PoliticsMallula saibabueditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ycplo-aa-iddari-ragada-mudirindiga-jagan-cheppina-vinatledu467ff49f-6f7e-4e95-8aed-7f955f4a0f76-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ycplo-aa-iddari-ragada-mudirindiga-jagan-cheppina-vinatledu467ff49f-6f7e-4e95-8aed-7f955f4a0f76-415x250-IndiaHerald.jpgఏపీ అధికార పార్టీలో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. 2019 ముందు వరకు అధికారం లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న వైసిపి నాయకులు టిడిపి ప్రభుత్వం పై పెద్ద ఎత్తున విమర్శలు చేద్దాం అని భావించినా, ప్రభుత్వ వేధింపులు కారణంగా చాలామంది వెనక్కి తగ్గే వారు. ఇదే అదనుగా టిడిపి మరింతగా వైసీపీ నాయకులను బెదిరించే వ్యవహారాలకు పాల్పడేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. వైసిపి అధికారంలో ఉంది. ఈ సమయంలో తెలుగుదేశం పార్టీని ఒక ఆట ఆడుకునే అవకాశం వైసిపి నాయకులకు ఉన్నా, పెద్దగా ఎవరూ యాక్టివ్ గా కనిపించడం లేదు. కనీసం ప్రభుత్వంపై టిysrcp ap tdp jagan mlc nominated posts;auto;telugu desam party;jagan;andhra pradesh;2019;telugu;scheduled caste;scheduled tribes;backward classes;government;letter;tdp;success;ycp;party;sasanamandaliపదవులు వచ్చినా .... పెదవి విప్పరేంటయ్యా ?పదవులు వచ్చినా .... పెదవి విప్పరేంటయ్యా ?ysrcp ap tdp jagan mlc nominated posts;auto;telugu desam party;jagan;andhra pradesh;2019;telugu;scheduled caste;scheduled tribes;backward classes;government;letter;tdp;success;ycp;party;sasanamandaliWed, 16 Dec 2020 09:00:00 GMT
ఏపీ అధికార పార్టీలో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. 2019 ముందు వరకు అధికారం లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న వైసిపి నాయకులు టిడిపి ప్రభుత్వం పై పెద్ద ఎత్తున విమర్శలు చేద్దాం అని భావించినా, ప్రభుత్వ వేధింపులు కారణంగా చాలామంది వెనక్కి తగ్గే వారు. ఇదే అదనుగా టిడిపి మరింతగా వైసీపీ నాయకులను బెదిరించే వ్యవహారాలకు పాల్పడేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. వైసిపి అధికారంలో ఉంది. ఈ సమయంలో తెలుగుదేశం పార్టీని ఒక ఆట ఆడుకునే అవకాశం వైసిపి నాయకులకు ఉన్నా, పెద్దగా ఎవరూ యాక్టివ్ గా కనిపించడం లేదు. కనీసం ప్రభుత్వంపై టిడిపి పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ, విరుచుకు పడుతున్నా, దానికి కౌంటర్ ఇచ్చేందుకు కూడా నాయకులు పెద్దగా ఉత్సాహం చూపించకపోవడం చర్చనీయాంశంగా మారింది. 



ఎప్పుడు లేని విధంగా వైసీపీ ప్రభుత్వం లో పెద్ద ఎత్తున నామినేటెడ్ పదవులను, ఎమ్మెల్సీలను జగన్ నియమించారు. అయినా, పదవులు పొందిన వారు ఎవరూ పెద్దగా ప్రభుత్వానికి ఉపయోగపడుతున్నట్టు గా కనిపించడం లేదు.ఎవరికి వారు తమకు ఎందుకు వచ్చింది లే అన్నట్లుగా వ్యవహరిస్తుండడం, టిడిపి మరింత ఘాటు వ్యాఖ్యలు చేస్తూ, ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తోంది. ప్రజల లో చర్చ జరిగే విధంగా తెలుగుదేశం పార్టీ చేస్తున్న విమర్శలు అన్నీ ఇన్ని కావు. మద్యం బ్రాండ్ దగ్గర నుంచి, ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీషు మీడియం,  ఎస్సీ, ఎస్టీ ,బీసీ, మైనార్టీ లపై దాడులు, ఇలా ఎన్నో అంశాల పై విమర్శలు చేస్తున్నా, తిప్పి కొట్టే వారి సంఖ్య అంతంత మాత్రమే.




 ఇక శాసనమండలిలో తెలుగుదేశం బలం ఎక్కువగా ఉండడంతో, ఆ సభలో ప్రభుత్వం పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నా,  వైసీపీ ఎమ్మెల్సీలు వాటిని తిప్పి కొట్టడం విఫలమవుతున్నారు అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం వైసిపి శాసన మండలి పక్ష నేతగా ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఉన్నారు. ఆయనతో పాటు ఇటీవలే చాలా మందికి శాసనమండలి సభ్యులుగా జగన్ అవకాశం కల్పించారు. అయినా పదవులు పొందిన నాయకులు పెదవి విప్పకపోవడం తో అంతిమంగా టిడిపినే పైచేయి సాధిస్తూూ, ప్రజలలో వైసీపీ ప్రభుత్వం పరువును దిగజార్చే ఈ విషయంలో  సక్సెస్ అవుతూ వస్తోంది.దీంతో పదవులు ఇచ్చినా, పార్టీకి ప్రభుత్వానికి ఉపయోగపడడం లేదనే బాధ జగన్ లోనూ వ్యక్తం అవుతోంది.



రవితేజ, రామ్ సినిమాలకు అక్కడ ఫుల్ డిమాండ్..!

భారీ బడ్జెట్ 'రామాయణం'.. డైలాగ్స్ రాసేసిన మాటల మాంత్రికుడు!

పశ్చిమ బెంగాల్లో రసవత్తర రాజకీయం..!

కొవిడ్ వ్యాక్సిన్ ఎంట్రీకి కౌంట్ డౌన్..!

వ్యవసాయ చట్టాలపై.. రైతులతో మోదీ మాటామంతీ..

ఆ సూర్య గ్రహణాన్ని చూడాలంటే..!

బిగ్‌బాస్-4: గ్రాండ్ ఫినాలేలో హాట్ హీరోయిన్ల ఆటపాట?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mallula saibabu]]>