PoliticsSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/tatoo-veyinchukone-variki-bharee-shock-aa-pramadam-thappaduddad65c4-22cd-4427-a48d-b46016a646e2-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/tatoo-veyinchukone-variki-bharee-shock-aa-pramadam-thappaduddad65c4-22cd-4427-a48d-b46016a646e2-415x250-IndiaHerald.jpgఈ మధ్య కాలంలో యువత టాటూ కు వేయించుకోవడం యువతకు సరదా అయిపోయింది. ఎంతో స్టైల్ గా ఉండే టాటూ కోసం జనాలు బాగా సెర్చ్ చేసి వేయించుకుంటున్నారు.. అయితే టాటూ లను వేయించుకోవడం వల్ల క్రేజ్ కన్నా ముందు లేని పోని రోగాలు వస్తాయని నిపుణులు అంటున్నారు. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. పచ్చ బొట్టు ఇప్పుడు కొత్తగా రాలేదు.. మన పూర్వ కాలం నుంచి ఉంది. అయితే పూర్వ కాలంలో చెరిగిపోని గుర్తు అని జనాలు వేయించుకొని వారు. చనిపోయిన తర్వాత దేవుడు అడిగితే చూపించడానికి అని వాళ్ళు నమ్ముతుండే వాళ్ళు. ఇప్పుడు మాత్రం అందరికీ ఫ్యాషన్tatoo side effects;deva;kanna lakshminarayana;fashionటాటూలు వేయించుకునే వారికి భారీ షాక్.. ఆ ప్రమాదం తప్పదు..టాటూలు వేయించుకునే వారికి భారీ షాక్.. ఆ ప్రమాదం తప్పదు..tatoo side effects;deva;kanna lakshminarayana;fashionWed, 16 Dec 2020 10:00:00 GMTకన్నా ముందు లేని పోని రోగాలు వస్తాయని నిపుణులు అంటున్నారు. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. పచ్చ బొట్టు ఇప్పుడు కొత్తగా రాలేదు.. మన పూర్వ కాలం నుంచి ఉంది. అయితే పూర్వ కాలంలో చెరిగిపోని గుర్తు అని జనాలు వేయించుకొని వారు. చనిపోయిన తర్వాత దేవుడు అడిగితే చూపించడానికి అని వాళ్ళు నమ్ముతుండే వాళ్ళు. ఇప్పుడు మాత్రం అందరికీ ఫ్యాషన్ అయిపోయింది. 



ఒకనాటి ఆలివ్‌ గ్రీన్‌లోనే కాదు, రకరకాల రంగుల్లోనూ పచ్చబొట్లు దర్శనమిస్తున్నాయి. వీటితో అందం ఇనుమడించటం మాట అటుంచితే కొన్ని ముప్పులు లేకపోలేదు. జాగ్రత్తలు తీసుకోకపోతే జబ్బులు కూడా పలకరిస్తాయని నిపుణులు అంటున్నారు.. రంగు రంగుల టాటులను వేసుకోవడానికి కెమికల్స్ కలిపిన రంగులను శరీరంలోకి పంపిస్తారు. మత్తు కూడా ఇవ్వకుండా అలానే చేయడం వల్ల నొప్పితో పాటుగా రక్తం కూడా వస్తుంది. కొన్ని వర్ణద్రవ్యాల్లో లోహాలుంటాయి. మున్ముందు ఎప్పుడైనా ఎంఆర్‌ఐ తీస్తే వీటి మూలంగా మంటతో కూడిన నొప్పి రావొచ్చు. వాపు తలెత్తొచ్చు..


ఇకపోతే శరీరంలోంచి వచ్చే వ్యర్థ పదార్థాలను బయటకు పోనివ్వకుండా రంగులు అడ్డుకోవడం వల్ల చర్మం ఇన్ఫెక్షన్స్ కు గురవుతుంది. దీంతో చర్మం సాగే గుణం తగ్గిపోతుంది. కదలికలు కష్టమవుతాయి. ఇలాంటి సమస్యలకు దీర్ఘకాలం చికిత్స అవసరమవుతుంది.



ఇలాంటి సమస్యల నుంచి ఎలా బయట పడవచ్చునంటే..పచ్చబొట్టు వేసేవారు విధిగా చేతులకు గ్లవుజులు ధరించేలా, స్టెరిలైజ్‌ చేసిన పరికరాలనే వాడేలా చూసుకోవాలి.పచ్చబొట్టు వేయించుకున్నాక చర్మాన్ని పొడిగా ఉంచుకోవాలి. దుమ్ముధూళి, ఎండ పడనీయొద్దు. చర్మానికి అంటుకుపోయే దుస్తులు వేసుకోవద్దు. బొట్టు వేసిన భాగం నయం కావటానికి రెండు వారాలు పట్టొచ్చు. ఇకపోతే పచ్చ వల్ల చాలా మానసిక ఒత్తిడిని ఒక్కోసారి ఎదుర్కోవాల్సి ఉంటుంది. వాటిని తొలగించడానికి లేజర్లు, సర్జరీలు, చర్మం పైపొరను తొలగించటం వంటి పద్ధతులతో రంగు వెలిసిపోయేలా చేయొచ్చు. కాకపోతే ఇవన్నీ సంక్లిష్టమైన పద్ధతులు. ఖర్చూ ఎక్కువే అవుతుంది. అందువల్ల గోరింటాకు, వృక్ష రంగులతో తాత్కాలిక టాటూ లను వేయించుకోవడం మంచిదే..





మ‌ళ్లీ ర‌గులుకుంటున్న ఆదివాసీల ఉద్య‌మం.. ఆదిలాబాద్‌లో ఏం జ‌రుగుతోందంటే..?

ఏపీ స్థానిక ఎన్నిక‌లు ఇప్ప‌ట్లో లేన‌ట్లేనా..? కోర్టు విచార‌ణ సారాంశం అదేనా...?

భారీ బడ్జెట్ 'రామాయణం'.. డైలాగ్స్ రాసేసిన మాటల మాంత్రికుడు!

పశ్చిమ బెంగాల్లో రసవత్తర రాజకీయం..!

కొవిడ్ వ్యాక్సిన్ ఎంట్రీకి కౌంట్ డౌన్..!

వ్యవసాయ చట్టాలపై.. రైతులతో మోదీ మాటామంతీ..

ఆ సూర్య గ్రహణాన్ని చూడాలంటే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>