MoviesNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/heroine-rashikhanna-into-politics74891b5c-2865-49e1-9bdf-27ca40e2b59d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/heroine-rashikhanna-into-politics74891b5c-2865-49e1-9bdf-27ca40e2b59d-415x250-IndiaHerald.jpgరాశీ ఖన్నా ఎంత ప్రయత్నం చేసినా సినిమాల్లో పెద్దగా వర్కవుట్‌ కావడం లేదు. తెలుగు పోయినా తమిళ్ లో అయినా సెటిల్‌ అవుదాం అనుకుంటే అక్కడా సేమ్‌ సిట్యువేషన్స్‌ ఎదురవుతున్నాయి. దీంతో ఫీల్డ్‌ ఛేంజ్‌ చేయాలనుకుంటోందట రాశీ ఖన్నా. సినిమాలకి పేకప్‌ చెప్పి, పాలిటిక్స్‌లో జాయిన్‌ అవ్వాలనుకుంటోందట రాశీ. heroine rashikhanna into politics;delhi;cinema;telugu;tamil;collector;interview;rashi khannaరాజకీయాల్లోకి రాశీఖన్నా..!రాజకీయాల్లోకి రాశీఖన్నా..!heroine rashikhanna into politics;delhi;cinema;telugu;tamil;collector;interview;rashi khannaWed, 16 Dec 2020 23:00:00 GMTరాశీ ఖన్నా ఎంత ప్రయత్నం చేసినా సినిమాల్లో పెద్దగా వర్కవుట్‌ కావడం లేదు. తెలుగు పోయినా తమిళ్ లో అయినా సెటిల్‌ అవుదాం అనుకుంటే అక్కడా సేమ్‌ సిట్యువేషన్స్‌ ఎదురవుతున్నాయి. దీంతో ఫీల్డ్‌  ఛేంజ్‌ చేయాలనుకుంటోందట రాశీ ఖన్నా. సినిమాలకి పేకప్‌ చెప్పి, పాలిటిక్స్‌లో జాయిన్‌ అవ్వాలనుకుంటోందట రాశీ.

రాశీ ఖన్నా పాలిటిక్స్‌లోకి వెళ్లాలనుకుంటోంది. ఇన్నాళ్లూ థియేటర్స్‌లో విజిల్స్‌ వేయించిన రాశీ, ఇక మీదట పొలిటికల్‌ గ్రౌండ్స్‌లో విజిల్స్‌ కొట్టించాలనుకుంటోంది. రాజకీయ చదరంగంలోనూ హీరోయిన్‌గా నిలవాలనుకుంటుంది. దీనికోసం సినిమా పాపులారిటీని ఉపయోగించుకొని, చట్టసభల్లో అడుగుపెట్టాలనుకుంటోంది రాశీ ఖన్నా.

రాశీ ఖన్నాకి ఇప్పుడు తెలుగులో సినిమాలు తగ్గిపోయాయి. టాలీవుడ్‌లో అవకాశాలు తగ్గాక తమిళ సినిమాలతో కెరీర్‌ నెట్టుకొస్తోంది. అయితే సినిమాలు తగ్గిపోయాయని, రాశీ ఏం బాధపడటం లేదట. అసలు రాశీకి మొదటి నుంచి సినిమాలపై పెద్దగా ఇంట్రెస్ట్‌ లేదని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. చిన్నప్పటి నుంచి కలెక్టర్‌ కావాలని, అనుకోకుండా సినిమాల్లోకి వచ్చేశాను. ఇప్పుడు సినిమాలు తగ్గినా కలెక్టర్ అయ్యే అవకాశం లేదు. అందుకే పాలిటిక్స్‌లోకి వెళ్తానని చెప్పింది రాశీఖన్నా.

రాశీ ఖన్నా పాలిటిక్స్‌లోకి వెళ్లడానికంటే ముందు ఒక ఎన్.జి.వో. స్టార్ట్ చేస్తుంది. సేవా కార్యక్రమాలతో జనాలకు దగ్గరయ్యాక అప్పుడు రాజకీయాళ్లోకి వెళ్తానని చెప్తోంది. మరి ఢిల్లీ నుంచి వచ్చి సౌత్‌లో స్టార్డమ్‌ సంపాదించుకున్న రాశీ ఖన్నా, ఉత్తరాది నుంచి పోటీ చేస్తుందా, లేక దక్షిణాది నుంచి ఎన్నికల బరిలో దిగుతుందా.. అనేది చూడాలి.

మొత్తానికి కీలక ప్రకటన చేసి రాశీ ఖన్నా సినీ ఇండస్ట్రీలో అలజడి రేపింది. రాజకీయాలు చేస్తానని చెప్పి రాజకీయ వర్గాల్లో ఆశ్చర్యాన్ని రేకెత్తించింది. చక్కగా సినిమాల్లో ప్రేక్షకులకు బోలెడంత వినోదాన్ని పంచే ఈ అమ్మడు అప్పుడే పాలిటిక్స్ లోకి వస్తుందా అని గుసగుసలాడుకుంటున్నారు జనాలు. అయితే సినిమాల్లోంచి రిటైర్ అయ్యాకే రాజకీయాలు అని చెప్పడంతో హమ్మయ్య అనుకుంటున్నారు జనాలు. ప్రజాసేవకోసమే తన పొలిటికల్ ఎంట్రీ అంటోంది.










F3 కోసం ఈ ఇద్దరి హీరోలతో చర్చలు.. ఏందీ కథ..?

కమల్ హాసన్‌కు షాకిచ్చిన ఈసీ.. ఊరుకోమంటున్న విశ్వనటుడు

ఏలూరు వింత వ్యాధికి కారణమిదే.. బయటపెట్టిన అధికారులు

నిర్భయ తల్లి సంచలన ప్రతిజ్ఞ

రకుల్‌కు ఇల్లు కొనిచ్చిన రాజకీయ నేత? దీనిపై రకుల్ స్పందన ఇదీ!

సాగు చట్టాలా మజాకా.. దేశంలోనే తొలిసారి వ్యాపారికి జరిమానా!

ప్రేయసి కోసం సముద్రాన్ని దాటి.. చివరకు జైలు పాలైన లవర్!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>