Politicsyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/officials-fined-a-private-merchant-for-breaching-farmers71f57434-1ee8-4fa6-b76d-062048b26a1f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/officials-fined-a-private-merchant-for-breaching-farmers71f57434-1ee8-4fa6-b76d-062048b26a1f-415x250-IndiaHerald.jpgఒకపక్క కొత్త సాగు చట్టాలు మాకొద్దంటూ కొన్ని రాష్ట్రాల్లో భారీ నిరసనలు జరుగుతుంటే.. మరికొన్ని రాష్ట్రాల్లో మాత్రం ఈ చట్టాల వల్ల కొందరు రైతులు పండుగ చేసుకొంటున్నారు. రైతులను మోసగించినందుకు ఓ ప్రైవేటు కంపెనీపై...farmer law;madhya pradesh - bhopal;district;festival;2020;vegetable market;local language;bhopalసాగు చట్టాలా మజాకా.. దేశంలోనే తొలిసారి వ్యాపారికి జరిమానా!సాగు చట్టాలా మజాకా.. దేశంలోనే తొలిసారి వ్యాపారికి జరిమానా!farmer law;madhya pradesh - bhopal;district;festival;2020;vegetable market;local language;bhopalWed, 16 Dec 2020 21:31:38 GMTపండుగ చేసుకొంటున్నారు. రైతులను మోసగించినందుకు ఓ ప్రైవేటు కంపెనీపై జిల్లా సబ్ డివిజినల్ మేజిస్ట్రేట్ భారీ జరిమానా విధించారు. మధ్యప్రదేశ్ లోని జబల్‌పూర్‌లో పటాన్ తెహిసిల్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.


స్థానిక శివశక్తి ట్రేడర్స్ అనే ప్రైవేటు కంపెనీ స్థానిక రైతులతో ధాన్యం కొనుగోలుకు సంబంధించి ఓ ఒప్పందం చెలుకుంది. మొత్తం 3500 ధాన్యం బస్తాలకు రూ.22.46 లక్షలు చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందానికి రైతులు కూడా అంగీకరించారు. ఈ ఒప్పందం వ్యవసాయ మార్కెట్ బయట సాగు చట్టాల ప్రకారం జరిగింది.

అయితే తీరా ధాన్యం చేతికందిన తరువాత సదరు కంపెనీ రైతులకు చెల్లింపులు చేయకుండా వాయిదా వేయడం ప్రారంభించింది. దీంతో రైతులంతా కలిసి అధికారులకు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన సబ్ డివిజినల్ మెజిస్ట్రేట్.. రైతులకు తక్షణం చెల్లింపులు చేయాలని శివశక్తి ట్రడర్స్ యాజమాన్యాన్ని ఆదేశించారు. ఫార్మర్స్ ప్రొడ్యూస్ ట్రేడ్ అండ్ కామర్స్(ప్రొమోషన్ అండ్ ఫెసిలిటేషన్) యాక్ట్-2020 కింద ఈ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీంతో కంపెనీ వేగంగా స్పందించి రైతులకు చెల్లించాల్సిన మొత్తం సొమ్మును చెల్లించసింది. అంతేకాదు రైతులకు కష్టం కలిగించినందుకు సదరు కంపెనీపై మెజిస్ట్రేట్ రూ.25 వేల జరిమానా కూడా విధించడం గమనార్హం.


రైతులకు చెల్లింపులు చేయనందుకు గానూ ఓ ప్రైవేటు కంపెనీ ఈ స్థాయిలో జరిమానాకు గురవడం దేశంలోనే ఇది తొలిసారి. దీనిపై రైతులు హర్షం వ్యక్తం చేశారు. కొత్త సాగు చట్టాల వల్లే తమకు న్యాయం జరిగిందని ఆనందపడుతున్నారు. అంతుకుమునుపు.. మధ్యప్రదేశ్‌ అధికారులు ఈ చట్టాల ద్వారా రైతులకు ధాన్యంపై అత్యధిక ధర పొందేలా చేశారు.


ఇది మాత్రమే కాదు రైతుల ధాన్యానికి అధిక ధరలు వచ్చేందుకు కూడా అధికారులు పాటుపడుతున్నారు. ఒప్పందాల్లో ఉన్న కంపెనీలు సరైన సమయానికి చెల్లింపులు చేసేలా చూస్తున్నారు. ఒకవేళ ఎవరైనా సమయానికి చెల్లింపులు చేయకపోతే ఆ  వ్యాపారుల ఆస్తులను సైతం చెల్లింపులకు అటాచ్ చేస్తున్నారు. ఏది ఏమైనా కొత్త సాగు చట్టాలు కొన్ని చోట్ల మంచి ఫలితాలనే రాబడుతున్నట్లు ఇలాంటి సంఘటనలు రుజువు చేస్తున్నాయి.


మిషన్ భగీరథ నీటిని మాత్రమే తాగాలి

ప్రేయసి కోసం సముద్రాన్ని దాటి.. చివరకు జైలు పాలైన లవర్!

పెద్ద సినిమాలు తొక్కిపడేస్తాయట...?

ఆ సినిమా కోసం డైరెక్టర్ వేటలో కింగ్ నాగార్జున.. కథేంటంటే..

పాక్ యుద్ధంపై ప్రధానిని వ్యతిరేకించిన భారత జనరల్.. భయపడి కాదు..!

ఆదిపురుష్ నుంచి సైఫ్ ఆలీఖాన్ అవుట్...?

కేసీఆర్ నగర్ ను ప్రారంభించిన హరీష్ రావు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>