PoliticsSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/tptf941584f-422a-414b-b5b3-49bd9e6f98b5-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/tptf941584f-422a-414b-b5b3-49bd9e6f98b5-415x250-IndiaHerald.jpgఏపీలో ఎన్నికల వేడి మొదలుకాబోతోంది. తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికకు మెల్లగా రంగం సిద్ధమవుతోంది. ఈ ఉప ఎన్నికకు సంబంధించిన ఓటర్ల జాబితా తయారు చేయాలంటూ ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఆదేశాలు వచ్చాయి. ఇక చూసుకుంటే తొందరలోనే ఉప ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేస్తుందని అంటున్నారు. tpt;mithra;tara;tiru;bharatiya janata party;jagan;janasena;tirupati;parliment;september;minister;doctor;husband;service;tdp;central government;ycp;janasena partyతిరుపతి నోటిఫికేషన్ వచ్చేస్తోంది...చలిలో హీటే మరి ?తిరుపతి నోటిఫికేషన్ వచ్చేస్తోంది...చలిలో హీటే మరి ?tpt;mithra;tara;tiru;bharatiya janata party;jagan;janasena;tirupati;parliment;september;minister;doctor;husband;service;tdp;central government;ycp;janasena partyWed, 16 Dec 2020 19:00:00 GMTతిరుపతి లోక్ సభ ఉప ఎన్నికకు మెల్లగా రంగం సిద్ధమవుతోంది. ఈ ఉప ఎన్నికకు సంబంధించిన ఓటర్ల జాబితా తయారు చేయాలంటూ ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఆదేశాలు వచ్చాయి. ఇక చూసుకుంటే తొందరలోనే ఉప ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేస్తుందని అంటున్నారు.

తిరుపతి లోక్ సభకు గత ఏడాది రెండు లక్షల 28 వేల ఓట్ల తేడాతో నెగ్గిన బల్లి దుర్గాప్రసాద్ ఈ ఏడాది సెప్టెంబర్ లో క‌రోనాతో మృతి చెందారు. దాంతో ఉప ఎన్నిక ఆరు నెలల్లోగా జరగాల్సిఉంది. అంటే 2021 ఫిబ్రవరిలోగా ఎన్నిక పూర్తి కావాలి. ఇక గట్టిగా రెండు నెలలు మాత్రమే సమయం ఉన్న వేళ ఏ క్షణమైనా నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

ఇదిలా ఉంటే టీడీపీ అందరి కంటే ముందే కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మికి టికెట్ ఇచ్చేసింది. ఆమె గతసారి పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్ధి కావడంతో ప్రచారం సులువు అవుతుందని, సానుభూతి కూడా ఓటర్ల నుంచి వస్తుందని బాబు భావించి ఎంపిక చేసినట్లుగా ఉంది. మరో వైపు చూసుకుంటే బీజేపీ పోటీకి రెడీ అని అంటోంది కానీ ఇప్పటిదాకా క్యాండిడేట్ ఎవరో తెలియదు. మాజీ ఐఏఎస్ అధికార్ దాసరి శ్రీనివాసులును బరిలోకి దింపుతాని ప్రచారం అయితే సాగుతోంది. మిత్ర పక్షం జనసేన కూడా పోటీకి రెడీ అంటోంది. మరి ఉమ్మడి అభ్యర్ధిగా ఎవరు ఉంటారో తేలడంలేదు.


ఇక వైసీపీ తరఫున కొత్త వారు పోటీకి దిగుతారు అంటున్నారు. ఆయనే ఫిజియోధెరపిస్ట్ డాక్టర్ గురుమూర్తి. ఆయన జగన్ కి పాదయాత్ర మొత్తంగా ఉండి ఎంతో సేవ చేశారు. ఇపుడు జగన్ ఆయన్ని పార్లమెంట్ కి పంపించాలనుకుంటున్నారు.  మొత్తానికి తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక హీట్ ఎక్కించేలా ఉంది. గత ఏడాది వైసీపీకి వచ్చిన భారీ మెజారిటీ చూస్తే అసలు విపక్షం పోటీకి కూడా ఆలోచించాలి. కానీ ఏపీలో రాజకీయం మారిందని అంతా భావిస్తున్న నేపధ్యంలో తిరుపతితోనే కధ మొదలుపెట్టాలని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయట. చూడాలి మరి ఆశ, ఆయాసం ఎంత దూరం పరిగెత్తిస్తాయో.




తెలంగాణ బీజేపీ లో అప్పుడే విబేధాలు మొదలయ్యాయా..?

ప్రేయసి కోసం సముద్రాన్ని దాటి.. చివరకు జైలు పాలైన లవర్!

పెద్ద సినిమాలు తొక్కిపడేస్తాయట...?

ఆ సినిమా కోసం డైరెక్టర్ వేటలో కింగ్ నాగార్జున.. కథేంటంటే..

పాక్ యుద్ధంపై ప్రధానిని వ్యతిరేకించిన భారత జనరల్.. భయపడి కాదు..!

ఆదిపురుష్ నుంచి సైఫ్ ఆలీఖాన్ అవుట్...?

కేసీఆర్ నగర్ ను ప్రారంభించిన హరీష్ రావు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>