PoliticsSreekanth Eeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/chennamanenie7801caf-745f-4f7a-84cf-763c94b93a04-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/chennamanenie7801caf-745f-4f7a-84cf-763c94b93a04-415x250-IndiaHerald.jpgచెన్నమనేని రమేష్ బాబు జర్మనీ పౌరసత్వం ఇప్పటికీ కొనసాగుతోందని, ఈ పౌరసత్వాన్ని 2023 వరకు పొడగించుకున్నారని కేంద్ర హోంశాఖ తెలంగాణ హై కోర్టు నివేదించింది. అయితే అఫిడవిట్‌కు బదులుగా మెమో దాఖలు చేయడంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పూర్తి వివరాలను సమర్పించాలని కేంద్రాన్ని ఆదేశిస్తూ తదుపరి విచారణ జనవరి 20కి వాయిదా వేసింది. chennamaneni;telangana rashtra samithi trs;germany;telangana;district;january;court;mla;lawyer;letter;central government;sircillaచెన్నమనేని పౌరసత్వంపై వివాదం... హైకోర్టు సీరియస్చెన్నమనేని పౌరసత్వంపై వివాదం... హైకోర్టు సీరియస్chennamaneni;telangana rashtra samithi trs;germany;telangana;district;january;court;mla;lawyer;letter;central government;sircillaWed, 16 Dec 2020 19:56:00 GMTసిరిసిల్ల జిల్లా వేములవాడ టీఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు పౌరసత్వంపై వివాదం కొనసాగుతోంది. ఈ వివాదంపై తెలంగాణ హై కోర్టు బుధవారం విచారణ జరిపింది. చెన్నమనేని రమేష్ కు ఇంకా జర్మనీ పౌరసత్వం ఉందని కేంద్ర ప్రభుత్వం ఈ సందర్భంగా హై కోర్టు దృష్టికి తీసుకెళ్ళింది. చెన్నమనేని 2023 వరకు తన జర్మన్ పౌరసత్వాన్ని పొడగించుకున్నారని కేంద్ర హోం శాఖ తరుపు న్యాయవాది న్యాయస్థానానికి తెలిపారు. దీనికి సంబంధించి  మెమో కూడా దాఖలు చేసారు.

అయితే అఫిడవిట్‌కు బదులుగా మెమో దాఖలు చేయడం పట్ల హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో సమర్పించిన మెమోనే మళ్లీ సమర్పించడాన్ని ధర్మాసనం తప్పు పట్టింది. అఫిడవిట్ రూపంలో వివరాలు సమర్పించాలని కేంద్రాన్ని హై కోర్టు ఆదేశిస్తూ  తదుపరి విచారణ జనవరి 20కి వాయిదా వేసింది. కాగా ఏడాది క్రితం  కేంద్ర హోం శాఖ చెన్నమనేని రమేష్ పౌరసత్వాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో కేంద్ర హోం శాఖ నిర్నయాన్ని సవాల్ చేస్తూ చెన్నమనేని రమేష్ తెలంగాణ హై కోర్టును ఆశ్రయించారు. దీనిపై ఇంకా విచారణ సాగుతోంది.

అయితే  చెన్నమనేని ద్వంద్వ పౌరసత్వం  కలిగి ఉన్నారని నిరూపించేలా  జర్మనీ నుంచి ఆధారాలు తేవాలని  హైకోర్టు గతంలో ఆదేశించింది. అయితే  కేంద్ర హోం శాఖ హైకోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా గతంలో సమర్పించిన మెమోనే  మళ్లీ సమర్పించడం పట్ల హై కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. అధికారులు జర్మనీ కాన్సులేట్‌ నుంచి వివరాలు తీసుకోలేకపోవడాన్ని ఆక్షేపించింది. వివరాలు సేకరించని ఆఫీసర్స్‌కు ఇంకా  అధికారాలు ఎందుకని ప్రశ్నించింది. జనవరి 20లోగా పూర్తి సమాచారం అందించాలని ఆదేశించింది. కాగా ఈ ఏడాది కరోనా లాక్ డౌన్ ముందు జర్మనీ వెళ్ళిన చెన్నమనేని రమేష్ కు వ్యతిరేకంగా నియోజకవర్గ ప్రజలు ఆందోళనలు చేపడుతున్నారు.




కేసుల మాఫీ కోసమే ఢిల్లీ టూర్ ! జగన్ పై చంద్రబాబు ఫైర్

ప్రేయసి కోసం సముద్రాన్ని దాటి.. చివరకు జైలు పాలైన లవర్!

పెద్ద సినిమాలు తొక్కిపడేస్తాయట...?

ఆ సినిమా కోసం డైరెక్టర్ వేటలో కింగ్ నాగార్జున.. కథేంటంటే..

పాక్ యుద్ధంపై ప్రధానిని వ్యతిరేకించిన భారత జనరల్.. భయపడి కాదు..!

ఆదిపురుష్ నుంచి సైఫ్ ఆలీఖాన్ అవుట్...?

కేసీఆర్ నగర్ ను ప్రారంభించిన హరీష్ రావు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Sreekanth E]]>