MoviesNaga Sai Ramyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/samantha-akkineni-family-man5cd1b32a-a807-4892-84ed-00f50f59c6ff-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/samantha-akkineni-family-man5cd1b32a-a807-4892-84ed-00f50f59c6ff-415x250-IndiaHerald.jpgకొన్ని నెలల క్రితమే ప్రముఖ నటుడు మనోజ్ బాజ్‌పాయ్ డిజిటల్ స్పేస్ లోకి "ఫ్యామిలీ మ్యాన్" అనే సిరీస్ ద్వారా ఎంటరయ్యాడు. ఎమెజాన్ ప్రైమ్ లో ఈ సిరీస్ అందుబాటులో ఉంది. ఇప్పుడు, ఫ్యామిలీ మ్యాన్ టీం రెండవ సీజన్ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. samantha akkineni family man;nageshwara rao akkineni;samantha;srikanth;tara;allariసమంతలో మరో కోణం గురించి తెలిస్తే షాకవుతారు...!సమంతలో మరో కోణం గురించి తెలిస్తే షాకవుతారు...!samantha akkineni family man;nageshwara rao akkineni;samantha;srikanth;tara;allariWed, 16 Dec 2020 12:54:19 GMT
సెకండ్ సీజన్ లో కూడా మొదటి సీజన్ లో ఉన్న నటీనటులు ఉంటారు. మనోజ్ బాజ్‌పాయ్ శ్రీకాంత్ తివారిగానే కనిపించనున్నాడు. ఐతే, ఈ సిరీస్ లోకి సమంత అక్కినేని కూడా ఎంటరవబోతోంది. డిజిటల్ స్పేస్ లో కూడా సమంత తనదైన ముద్ర వేయడానికి ప్రయత్నిస్తోంది.

ఈ విషయాన్ని సమంత తన అభిమానులకు షేర్ చేసింది. తన డ్రీం రోల్ ను పోషించే అవకాశం తనకు లభించినందుకు టీంకు కృతఙ్ఞతలు చెప్పుకుంది. డిజిటల్ స్పేస్ ప్రస్తుతం అందరికీ అందుబాటులోకి రావడంతో అలాగే లాక్ డౌన్ వంటి అంశాలు డిజిటల్ బూమ్ కు సపోర్ట్ ను ఇవ్వడంతో నటీనటులు ఇందులో కూడా తమదైన ముద్ర వేయాలని తపనపడుతున్నారు.

సమంత ఓ అడుగు ముందుకు వేసి మంచి రోల్ ను కూడా కొట్టేసింది. ఇండియాలో అందరికీ నచ్చిన సిరీస్ లో తనకు కూడా నటించే అవకాశం రావడం తన అదృష్టమని చెప్పుకొచ్చింది. ఇంకా తన రోల్ గురించి ఇలా చెప్పుకొచ్చింది. ఇంతకు తను పోషించిన పాత్రలు ఒక ఎత్తైతే ఇందులో తన పాత్ర మరో ఎత్తు అని చెప్పుకొచ్చింది. తన పాత్ర కచ్చితంగా తన ఫ్యాన్స్ ను సంతోషపెడుతుందని మురిసిపోయింది.

ఈ సిరీస్ లో సమంత యాక్షన్ సీక్వన్సెస్ లో కూడా పాల్గొందట. సమంత ఎనర్జీ అలాగే ఇన్వాల్వ్మెంట్ చూసి మేకర్స్ ఆశ్చర్యపోయారట. చిలిపిగా అల్లరి చేస్తూ అందరినీ కవ్వించే సమంత యాక్షన్ సీక్వన్సెస్ లో కూడా తన ప్రతిభను కనబరిచింది అనంటున్నారు ఫ్యామిలీ మ్యాన్ - 2 మేకర్స్. మొత్తానికి సమంత అభిమానులు ఈ సిరీస్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు.





వనస్థలిపురంలో డబుల్ బెడ్రూం ఇళ్ల ప్రారంభం

వీరిలో టాలీవుడ్ నెంబర్ 1 స్టార్ హీరోయిన్ ఎవరు

స్టైలిష్ స్టార్ ని టాప్ హీరోగా నిలబెట్టిన ఆ సినిమాని ఆ హీరో రిజెక్ట్ చేశాడట..

మాట నిలబెట్టుకున్న తెలంగాణా సర్కార్... డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళకు సూపర్ సౌకర్యాలు

అమరావతి ఏకైక రాజధాని... జగన్ పప్పులు ఉడకవా..?

ఏపీ స్థానిక ఎన్నిక‌లు ఇప్ప‌ట్లో లేన‌ట్లేనా..? కోర్టు విచార‌ణ సారాంశం అదేనా...?

భారీ బడ్జెట్ 'రామాయణం'.. డైలాగ్స్ రాసేసిన మాటల మాంత్రికుడు!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Naga Sai Ramya]]>