PoliticsSRISHIVAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ap-cm-jagan-meet-amith-sha2e995939-2d89-46d8-8d68-27db0c426ef2-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ap-cm-jagan-meet-amith-sha2e995939-2d89-46d8-8d68-27db0c426ef2-415x250-IndiaHerald.jpg ఢిల్లీ పర్యటనలో కేంద్రం హోంశాఖ మంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు ఆంధ్రప్రదేశ్ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. ఇద్దరి మధ్య దాదాపు గంట పాటు చర్చలుజరిగాయి.ఇదే ఇప్పుడు ఆసక్తిగా మారింది. అమిత్ షాతో జగన్ ఏం మాట్లాడారన్న దానిపై జోరుగా చర్చలు జరుగుతున్నాయి. రాజకీయ అంశాలపైనే మాట్లాడారనే ప్రచారం జరుగుతోంది. ys jagan;amit shah;tiru;delhi;bharatiya janata party;jagan;amaravati;andhra pradesh;amith shah;high court;kurnool;tirupati;cm;chief minister;minister;husband;letter;central government;ycpఅమిత్‌షాతో జగన్ ఏం మాట్లాడారు! ఏపీ రాజకీయాల్లో ఉత్కంఠఅమిత్‌షాతో జగన్ ఏం మాట్లాడారు! ఏపీ రాజకీయాల్లో ఉత్కంఠys jagan;amit shah;tiru;delhi;bharatiya janata party;jagan;amaravati;andhra pradesh;amith shah;high court;kurnool;tirupati;cm;chief minister;minister;husband;letter;central government;ycpWed, 16 Dec 2020 12:41:37 GMT 
              ఢిల్లీ పర్యటనలో కేంద్రం హోంశాఖ మంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు ఆంధ్రప్రదేశ్ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. ఇద్దరి మధ్య దాదాపు గంట పాటు చర్చలు
జరిగాయి. ఇదే ఇప్పుడు ఆసక్తిగా మారింది. అమిత్ షాతో జగన్ ఏం మాట్లాడారన్న దానిపై జోరుగా చర్చలు జరుగుతున్నాయి. రాజకీయ అంశాలపైనే మాట్లాడారనే ప్రచారం జరుగుతోంది. ఢిల్లీలో జరుగుతున్న రైతుల ఆందోళన, కొత్త వ్యవసాయ చట్టాలపై చర్చించారని చెబుతున్నారు.మూడు రాజధానులకు మద్దతు ఇవ్వాలని అమిత్ షాను జగన్ కోరినట్లు సమాచారం. కేంద్రానికి ఇప్పటివరకు మద్దతుగానే ఉన్నారు వైసీపీ ఎంపీలు. ఇకపై కూడా అలాగే ఉండాలని అమిత్ షా చెప్పారని తెలుస్తోంది. త్వరలో జరగనున్న తిరుపతి ఉప ఎన్నికపైనా చర్చ జరిగి ఉండవచ్చని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

             జగన్ పర్యటనపై ప్రకటన విడుదల చేసిన సీఎంవో కార్యాలయం మాత్రం రాష్ట్రానికి సంబంధించిన సమస్యలపైనే అమిత్ షాతో ముఖ్యమంత్రి చర్చించారని చెప్పింది. రాష్ట్రాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయాలన్న ప్రణాళికలో భాగంగానే మూడు రాజధానులను ఏర్పాటు చేయాలనుకుంటున్నామని, విశాఖపట్టణం, అమరావతి, కర్నూలును పరిపాలన, శాసన, న్యాయ రాజధానులుగా చేస్తూ చట్టం చేసినట్టు కేంద్రమంత్రికి జగన్ వివరించారని తెలిపింది. హైకోర్టును కర్నూలుకు తరలించాల్సిన ప్రక్రియను ప్రారంభించాల్సి ఉందని, ఇందుకోసం నోటిఫికేషన్ జారీ చేయాలని కోరారట. గత ఎన్నికల సమయంలో హైకోర్టును కర్నూలులో ఏర్పాటు చేస్తామని బీజేపీ తమ మేనిఫెస్టోలో పేర్కొన్న విషయాన్ని జగన్ ఈ సందర్భంగా అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారని తెలిపింది.

        పోలవరం ప్రాజెక్టు వ్యయాన్ని రూ. 55,656 కోట్లకు పెంచాలని, ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని, కరోనా నేపథ్యంలో అదనంగా రుణాలు తెచ్చుకునేందుకు అనుమతి ఇవ్వాలని జగన్ కోరారు. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా చేపట్టిన బియ్యం పంపిణీకి కేంద్రం నుంచి రాయితీ రూపంలో రావాల్సిన రూ. 1,600 కోట్లను వెంటనే విడుదల చేయాలని, జీఎస్టీ బకాయిలు, రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న 16 మెడికల్ కాలేజీలకు అనుమతులు మంజూరు చేయాలని సీఎం జగన్ కోరినట్టు ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయం తన ప్రకటనలో తెలిపింది. వివిధ రూపాల్లో కేంద్రం నుంచి ఏపీకి రూ. 14,555.07 కోట్లు రావాల్సి ఉన్నట్టు సీఎం తన వినతి పత్రంలో ప్రస్తావించినట్టు వెల్లడించింది. 


వనస్థలిపురంలో డబుల్ బెడ్రూం ఇళ్ల ప్రారంభం

వీరిలో టాలీవుడ్ నెంబర్ 1 స్టార్ హీరోయిన్ ఎవరు

స్టైలిష్ స్టార్ ని టాప్ హీరోగా నిలబెట్టిన ఆ సినిమాని ఆ హీరో రిజెక్ట్ చేశాడట..

మాట నిలబెట్టుకున్న తెలంగాణా సర్కార్... డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళకు సూపర్ సౌకర్యాలు

అమరావతి ఏకైక రాజధాని... జగన్ పప్పులు ఉడకవా..?

ఏపీ స్థానిక ఎన్నిక‌లు ఇప్ప‌ట్లో లేన‌ట్లేనా..? కోర్టు విచార‌ణ సారాంశం అదేనా...?

భారీ బడ్జెట్ 'రామాయణం'.. డైలాగ్స్ రాసేసిన మాటల మాంత్రికుడు!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SRISHIVA]]>