MoviesVasueditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/simrathkaur74805adc-e9c4-41eb-b42c-67d2f6b09bef-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/simrathkaur74805adc-e9c4-41eb-b42c-67d2f6b09bef-415x250-IndiaHerald.jpgసినిమాల్లో రాణించాలంటే అందం ఒక్కటే ఉంటే సరిపోదు .. అభినయం కూడా తెలియాలి. ఈ రెండూ ఉన్నాయికదా ఇక దూసుకుపోవచ్చుననుకుంటే పొరపాటే. ఆ రెండింటికీ అదృష్టం కూడా తోడు కావాలి. అప్పుడే అవకాశాలు తలుపుతడటం .. విజయాలు పలకరించడం .. అంచెలంచెలుగా ఎదగడం జరుగుతుంది. లేదంటే అవకాశాలు ముఖం చాటేస్తాయి .. విజయాలు దోబూచులాడతాయి .. అభిమానులతో గ్యాప్ పెరిగిపోతుంది. అందువలన ప్రయత్నాలను పరుగులు పెట్టిస్తూ అదృష్టాన్ని పరీక్షించుకుంటూ ముందుకు వెళ్లడమే. simrathkaur;auto;karthik;simran bagga;abinaya;hari;hari music;rani;cinema;girl;romantic;prematho mee karthik;paruguమెరుపు తీగకు అదృష్టం కలిసివచ్చేనామెరుపు తీగకు అదృష్టం కలిసివచ్చేనాsimrathkaur;auto;karthik;simran bagga;abinaya;hari;hari music;rani;cinema;girl;romantic;prematho mee karthik;paruguWed, 16 Dec 2020 12:28:06 GMTమెరుపు తీగకు అదృష్టం కలిసివచ్చేనా

సినిమాల్లో రాణించాలంటే అందం ఒక్కటే ఉంటే సరిపోదు .. అభినయం కూడా తెలియాలి. ఈ రెండూ ఉన్నాయికదా ఇక దూసుకుపోవచ్చుననుకుంటే పొరపాటే. ఆ రెండింటికీ అదృష్టం కూడా తోడు కావాలి. అప్పుడే అవకాశాలు తలుపుతడటం .. విజయాలు పలకరించడం .. అంచెలంచెలుగా ఎదగడం జరుగుతుంది. లేదంటే అవకాశాలు ముఖం చాటేస్తాయి .. విజయాలు దోబూచులాడతాయి .. అభిమానులతో గ్యాప్ పెరిగిపోతుంది. అందువలన ప్రయత్నాలను పరుగులు పెట్టిస్తూ అదృష్టాన్ని పరీక్షించుకుంటూ ముందుకు వెళ్లడమే. 

సిమ్రాన్ కౌర్ చాలా నాజూకుగా ఉంటుంది .. ఎల్లోరా గుహల నుంచి ఎగిరొచ్చిన శిల్పంలా ఉంటుంది. అలాంటి ఈ అమ్మాయి 2017లోనే 'ప్రేమతో మీ కార్తీక్' సినిమా ద్వారా తెలుగు తెరకి పరిచయమైంది. ముత్యాలు వర్షిస్తాయేమోననే  కళ్లు .. కెంపులు పేర్చినట్టుగా అనిపించే పెదాలు చూసి కుర్రాళ్లు 'ఔరా!' అంటూ నోరెళ్లబెట్టారు. అయితే ఈ సినిమా ఆడకపోవడం వలన ఆమె అందం గురించిన చర్చ జరగలేదు. ఆ తరువాత చేసిన 'పరిచయం' సినిమాకి కూడా అదే పరిస్థితి ఏర్పడింది. సరైన ఎంపిక లేకపోవడం వలన .. రావలసిన గుర్తింపు రాలేకపోయింది.

 ఈ నేపథ్యంలో ఈ అమ్మాయి 'డర్టీ హరి' సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. దర్శకుడు ఎమ్మెస్ రాజు ఎలాంటి హడావిడి లేకుండా ఈ సినిమాను పూర్తి చేశారు. ఈ నెల 18వ తేదీన ఈ సినిమా ప్రేక్షకులను పలకరించనుంది. ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ చూసిన వాళ్లు .. ప్రమోషన్స్ లో సిమ్రత్ ను చూసిన వాళ్లు కొత్తమ్మాయనే అనుకోవడం ఆశ్చర్యం. రొమాంటిక్ పాళ్లు ఎక్కువగా ఉన్న సినిమా కావడంతో ఈ అమ్మాయి అందరి కళ్లలో పడిపోతోంది. ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో కాస్త గ్లామర్ డోస్ కూడా పెంచేసిందేమో కుర్రాళ్లందరి దృష్టి ఇప్పుడు ఈ సినిమాపైనే ఉంది. చూడాలి .. ఈ సినిమాతోనైనా ఈ మెరుపుతీగకి అదృష్టం కలిసొస్తుందేమో



వనస్థలిపురంలో డబుల్ బెడ్రూం ఇళ్ల ప్రారంభం

వీరిలో టాలీవుడ్ నెంబర్ 1 స్టార్ హీరోయిన్ ఎవరు

స్టైలిష్ స్టార్ ని టాప్ హీరోగా నిలబెట్టిన ఆ సినిమాని ఆ హీరో రిజెక్ట్ చేశాడట..

మాట నిలబెట్టుకున్న తెలంగాణా సర్కార్... డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళకు సూపర్ సౌకర్యాలు

అమరావతి ఏకైక రాజధాని... జగన్ పప్పులు ఉడకవా..?

ఏపీ స్థానిక ఎన్నిక‌లు ఇప్ప‌ట్లో లేన‌ట్లేనా..? కోర్టు విచార‌ణ సారాంశం అదేనా...?

భారీ బడ్జెట్ 'రామాయణం'.. డైలాగ్స్ రాసేసిన మాటల మాంత్రికుడు!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vasu]]>