Politicsyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/new-act-introduced-by-state-government-of-gujarat-to-control-illegal-occupation-of-land7336976d-1cc7-40d5-8cbb-95ed8d03489a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/new-act-introduced-by-state-government-of-gujarat-to-control-illegal-occupation-of-land7336976d-1cc7-40d5-8cbb-95ed8d03489a-415x250-IndiaHerald.jpgభూ ఆక్రమణలపై గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం కీలక చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. ఈ కొత్త చట్టం ఈరోజు(బుధవారం) నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. ఈ విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ రూపానీ స్వయంగా వెల్లడించారు. భూ ఆక్రమణల నిషేధ చట్టం నేటి నుంచి రాష్ట్రంలో అమలులోకి.. land;amala akkineni;vijay;vijay rupani;gujarat - gandhinagar;district;collector;court;chief minister;joseph vijay;criminalభూ ఆక్రమణలకు కాలం చెల్లు.. కొత్త చట్టంతో..భూ ఆక్రమణలకు కాలం చెల్లు.. కొత్త చట్టంతో..land;amala akkineni;vijay;vijay rupani;gujarat - gandhinagar;district;collector;court;chief minister;joseph vijay;criminalWed, 16 Dec 2020 15:26:57 GMTగాంధీనగర్: భూ ఆక్రమణలపై గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం కీలక చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. ఈ కొత్త చట్టం ఈరోజు(బుధవారం) నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. ఈ విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ రూపానీ స్వయంగా వెల్లడించారు. భూ ఆక్రమణల నిషేధ చట్టం నేటి నుంచి రాష్ట్రంలో అమలులోకి వచ్చిందని ఆయనన్నారు. చట్ట నిబంధనలు, విధివిధానాలను కఠినంగా అమలు చేస్తామని, ప్రభుత్వ, రైతుల, ప్రైవేటు ఆస్తుల, పబ్లిక్ ట్రస్టుల, మఠాలకు సంబంధించిన భూములను చట్టవిరుద్ధంగా ఆక్రమించే ల్యాండ్ మాఫియాలపై ఉక్కుపాదం మోపుతామని ఆయన స్పష్టం చేశారు.     

చట్టం కింద వచ్చిన ఫిర్యాదులను జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఏడుగురు అధికారుల కమిటీ పర్యవేక్షిస్తుందని సీఎం చెప్పారు. కమిటీ ముందుకు దర్యాప్తు నివేదక వచ్చిన 21 రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. కేసులను 6 నెలల లోపే పరిష్కరిస్తామని, అందుకోసం ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేస్తామని, ప్రతి ప్రత్యేక కోర్టుకు ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను ఏర్పాటు చేస్తామని సీఎం చెప్పారు. సివిల్, క్రిమినల్ కోర్టు ప్రొసీండిగ్స్ నిర్వహించేందుకు ప్రత్యేక కోర్టులకు అధికారులు ఉంటాయని, సామాన్య పౌరుడికి సత్యర న్యాయం జరగడంతో పాటు దోషులని తేలిన ల్యాండ్ మాఫియాను కఠినంగా శిక్షిస్తామని సీఎం తెలిపారు.            

ప్రత్యేక కోర్టులకు సుమోటోగా కేసులను స్వీకరించే అధికారం కూడా కల్పించినట్లు సీఎం తెలిపారు. ప్రజల నుంచి ఒకవేళ ఫిర్యాదులు రాకపోయినా.. తమ దృష్టికి వచ్చిన ఆక్రమ ఆక్రమణలపై సుమోటో కేసులను స్వీకరించే అధికారాన్ని ప్రత్యేక కోర్టులు కల్పించనున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వ ఆస్తులతో పాటు, ప్రైవేటు భూములు, ఆస్తులు, ట్రస్టులు, మత సంస్థల ఆస్తులు కూడా ఈ చట్టం పరిధిలోకి వస్తాయని, భూములు అక్రమార్కుల చేతుల్లోకి పోకుండా చూడడమే ఈ చట్టం ముఖ్య ఉద్దేశ్యమని సీఎం రూపానీ స్పష్టం చేశారు.     


'జెర్సీ' షూటింగ్ పూర్తి.. ఎమోషనల్ అయిన హీరో

రోజుకు 100మందికే కరోనా వ్యాక్సిన్?.. కేంద్రం ప్రకటన!

మైండ్ బ్లాక్ అయ్యే రెమ్యునరేషన్.. F3 కోసం అనీల్ రావిపుడికి అంత ఇస్తున్నారా..?

ఆ నెలలో సాగర్ ఉపఎన్నిక ఉంటుందట..

సీఎంల ఢిల్లీ పర్యటనపై రాజకీయాల్లో ఉత్కంఠ..!

ఇటు ఎస్ఈసీ...అటు సర్కార్ నడుమ స్థానిక సమరం

రైతుల ఉద్యమం వెనుక కీలక పాత్ర పోషిస్తున్న మహిళలు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>