PoliticsSS Marvelseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/-latest-news-updateseab48106-295e-4e35-a458-62afb9bbe3e1-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/-latest-news-updateseab48106-295e-4e35-a458-62afb9bbe3e1-415x250-IndiaHerald.jpgమన దాయాది దేశం పాకిస్థాన్ తాజాగా మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు, అత్యాచారాలను అరికట్టే కఠిన చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఈ చట్టం ప్రకారం అత్యాచారానికి పాల్పడినవారిని రసాయనాల సహాయంతో నపుంసకులుగా మార్చేస్తారు. గత నెలలో ఈ చట్టానికి పాక్ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ నేతృత్వంలోని క్యాబినెట్ ఆమోదించగా.. దేశాధ్యక్షుడు ఆరిఫ్‌ అల్వీ మంగళవారం ఆమోద ముద్ర వేశారు. pakistan;women;imran khan;pakistan;sathwara;telugu;police;court;prime minister;job;cabinet;woman;96;lie;punjabఅత్యాచారాలను అరికట్టేందుకు కటినతరమైన చట్టం చేసిన పాకిస్తాన్!అత్యాచారాలను అరికట్టేందుకు కటినతరమైన చట్టం చేసిన పాకిస్తాన్!pakistan;women;imran khan;pakistan;sathwara;telugu;police;court;prime minister;job;cabinet;woman;96;lie;punjabWed, 16 Dec 2020 15:15:00 GMTమన దాయాది దేశం పాకిస్థాన్ తాజాగా మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు, అత్యాచారాలను అరికట్టే కఠిన చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఈ చట్టం ప్రకారం అత్యాచారానికి పాల్పడినవారిని రసాయనాల సహాయంతో నపుంసకులుగా మార్చేస్తారు. గత నెలలో ఈ చట్టానికి పాక్ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ నేతృత్వంలోని క్యాబినెట్ ఆమోదించగా.. దేశాధ్యక్షుడు ఆరిఫ్‌ అల్వీ మంగళవారం ఆమోద ముద్ర వేశారు. తాజా చట్టంలోని నిబంధనల ప్రకారం.. మహిళలు, చిన్నారులపై లైంగిక దాడుల కేసుల్లో సత్వర విచారణ చేపట్టేందుకుగాను ప్రభుత్వం ప్రత్యేక కోర్టులను ఏర్పాటుచేస్తుంది. ఈ ప్రత్యేక కోర్టులు నాలుగు నెలల్లోనే విచారణను పూర్తిచేస్తాయి. ఈ కేసుల్లో దోషులుగా నిర్ధారణ అయితే రసాయనాల వినియోగంతో వంధ్య వ్యక్తులుగా మార్చొచ్చు. లైంగిక దాడుల కేసుల దర్యాప్తులో నిర్లక్ష్యంగా వ్యవహరించే పోలీసులు, అధికారులకు మూడేళ్ల వరకు జైలు శిక్ష, జరిమానాలు విధించొచ్చు. తాజా చట్టం ప్రకారం.. ఘటన జరిగిన ఆరు గంటల్లోగా మెడికో-లీగల్ అంశాలను పూర్తిచేయాలి. అలాగే, నేషనల్ డేటాబేస్ అండ్ రిజిస్ట్రేషన్ అథారిటీ సహాయంతో లైంగిక నేరాలకు పాల్పడిన నేరస్థుల రిజిస్ట్రీ ఏర్పాటు చేయనున్నారు.

 

బాధితుల వివరాలు వెల్లడించరాదు.. వాటిని బహిర్గతం చేయడం శిక్షార్హమైన నేరం. తప్పుడు సమాచారం ఇచ్చిన అధికారులకు కూడా జైలు శిక్ష, జరిమానా ఉంటాయి. మెడికో-లీగల్ పరీక్ష సమయంలో అత్యాచార బాధితులకు చేసే అమానవీయ, అవమానకరమైన రెండు వేళ్ల కన్యత్వ పరీక్షను ఈ చట్టం రద్దు చేసింది. అలాగే, బాధితురాలిని నిందితుడు క్రాస్ ఎగ్జామినేషన్ చేసే అవకాశం ఉండదు. కేవలం న్యాయమూర్తి, నిందితుడి తరఫు లాయర్‌ మాత్రమే బాధితులను క్రాస్ ఎగ్జామినేషన్ చేయవచ్చు. ఈ ఏడాది సెప్టెంబరులో పంజాబ్ ప్రావిన్సుల్లో ఓ మహిళపై ఆమె పిల్లల ముందే కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన చోటుచేసుకోవడంతో దీనిపై తీవ్రంగా స్పందించిన ప్రధాని ఇమ్రాన్ ఖాన్.. ఇటువంటి కేసుల్లో నిందితులను కఠినంగా శిక్షించేలా చట్టం తీసుకురావాలని న్యాయశాఖకు సూచించారు. అలాగే, సింధ్ ప్రావిన్సుల్లో ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి ఓ మహిళ, ఆమె కుమార్తెపై గ్యాంగ్ రేప్‌నకు పాల్పడిన ఘటనపై ప్రధాని తీవ్రంగా కలత చెందారు.




‘దేశముదురు ’ను ఆ హీరో వదులుకుంటే బన్నీకి హిట్ లభించిందా..

20 నిమిషాల రోల్.. 20 కోట్ల రెమ్యునరేషన్.. సలార్ అంటే ఇదే..!

స్క్రీన్ షేర్ చేసుకోనున్న బాలయ్య, నాగశౌర్య?

బ్లాక్ కాఫీతో వెయిట్ లాస్ సాధ్యమేనా

వీరిలో టాలీవుడ్ నెంబర్ 1 స్టార్ హీరోయిన్ ఎవరు

స్టైలిష్ స్టార్ ని టాప్ హీరోగా నిలబెట్టిన ఆ సినిమాని ఆ హీరో రిజెక్ట్ చేశాడట..

మాట నిలబెట్టుకున్న తెలంగాణా సర్కార్... డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళకు సూపర్ సౌకర్యాలు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SS Marvels]]>