PoliticsGiddaluri Srinivasa Raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/ngt-gives-new-directions-for-ap-govt-on-sand-policydefe1ef6-594f-409b-af68-246519258734-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/ngt-gives-new-directions-for-ap-govt-on-sand-policydefe1ef6-594f-409b-af68-246519258734-415x250-IndiaHerald.jpgఇసుక తవ్వకాలపై ఆంక్షలు ఉన్న నేపథ్యంలో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో నిర్మాణ అవసరాలకోసం ఇసుక లభ్యత భారీగా తగ్గిపోయింది, దీంతో రేట్లు కూడా అమాంతం పెరిగిపోయాయి. అయితే ఈ విషయంలో జాతీయ హరిత ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు ఇసుక లభ్యతను పెంచేలా ఉంది. ఇసుక అక్రమ తవ్వకాలు జరగకుండా పటిష్ట నిఘా వ్యవస్థ ఏర్పాటు చేసి నిబంధనల ప్రకారం నదులు, రిజర్వాయర్లలో డ్రెడ్జింగ్‌ చేసుకోవచ్చని జాతీయ హరిత ట్రిబ్యునల్‌ (ఎన్జీటీ) తాజాగా రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. దీంతో రిజర్వాయర్లు, నదులలో డ్రెడ్జింగ్ చేసుకునే అవకాశం లభించap sand policy;samatha;tdpహమ్మయ్య.. ఇసుకపై ఇక అలాంటి ఆంక్షలు లేవు..హమ్మయ్య.. ఇసుకపై ఇక అలాంటి ఆంక్షలు లేవు..ap sand policy;samatha;tdpWed, 16 Dec 2020 12:00:00 GMT
ఇసుక డ్రెడ్జింగ్ పై ఆంధ్రప్రదేశ్‌ కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) అనుమతి తప్పనిసరి నిబంధనను మినహాయిస్తూ గతంలో టీడీపీ ప్రభుత్వం 2016లో ఉత్తర్వులిచ్చింది. అయితే దీనిని కొందరు వ్యతిరేకించారు. పీసీబీ అనుమతి లేకుండా తవ్వేస్తూ ఉంటే.. నదులు, రిజర్వాయర్లకు ముప్పు ఏర్పడుతుందని ఎన్జీటీలో ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేశారు. ఇష్టారాజ్యంగా నదులు, రిజర్వాయర్లు, కాలువల్లో ఇసుక తోడేయడం వల్ల భూగర్భ జలమట్టం పడిపోయి కరువు ఏర్పడుతుందని ఎన్జీటీ దృష్టికి తీసుకెళ్లారు. అడ్డగోలుగా ఇసుక తవ్వకాల వల్ల పర్యావరణ సమతుల్యం దెబ్బ తింటుందన్నారు.

అయితే ప్రస్తుత ప్రభుత్వం సవివరంగా ఎన్జీటీకీ ఓ నివేదికను సమర్పించింది. పూడిక వల్ల రిజర్వాయర్ల నిల్వ సామర్థ్యం తగ్గిపోతోందని, కాలువలు, నదుల్లో పూడికతో వచ్చి చేరిన ఇసుకను నిర్దిష్ట పరిమాణంలో తొలగించకుంటే వర్షాల సమయంలో వరదల ముప్పు ఎక్కువగా ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం గణాంకాలతో శాస్త్రీయ నివేదిక సమర్పించింది. నిబంధనలకు లోబడి ఇసుక తవ్వకాల వల్ల పర్యావరణానికి నష్టం ఉండదని  వివరించింది. ఈ అంశాలను పరిగణలోకి తీసుకున్న ఎన్జీటీ కొన్ని నిబంధనలు పాటిస్తూ ఇసుక డ్రెడ్జింగ్‌ చేసుకునేందుకు అనుమతించింది. అనుమతించిన దానికంటే అధిక పరిమాణంలో ఇసుక తవ్వినా, నిబంధనలను ఉల్లంఘించినా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. దీంతో ప్రకాశం, ధవళేశ్వరం బ్యారేజీల్లో ఇసుక డ్రెడ్జింగ్‌కు అవరోధం తొలగిందని అధికారులు పేర్కొంటున్నారు.


వ్యాక్సిన్ అందరికి కష్టమే...?

అమరావతి ఏకైక రాజధాని... జగన్ పప్పులు ఉడకవా..?

ఏపీ స్థానిక ఎన్నిక‌లు ఇప్ప‌ట్లో లేన‌ట్లేనా..? కోర్టు విచార‌ణ సారాంశం అదేనా...?

భారీ బడ్జెట్ 'రామాయణం'.. డైలాగ్స్ రాసేసిన మాటల మాంత్రికుడు!

పశ్చిమ బెంగాల్లో రసవత్తర రాజకీయం..!

కొవిడ్ వ్యాక్సిన్ ఎంట్రీకి కౌంట్ డౌన్..!

వ్యవసాయ చట్టాలపై.. రైతులతో మోదీ మాటామంతీ..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Giddaluri Srinivasa Rao]]>