SatireVijayaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/satire/129/somu-veerraju-bjp-amaravati-naidu-jagan-modi971af04e-6160-4ab7-a828-64d16fed38e7-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/satire/129/somu-veerraju-bjp-amaravati-naidu-jagan-modi971af04e-6160-4ab7-a828-64d16fed38e7-415x250-IndiaHerald.jpgచంద్రబాబు కూడా ఏ ప్రాంతానికి వెళితే ఆ ప్రాంతానికి మద్దతుగా మాట్లాడటం అందరికీ తెలిసిందే. అందుకే అందరు కలిసి చివరకు చంద్రబాబును మూలకూర్చోబెట్టారు. వీర్రాజు విషయం తీసుకుంటే మొన్న ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం వెళ్ళినపుడు రాజధాని విషయం మాట్లాడలేదు. తిరుపతిలో రెండురోజుల కార్యవర్గ సమావేశాలు నిర్వహించినపుడూ అమరావతే రాజధానిగా ఉండాలని చెప్పలేదు. మధ్యలో అనంతపురం పర్యటనలో కూడా ఎక్కడా రాజధాని గురించి ప్రస్తావన రాకుండా జాగ్రత్తపడ్డారు. మరి తిరుపతి నుండి గుంటూరు జిల్లాలోకి వచ్చేయగానే ఒక్కసారిగా అమరావతికే జై ఎందుకsomu veerraju bjp amaravati naidu jagan modi;cbn;tiru;bharatiya janata party;amaravati;narendra modi;n. chandrababu naidu;kurnool;tirupati;rayalaseema;capital;court;prime minister;husband;central government;reddy;partyహెరాల్డ్ సెటైర్ : చంద్రబాబునే మించిపోయేలా ఉన్నాడే ?హెరాల్డ్ సెటైర్ : చంద్రబాబునే మించిపోయేలా ఉన్నాడే ?somu veerraju bjp amaravati naidu jagan modi;cbn;tiru;bharatiya janata party;amaravati;narendra modi;n. chandrababu naidu;kurnool;tirupati;rayalaseema;capital;court;prime minister;husband;central government;reddy;partyWed, 16 Dec 2020 07:00:00 GMTఆరుమాసాలు సావాసం చేస్తే వారు వీరవుతారనే సామెత చాలా పాపులర్. బీజేపీ అద్యక్షుడు సోమువీర్రాజు తాజా మాటలు చూస్తుంటే ఇదే అనుమానం పెరిగిపోతోంది. దాదాపా నాలుగు సంవత్సరాల పాటు చంద్రబాబునాయుడుతో కలిసిన కారణంగా ఆయన బుద్ధులన్నీ సోమువీర్రాజుకు కూడా వచ్చేసిందా అనే అనుమానాలు పెరుగుతున్నాయి. లేకపోతే అమరావతి మాత్రమే ఏపికి రాజధానిగా ఉండాలని తాజా ప్రకటనేంటి ? జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన మూడు రాజధానులకు తమ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తోందంటు తుళ్ళూరు రైతుల సభలో గట్టిగా అరచి మరీ చెప్పారు. పైగా తాను ప్రధానమంత్రి నరేంద్రమోడి ప్రతినిధిగా చెబుతున్నానంటూ మరో బిల్డప్ ఒకటి. ఒకవైపేమో రాష్ట్ర రాజధాని విషయంలో తమకు సంబంధం లేదని కేంద్రం ఒకటికి మూడు అఫిడవిట్లు కోర్టులో దాఖలు చేసిన తర్వాత ఇక మళ్ళీ మోడి ప్రతినిధిగా అమరావతికి మద్దతు పలకటం ఏమిటో అర్ధం కావటం లేదు.




మొన్నటివరకు ఇదే వీర్రాజు రాజధానుల ఏర్పాటన్నది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం ఇష్టమేనంటు పదే పదే చెప్పేవారు. రాజధాని నిర్ణయం విషయంలో కేంద్రం ఇచ్చిన అఫిడవిట్ లో తప్పేమీ లేదంటు వాదించారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసిన మొదటిపార్టీ తమదే అని కూడా ఎన్నోసార్లు చెప్పారు. అంటే కొద్ది రోజుల క్రితంవరకు కూడా రాజధాని వికేంద్రీకరణకు మద్దతుగా మాట్లాడిన వీర్రాజు హఠాత్తుగా అమరావతికి మద్దతుగా ఎందుకు మాట్లాడారు ?  ఎందుకంటే ఇక్కడే చంద్రబాబు బుద్ధులేమన్నా ఈయనకు వచ్చేశాయా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.




చంద్రబాబు కూడా ఏ ప్రాంతానికి వెళితే ఆ ప్రాంతానికి మద్దతుగా మాట్లాడటం అందరికీ తెలిసిందే. అందుకే అందరు కలిసి చివరకు చంద్రబాబును మూలకూర్చోబెట్టారు. వీర్రాజు విషయం తీసుకుంటే మొన్న ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం వెళ్ళినపుడు రాజధాని విషయం మాట్లాడలేదు. తిరుపతిలో రెండురోజుల కార్యవర్గ సమావేశాలు నిర్వహించినపుడూ అమరావతే రాజధానిగా ఉండాలని చెప్పలేదు. మధ్యలో అనంతపురం పర్యటనలో కూడా ఎక్కడా రాజధాని గురించి ప్రస్తావన రాకుండా జాగ్రత్తపడ్డారు. మరి తిరుపతి నుండి గుంటూరు జిల్లాలోకి వచ్చేయగానే ఒక్కసారిగా అమరావతికే జై ఎందుకు కొట్టినట్లు ? ఎందుకంటే వీర్రాజు కూడా ఏరోటి కాడ ఆ పాట పాడాలన్న చంద్రబాబు దారిలో నడవాలని డిసైడ్ అయ్యారేమో. అమరావతిలో చెప్పిన రాజధాని ప్రకటనే రాయలసీమ, ఉత్తరాంధ్రలో కూడా చేస్తే బాగుంటుంది.





ఆన్ లైన్ క్లాసుల పేరిట అఘాయిత్యం

భారీ బడ్జెట్ 'రామాయణం'.. డైలాగ్స్ రాసేసిన మాటల మాంత్రికుడు!

పశ్చిమ బెంగాల్లో రసవత్తర రాజకీయం..!

కొవిడ్ వ్యాక్సిన్ ఎంట్రీకి కౌంట్ డౌన్..!

వ్యవసాయ చట్టాలపై.. రైతులతో మోదీ మాటామంతీ..

ఆ సూర్య గ్రహణాన్ని చూడాలంటే..!

బిగ్‌బాస్-4: గ్రాండ్ ఫినాలేలో హాట్ హీరోయిన్ల ఆటపాట?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>