PoliticsSpydereditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/politics-between-parties-and-leadersea90d899-f01b-4727-8a29-b22a60ab9655-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/politics-between-parties-and-leadersea90d899-f01b-4727-8a29-b22a60ab9655-415x250-IndiaHerald.jpgఏపీలో స్థానిక ఎన్నిక‌లు ఇప్ప‌ట్లో జ‌రిగేలా క‌న‌బ‌డ‌టం లేదు. క‌రోనా వైర‌స్ ఉధృతి ఎక్కువ‌గా ఉన్న నేప‌థ్యంలో ఇప్ప‌ట్లో నిర్వ‌హించ‌లేమని రాష్ట్ర ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేస్తూ వ‌స్తోంది. అయితే రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న్ మాత్రం స్థానిక ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు ప‌ట్టుబ‌డుతున్న విష‌యం తెలిసిందే. తాజాగా ఏపీ స్థానిక ఎన్నికలపై హైకోర్టులో విచారణ జరిగింది. హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన ప్రభుత్వం ఫిబ్రవరిలో స్థానిక ఎన్నికలు నిర్వహించలేమని తేల్చిచెప్పింది. జనవరి, ఫిబ్రవరిలో కరోనా వ్యాక్సినేషన్ ఉంటుందన్న ప్రభుత్వం కnimmagadda vs jagan;andhra pradesh;high court;srikakulam;january;december;october;local language;sara shrawan;coronavirusఏపీ స్థానిక ఎన్నిక‌లు ఇప్ప‌ట్లో లేన‌ట్లేనా..? కోర్టు విచార‌ణ సారాంశం అదేనా...?ఏపీ స్థానిక ఎన్నిక‌లు ఇప్ప‌ట్లో లేన‌ట్లేనా..? కోర్టు విచార‌ణ సారాంశం అదేనా...?nimmagadda vs jagan;andhra pradesh;high court;srikakulam;january;december;october;local language;sara shrawan;coronavirusWed, 16 Dec 2020 09:38:21 GMTస్థానిక ఎన్నిక‌లు ఇప్ప‌ట్లో జ‌రిగేలా క‌న‌బ‌డ‌టం లేదు. క‌రోనా వైర‌స్ ఉధృతి ఎక్కువ‌గా ఉన్న నేప‌థ్యంలో ఇప్ప‌ట్లో నిర్వ‌హించ‌లేమని రాష్ట్ర ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేస్తూ వ‌స్తోంది. అయితే రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న్ మాత్రం స్థానిక ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు ప‌ట్టుబ‌డుతున్న విష‌యం తెలిసిందే. తాజాగా ఏపీ స్థానిక ఎన్నికలపై హైకోర్టులో విచారణ జరిగింది. హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన ప్రభుత్వం ఫిబ్రవరిలో స్థానిక ఎన్నికలు నిర్వహించలేమని తేల్చిచెప్పింది. జనవరి, ఫిబ్రవరిలో కరోనా వ్యాక్సినేషన్ ఉంటుందన్న ప్రభుత్వం కరోనా వ్యాక్సినేషన్‌కు అన్ని శాఖల సేవలు అవసరమని నివేదించింది. మొదటి డోస్ వేసిన 4 వారాల్లో రెండో డోస్ వేయాల్సి ఉంటుందని, అందువల్ల ఫిబ్రవరిలో స్థానిక ఎన్నికలు నిర్వహించలేమని తేల్చిచెప్పింది. ప్రభుత్వ అఫిడవిట్‌పై కౌంటర్ దాఖలుకు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ సమయం కోరారు. దాంతో, తదుపరి విచారణ శుక్రవారానికి వాయిదా వేసింది హైకోర్టు.


వాస్త‌వానికి ఆగ‌స్టు మాసంలోనే స్థానిక సంస్థల పాలనపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని 108 కార్పొరేష‌న్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయితీలలో ప్రత్యేకాధికారుల పాలనను ప్రభుత్వం పొడిగించింది. దీనితో ఏపీలో ఇప్పట్లో స్థానిక సంస్థల ఎన్నికలు లేనట్లుగా ప్రభుత్వం సంకేతాలు ఇచ్చినట్లయింది. కరోనా వైరస్ కారణంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసిన నేపధ్యంలో ఈ నోటిఫికేషన్‌ను జారీ చేసినట్లుగా పురపాలకశాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది.



శ్రీకాకుళం మినహా మిగిలిన అన్ని జిల్లాలోని కార్పోరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలనను డిసెంబర్ 31 వరకు లేదా పాలకవర్గం ఏర్పాటు అయ్యేంతవరకు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీకాకుళంలో మాత్రం అక్టోబర్ 10వ తేదీ వరకు ప్రత్యేకాధికారుల పాలనను పొడిగించింది. కాగా, రాష్ట్రవ్యాప్తంగా అన్ని పురపాలక సంఘాల్లో వచ్చే ఏడాది జనవరి 2 వరకు ప్రత్యేకాధికారుల పాలన పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం నోటిఫికేషన్‌లో పేర్కొంది.


గోడౌన్లుగా మారుతున్న థియేటర్లు

భారీ బడ్జెట్ 'రామాయణం'.. డైలాగ్స్ రాసేసిన మాటల మాంత్రికుడు!

పశ్చిమ బెంగాల్లో రసవత్తర రాజకీయం..!

కొవిడ్ వ్యాక్సిన్ ఎంట్రీకి కౌంట్ డౌన్..!

వ్యవసాయ చట్టాలపై.. రైతులతో మోదీ మాటామంతీ..

ఆ సూర్య గ్రహణాన్ని చూడాలంటే..!

బిగ్‌బాస్-4: గ్రాండ్ ఫినాలేలో హాట్ హీరోయిన్ల ఆటపాట?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Spyder]]>