PoliticsSpydereditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/politics-between-parties-and-leaders523aada8-31c0-4a3b-a66c-65a54e075517-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/politics-between-parties-and-leaders523aada8-31c0-4a3b-a66c-65a54e075517-415x250-IndiaHerald.jpg మావ నాటే... మావ రాజ్‌ (మా ఊళ్లో.. మా రాజ్యం) అంటూ కొన్నాళ్ల క్రితం ఆదిలాబాద్ ఆదివాసీలు మొద‌లుపెట్ట‌న ఉద్య‌మం అప్ప‌ట్లో ప్ర‌భుత్వాన్ని వ‌ణికించింది. ప్ర‌భుత్వం ఇచ్చిన హామీలు, తీసుకున్న కొన్ని చ‌ర్య‌ల‌తో కొన్నాళ్లుగా స్త‌బ్ధుగా ఉంటూ వ‌స్తోంది. అయితే ఈ ఉద్య‌మం మ‌ళ్లీ ఉనికిలోకి వ‌స్తున్న‌ట్లుగా జ‌రుగుతున్న కొన్ని ప‌రిణామాల‌ను బ‌ట్టి అర్థం చేసుకోవ‌చ్చు.tribal;district;scheduled tribes;air;tiger;adilabadమ‌ళ్లీ ర‌గులుకుంటున్న ఆదివాసీల ఉద్య‌మం.. ఆదిలాబాద్‌లో ఏం జ‌రుగుతోందంటే..?మ‌ళ్లీ ర‌గులుకుంటున్న ఆదివాసీల ఉద్య‌మం.. ఆదిలాబాద్‌లో ఏం జ‌రుగుతోందంటే..?tribal;district;scheduled tribes;air;tiger;adilabadWed, 16 Dec 2020 10:08:28 GMTఆదిలాబాద్ ఆదివాసీలు మొద‌లుపెట్ట‌న ఉద్య‌మం అప్ప‌ట్లో ప్ర‌భుత్వాన్ని వ‌ణికించింది. ప్ర‌భుత్వం ఇచ్చిన హామీలు, తీసుకున్న కొన్ని చ‌ర్య‌ల‌తో కొన్నాళ్లుగా స్త‌బ్ధుగా ఉంటూ వ‌స్తోంది. అయితే ఈ ఉద్య‌మం మ‌ళ్లీ ఉనికిలోకి వ‌స్తున్న‌ట్లుగా జ‌రుగుతున్న కొన్ని ప‌రిణామాల‌ను బ‌ట్టి అర్థం చేసుకోవ‌చ్చు. ఆదివాసీ వర్సెస్ లంబాడా ఉద్యమం సద్దుమణిగిందని భావిస్తున్న తరుణంలోనే ఆదిలాబాద్ జిల్లాలో జ‌రుగుతున్న‌ వరుస ఆందోళనలతో ప్ర‌భుత్వం సైతం ఆందోళ‌న చెందుతోంది. ఎవరి అంచనాలకు అందకుండా చాపకింద నీరులా విస్తరిస్తూ ఆదివాసీ పల్లెల్లో ఆందోళనకు సై అంటోంది. లంబాడాలను ఎస్టీ జాబితా నుండి తొలగించడమే లక్ష్యంగా ఆదివాసీల అభివృద్ధే ధ్యేయంగా ఈ సారి పోరు సలిపేందుకు సైసై అంటోంది. పోడు వ్య‌వ‌సాయాన్ని ఆపేందుకు ప్ర‌భుత్వే అడ‌వుల్లో పులుల‌ను వ‌దిలింద‌ని కొన్నిరోజులుగా ఆదివాసీలు ఆరోపిస్తున్నారు.  వరుస పులి దాడులతో వారిలో ఆగ్ర‌హం క‌ట్ట‌లు తెంచుకుంటోంది.


ఈనేప‌థ్యంలోనే త‌మ ఆస్తిత్వానికి ముప్పు వాటిల్లుతోంద‌ని కొంత‌మంది ఆదివాసీ నాయ‌కులు బ‌హిరంగంగానే వ్యాఖ్య‌నిస్తున్నారు. ఈనేప‌థ్యంలో పోరాటాల‌కు సిద్ధంగా ఉండాల‌ని తుడుందెబ్బ పిలుపునివ్వ‌డంతో ఉమ్మడి ఆదిలాబాద్ వ్యాప్తంగా ఆందోళ‌న‌లు మొద‌ల‌వుతున్నాయి. ఆదివాసీ దండు మరోసారి ఆందోళనను తీవ్రతరం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయ‌ని తెలుస్తోంది. ఇన్నాళ్లు అస్తిత్వం కోసం పోరు సలిపిన ఆదివాసీలు.. ఇక హక్కుల సాధనే లక్ష్యంగా ఆందోళనకు సైతం అంటున్నారు. జల్ జంగిల్ జమీన్.. అడవి బిడ్డల పోరుగడ్డ మరోసారి సమరానికి సన్నద్దమవుతున్నట్టు కనిపిస్తోంది. హక్కుల సాధనే లక్ష్యంగా మలిదశ ఉద్యమానికి తుడుం మోగిస్తోంది.


ఇదిలా ఉండ‌గా కొమురంభీం జిల్లా మార్లవాయిలో ముందుగా తుడుందెబ్బ ఉద్య‌మం పురుడు పోసుకున్న విష‌యం తెలిసిందే.
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎస్టీలుగా ఉన్న లంబాడాలు, ఆదివాసుల మధ్య చిచ్చు చినికి చినికి గాలి వానలా మారుతోంది. గిరిజనులు, ఆదివాసులు అడవితల్లిని నమ్ముకొని జీవనం సాగిస్తారు. సమాజానికి, జనానికి నాగరికతకు చాలా దూరంగా ఉంటారు. ఇక లంబాడాలు మైదాన ప్రాంతంలో సంచార జీవనం గడుపుతుంటారు. లంబాడాలు, ఆదివాసులు ఎక్కడా కూడా కలసి జీవనం చేయరు.




గోడౌన్లుగా మారుతున్న థియేటర్లు

ఏపీ స్థానిక ఎన్నిక‌లు ఇప్ప‌ట్లో లేన‌ట్లేనా..? కోర్టు విచార‌ణ సారాంశం అదేనా...?

భారీ బడ్జెట్ 'రామాయణం'.. డైలాగ్స్ రాసేసిన మాటల మాంత్రికుడు!

పశ్చిమ బెంగాల్లో రసవత్తర రాజకీయం..!

కొవిడ్ వ్యాక్సిన్ ఎంట్రీకి కౌంట్ డౌన్..!

వ్యవసాయ చట్టాలపై.. రైతులతో మోదీ మాటామంతీ..

ఆ సూర్య గ్రహణాన్ని చూడాలంటే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Spyder]]>