.టి. ఆహా యాప్ లో సామ్ జామ్ అనే టాక్ షో కు సమంత వ్యాఖ్యాత గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా సమంత ఈ టాక్ షో లో మాట్లాడుతూ పెళ్లి తర్వాత అవకాశాలపై ఆసక్తికర విషయాలను వెల్లడించింది. హీరోయిన్ల కెరీర్ కి వివాహం అడ్డంకి కాదని నిరూపించాలనో లేదా అలాంటి అపోహను తొలగించాలనే ఆలోచనతో తాను కెరీర్ ప్రారంభించలేదని సామ్ చెప్పుకొచ్చింది. పెళ్లి తర్వాత అవకాశాలు రావనే అనుకున్నానని సమంత తన మనసులో మాట బయటపెట్టేసింది.

సినిమా అవకాశాలు రావని డిసైడై పెళ్లికి సిద్ధపడినట్టు చెప్పి అందరినీ ఆశ్చర్య పరిచింది. తాను అదృష్టవంతురాలునని.. పెళ్లి తర్వాత 'రంగస్థలం' 'మహానటి' 'ఓ బేబీ' లాంటి సినిమాల్లో నటించే అవకాశాలు వచ్చాయని సమంత ఆనందం వ్యక్తం చేసింది. కాగా సామ్ గతేడాది 'సూపర్ డీలక్స్' 'ఓ బేబీ' 'మజిలీ' సినిమాల్లో నటించి అలరించారు. ఈ ఏడాది 'జాను'తో పలకరించిన సమంత 'ది ఫ్యామిలీ మ్యాన్' సీజన్ 2 తో వెబ్ వరల్డ్ లో అడుగుపెడుతోంది.అంతేకాకుండా తమిళంలో కూడా విగ్నేష్ శివన్ డైరెక్ట్ చేయనున్న ఓ మూవీలో ప్రధాన పాత్ర పోషిస్తుంది..ఇక సమంత నటించిన ఫ్యామిలీ మ్యాన్2 వెబ్ సీరీస్ కూడా త్వరలోనే విడుదల కానుంది...!!


దారుణం: ఇద్దరూ కలిసి ప్రేమించుకున్నారు.. కానీ అంతలోనే..!?

20 నిమిషాల రోల్.. 20 కోట్ల రెమ్యునరేషన్.. సలార్ అంటే ఇదే..!

స్క్రీన్ షేర్ చేసుకోనున్న బాలయ్య, నాగశౌర్య?

బ్లాక్ కాఫీతో వెయిట్ లాస్ సాధ్యమేనా

వీరిలో టాలీవుడ్ నెంబర్ 1 స్టార్ హీరోయిన్ ఎవరు

స్టైలిష్ స్టార్ ని టాప్ హీరోగా నిలబెట్టిన ఆ సినిమాని ఆ హీరో రిజెక్ట్ చేశాడట..

మాట నిలబెట్టుకున్న తెలంగాణా సర్కార్... డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళకు సూపర్ సౌకర్యాలు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>