MoviesN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/monal443b41e8-c59b-46d3-b527-710599f1a0da-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/monal443b41e8-c59b-46d3-b527-710599f1a0da-415x250-IndiaHerald.jpgబిగ్ బాస్ 4 తెలుగు కారణంగా ఫేడవుట్ అయిపోయిన మోనాల్ గజ్జర్ మళ్లీ తెలుగు ప్రేక్షకులకు చేరువవుతుంది. ఎవరో సుడిగాడు హీరోయిన్ అంట అనే వాళ్లే కానీ మోనాల్ అంటూ ప్రత్యేక గుర్తింపు అయితే లేదు. కానీ బిగ్ బాస్ 4 తెలుగు పుణ్యమా అని ఇప్పుడు మోనాల్ గజ్జర్ ఫేమస్ అయిపోయింది. అప్పుడెప్పుడో తెలుగులో ఓ కాలేజ్ స్టోరీ అనే సినిమాతో వచ్చింది మోనాల్. అయితే దానికంటే ముందు సుడిగాడు సినిమా విడుదలైంది. monal;beauty;bhama;monal gajjar;korea, south;cinema;telugu;bigboss;tamil;interview;industry;hero;heroineఅతడి కారణంగానే సౌత్ సినిమాలకు దూరమయ్యాను : మోనాల్అతడి కారణంగానే సౌత్ సినిమాలకు దూరమయ్యాను : మోనాల్monal;beauty;bhama;monal gajjar;korea, south;cinema;telugu;bigboss;tamil;interview;industry;hero;heroineWed, 16 Dec 2020 10:00:00 GMTబిగ్ బాస్ 4 తెలుగు కారణంగా ఫేడవుట్ అయిపోయిన మోనాల్ గజ్జర్ మళ్లీ తెలుగు ప్రేక్షకులకు చేరువవుతుంది. ఎవరో సుడిగాడు హీరోయిన్ అంట అనే వాళ్లే కానీ మోనాల్ అంటూ ప్రత్యేక గుర్తింపు అయితే లేదు. కానీ బిగ్ బాస్ 4 తెలుగు పుణ్యమా అని ఇప్పుడు మోనాల్ గజ్జర్ ఫేమస్ అయిపోయింది. అప్పుడెప్పుడో తెలుగులో ఓ కాలేజ్ స్టోరీ అనే సినిమాతో వచ్చింది మోనాల్. అయితే దానికంటే ముందు సుడిగాడు సినిమా విడుదలైంది. అది బ్లాక్‌బస్టర్ అయిన వెంటనే మలయాళంలో డ్రాకులా అనే సినిమాలో ఆఫర్ వచ్చింది. ఆ తర్వాత మరో సినిమా అక్కడే వచ్చింది. సరైన గైడెన్స్ లేక తమిళం, మలయాళం అంటూ అన్ని ఇండస్ట్రీలు తిరిగేసింది మోనాల్ గజ్జర్.

ఇక ఇదే విషయాన్ని ఇప్పుడు ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది ఈ భామ. బిగ్ బాస్ 4లో 98 రోజుల పాటు ఉండి ఈ మధ్యే ఎలిమినేట్ అయింది మోనాల్. ఫినాలేకు ఒక్క వారం ముందు బయటికి వచ్చేసింది ఈ బ్యూటీ. వచ్చీ రాగానే వరసగా ఇంటర్వ్యూలు ఇచ్చేస్తుంది. అందులో కొన్ని సంచలన విషయాలు బయటికి చెప్తుంది. ఈ క్రమంలోనే తన బ్రేకప్ గురించి కూడా చెప్పింది. 2015 తర్వాత తెలుగులో నటించకపోవడానికి కారణం కూడా అదే అని క్లారిటీ ఇచ్చింది. బ్రదర్ ఆఫ్ బొమ్మాళి తర్వాత మరిన్ని ఆఫర్స్ వచ్చినా కూడా తానే కాదనుకున్నట్లు చెప్పింది.

ఎందుకంటే ఓ మలయాళ హీరోతో ఆరేళ్ళ తన ప్రేమకు బ్రేకప్ అయిందని.. అందుకే ఇకపై ఇక్కడ ఉండకూడదని ఫిక్స్ అయిపోయి సొంత ఇండస్ట్రీ గుజరాతీకి వెళ్లిపోయినట్లు చెప్పింది మోనాల్ గజ్జర్. అక్కడ 8 సినిమాల వరకు నటించినట్లు చెప్పుకొచ్చింది. దాంతో పాటు మరాఠీలో ఓ సినిమా.. హిందీలో ఓ సినిమాలో నటించింది ఈ బ్యూటీ. ఇప్పుడు తెలుగులో మళ్లీ అవకాశాలు వస్తే ఆలోచిస్తానని చెప్పింది. అయితే బ్రేక్ అప్ చెప్పిన హీరో పేరు మాత్రం బయట పెట్టలేదు. ఆయన మలయాళ హీరో అని మాత్రం చెప్పింది మోనాల్.


గోడౌన్లుగా మారుతున్న థియేటర్లు

ఏపీ స్థానిక ఎన్నిక‌లు ఇప్ప‌ట్లో లేన‌ట్లేనా..? కోర్టు విచార‌ణ సారాంశం అదేనా...?

భారీ బడ్జెట్ 'రామాయణం'.. డైలాగ్స్ రాసేసిన మాటల మాంత్రికుడు!

పశ్చిమ బెంగాల్లో రసవత్తర రాజకీయం..!

కొవిడ్ వ్యాక్సిన్ ఎంట్రీకి కౌంట్ డౌన్..!

వ్యవసాయ చట్టాలపై.. రైతులతో మోదీ మాటామంతీ..

ఆ సూర్య గ్రహణాన్ని చూడాలంటే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>