PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/lockdown-full-salary-supreme-court-no-coercive-action-on-companiesc44492b4-320e-4114-beeb-72142f564063-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/lockdown-full-salary-supreme-court-no-coercive-action-on-companiesc44492b4-320e-4114-beeb-72142f564063-415x250-IndiaHerald.jpgదేశవ్యాప్తంగా హైకోర్టు సీజేలు, జడ్జీలు బదిలీ అయ్యారు. పలు హైకోర్టుల్లో ప్రధాన న్యాయమూర్తులు(సీజే), న్యాయమూర్తులను బదిలీ చేస్తూ సుప్రీం కోర్టు ఓ ప్రకటన విడుదల చేసింది. ఒడిశా హైకోర్టు సీజే మధ్యప్రదేశ్కు, మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి గుజరాత్కు బదిలీ అయ్యారు. ఐదుగురు న్యాయమూర్తులకు సీజేలుగా పదోన్నతి లభించింది. దేశవ్యాప్తంగా పలువురు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు, న్యాయమూర్తులను బదిలీ చేసింది సుప్రీంకోర్టు. ఈ నెల 14న జరిగిన సుప్రీం కొలీజియం సమావేశంలో ఈమేరకు ఖరారు చేసినట్లు ప్రకటనలో పేర్కొంది. ఒడిశా supreme court;sikkim;jammu and kashmir - srinagar/jammu;odisha;telangana;high court;chennai;calcuttaకీలక బదిలీలు చేసిన సుప్రీం కోర్ట్...!కీలక బదిలీలు చేసిన సుప్రీం కోర్ట్...!supreme court;sikkim;jammu and kashmir - srinagar/jammu;odisha;telangana;high court;chennai;calcuttaWed, 16 Dec 2020 19:56:52 GMTఒడిశా హైకోర్టు సీజే మధ్యప్రదేశ్కు, మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి గుజరాత్కు బదిలీ అయ్యారు. ఐదుగురు న్యాయమూర్తులకు సీజేలుగా పదోన్నతి లభించింది. దేశవ్యాప్తంగా పలువురు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు, న్యాయమూర్తులను బదిలీ చేసింది సుప్రీంకోర్టు. ఈ నెల 14న జరిగిన సుప్రీం కొలీజియం సమావేశంలో ఈమేరకు ఖరారు చేసినట్లు ప్రకటనలో పేర్కొంది.

ఒడిశా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రఫీక్ ను మధ్యప్రదేశ్కు బదిలీ చేసారు. సిక్కిం హైకోర్టు సీజేను ఆంధ్రప్రదేశ్కు బదిలీ చేస్తూ సుప్రీం కొలీజియం నిర్ణయం వెల్లడించింది. మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తిని గుజరాత్కు బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. సిక్కిం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎ.కె.గోస్వామి ఆంధ్రప్రదేశ్‌ కు బదిలీ చేసారు.  మద్రాస్‌ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వినీత్‌ కొఠారి గుజరాత్‌ కు బదిలీ అయ్యారు. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్‌.ఎస్‌.చౌహాన్‌ ను ఉత్తరాఖండ్‌కు బదిలీ చేసారు.

ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జె.కె.మహేశ్వరిని సిక్కింకు బదిలీ చేసారు. మధ్యప్రదేశ్‌ హైకోర్టు న్యాయమూర్తి అలహాబాద్‌ హైకోర్టుకు బదిలీ అయ్యారు. జమ్ముకశ్మీర్‌ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాజేష్‌ బిందాల్‌ కోల్‌కతాకు బదిలీ అయ్యారు. కోల్‌కతా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జోయ్‌మల్యా బాగ్చీ ఆంధ్రప్రదేశ్‌కు బదిలీ అయ్యారు. మధ్యప్రదేశ్‌ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సతీష్‌ చంద్ర శర్మ కర్ణాటకకు బదిలీ అయ్యారు. ఐదుగురికి పదోన్నతి లభించింది. పంజాబ్‌, హరియాణా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మురళీధర్‌కు ఒడిశా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి లభించింది. దిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లీకి తెలంగాణ ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి లభించింది. కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజీబ్‌ బెనర్జీకి మద్రాస్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి లభించింది.


ప్రేయసి కోసం సముద్రాన్ని దాటి.. చివరకు జైలు పాలైన లవర్!

పెద్ద సినిమాలు తొక్కిపడేస్తాయట...?

ఆ సినిమా కోసం డైరెక్టర్ వేటలో కింగ్ నాగార్జున.. కథేంటంటే..

పాక్ యుద్ధంపై ప్రధానిని వ్యతిరేకించిన భారత జనరల్.. భయపడి కాదు..!

ఆదిపురుష్ నుంచి సైఫ్ ఆలీఖాన్ అవుట్...?

కేసీఆర్ నగర్ ను ప్రారంభించిన హరీష్ రావు

వరదసాయంపై నో రెస్పాన్స్.. ఆందోళనలో నగరవాసులు..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>