PoliticsGiddaluri Srinivasa Raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/covid-vaccine-gets-new-jobsd161f7dc-534c-45b0-91d8-05093266a579-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/covid-vaccine-gets-new-jobsd161f7dc-534c-45b0-91d8-05093266a579-415x250-IndiaHerald.jpgకొవిడ్ టీకా ఇంకా వినియోగంలోకి రాక ముందే.. దాని నిల్వ, సరఫరా వంటి విషయాలపై రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర స్థాయిలో కసరత్తులు చేస్తున్నాయి. అవసరమైతే టీకా కార్యక్రమం కోసం తాత్కాలిక ఉద్యోగాలు భర్తీ చేసేందుకు సైతం తెలంగాణ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. టీకా కార్యక్రమం దీర్ఘ కాలిక ప్రక్రియ కాబట్టి.. తెలంగాణలో నిరుద్యోగులకు ఇది కచ్చితంగా శుభవార్తేనని చెప్పాలి. covid vaccine;koti;amala akkineni;telangana;district;police;local language;central governmentనిరుద్యోగులకు శుభవార్త.. కొవిడ్ టీకా సరఫరాకోసం నియామకాలు..నిరుద్యోగులకు శుభవార్త.. కొవిడ్ టీకా సరఫరాకోసం నియామకాలు..covid vaccine;koti;amala akkineni;telangana;district;police;local language;central governmentWed, 16 Dec 2020 11:00:00 GMTతెలంగాణ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. టీకా కార్యక్రమం దీర్ఘ కాలిక ప్రక్రియ కాబట్టి.. తెలంగాణలో నిరుద్యోగులకు ఇది కచ్చితంగా శుభవార్తేనని చెప్పాలి.

ప్రస్తుతం తెలంగాణలోని ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో టీకాల నిల్వ కేంద్రాలున్నాయి, వీటితో పాటు అన్ని జిల్లా కేంద్రాల్లోనూ కొవిడ్‌ టీకాలను భద్రపర్చడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర స్థాయిలో 2 కోట్ల టీకాలను, జిల్లాల్లో కోటి టీకాలను ఏకకాలంలో భద్రపర్చేలా సన్నాహాలు చేస్తున్నారు. టీకాలను సరఫరా చేసేందుకు ప్రత్యేక వాహనాలను సమకూర్చుకుంటున్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో టీకాల సరఫరాకు 16 వాహనాలు అందుబాటులో ఉండగా మరో 17 వాహనాలను కొనుగోలు చేయడానికి ఆదేశాలిచ్చారు. సమాచారాన్ని పొందుపర్చడంలో ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన మానవ వనరులను స్థానికంగానే నియమించుకోవాలని ఆదేశించారు ఉన్నతాధికారులు.

తెలంగాణలో కొవిడ్‌ టీకాల పంపిణీని విజయవంతంగా అమలు చేసేందుకు దాదాపు 50 వేల మంది సిబ్బందికి ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వబోతున్నారు. గత వారమే రాష్ట్రస్థాయిలో శిక్షణ పూర్తికాగా రెండు రోజులుగా జిల్లాల్లోనూ శిక్షణను నిర్వహిస్తున్నారు. వచ్చే వారంరోజుల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం స్థాయిలో వైద్య సిబ్బందికి శిక్షణ అందించేలా ప్రణాళిక రూపొందించారు.

టీకాలు రాష్ట్రానికి చేరగానే.. మొదటగా ప్రభుత్వ, ప్రైవేట్‌ వైద్య సిబ్బందికి ఇవ్వాలని నిర్ణయించారు. వీరందరికీ రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు టీకాలివ్వాలని ప్రణాళిక రూపొందించారు.

రాష్ట్రంలో తొలివిడతలో సుమారు 75 లక్షల మందికి కొవిడ్‌ టీకా అందజేసే అవకాశం ఉంది. ఇందులో సుమారు 3 లక్షల మంది ప్రభుత్వ, ప్రైవేట్‌ వైద్యసిబ్బంది ఉంటారు. సుమారు 2 లక్షల మంది పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు, రవాణా సిబ్బందికి కూడా టీకాలిస్తారు. మిగిలిన వారిలో దాదాపు 60 లక్షల మందికి పైగా 50ఏళ్లు పైబడిన వారు ఉంటారని అంచనా. వీరు కాకుండా 50 ఏళ్లలోపు దీర్ఘకాలిక వ్యాధులతో బాధ పడుతున్నవారికి కూడా టీకా అందజేస్తారని తెలుస్తోంది.


మళ్ళీ మొదలైన మాజీ ప్రేమికుల గొడవ...!

అమరావతి ఏకైక రాజధాని... జగన్ పప్పులు ఉడకవా..?

ఏపీ స్థానిక ఎన్నిక‌లు ఇప్ప‌ట్లో లేన‌ట్లేనా..? కోర్టు విచార‌ణ సారాంశం అదేనా...?

భారీ బడ్జెట్ 'రామాయణం'.. డైలాగ్స్ రాసేసిన మాటల మాంత్రికుడు!

పశ్చిమ బెంగాల్లో రసవత్తర రాజకీయం..!

కొవిడ్ వ్యాక్సిన్ ఎంట్రీకి కౌంట్ డౌన్..!

వ్యవసాయ చట్టాలపై.. రైతులతో మోదీ మాటామంతీ..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Giddaluri Srinivasa Rao]]>