MoviesVAMSIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/hrutik-and-kangana-dispute-starts-againa17f2f06-d675-42a8-83b5-352b5244bd61-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/hrutik-and-kangana-dispute-starts-againa17f2f06-d675-42a8-83b5-352b5244bd61-415x250-IndiaHerald.jpgఆ క్రమంలో కంగనా రనౌత్ హీరో హృతిక్ పై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. అలా ఈ ప్రేమ వ్యవహారం లో ఇరువురి మధ్య "మెయిల్" రచ్చ మొదలైంది. కంగనా తో తనకు ఎటువంటి సంబంధం లేదని.. అయినా ఆమె జిమెయిల్ అకౌంట్ నుండి వందలకొద్దీ మెయిల్స్ వస్తున్నాయని... దీని కారణంగా తన ఇమేజ్ దెబ్బతింటుందని 2016లో పోలీసులకు ఫిర్యాదు చేశారు హృతిక్. అయితే ఆ కేసుపై ఎటువంటి పురోగతి లేదని, ఇప్పటికైనా దానిపై దృష్టి సారించాలంటూ హృతిక్‌ తరఫు లాయర్‌ మహేష్‌ జెఠ్మలానీ ముంబై పోలీసులకు తాజాగా లేఖ రాశారు.hrutik and kangana dispute starts again;hrithik roshan;kangana ranaut;jeevitha rajaseskhar;krish;prema;roshan;mumbai;bollywood;cinema;rajani kanth;police;hushaaru;twitter;love;hero;letter;gmail;queen;racchaమళ్ళీ మొదలైన మాజీ ప్రేమికుల గొడవ...!మళ్ళీ మొదలైన మాజీ ప్రేమికుల గొడవ...!hrutik and kangana dispute starts again;hrithik roshan;kangana ranaut;jeevitha rajaseskhar;krish;prema;roshan;mumbai;bollywood;cinema;rajani kanth;police;hushaaru;twitter;love;hero;letter;gmail;queen;racchaWed, 16 Dec 2020 11:00:00 GMT" style="height: 768px;">
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ... ఈ మధ్యకాలంలో ఎన్నో రకాల సమస్యలు ఎదుర్కొంటూ అలాగే వాటికి ఎదురు నిలబడి దాటుకుంటూ వస్తున్నారు. అటు సినిమాలలోనూ ఇటు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటున్నారు కంగనా  రనౌత్. ఇక బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్ అంతే హుషారుగా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. అయితే ఇప్పుడు వీరిద్దరికి సంబంధించిన ఒక తాజా వార్త సంచలనం సృష్టిస్తోంది. హృతిక్ రోషన్ ను ఉద్దేశించి కంగనా పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది. అయితే క్రిష్ 3 సినిమా తర్వాత  వీరి మధ్య ఘాటు ప్రేమాయణం నడిచిందని బాలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపించింది. వీరిది గొప్ప ప్రేమ జంటని, మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని, స్వీట్ లవర్స్ అని ఇలా ఎన్నో ప్రచారాలు జరిగాయి.  కొంత కాలం తర్వాత వీరి మధ్య మనస్పర్థలు ఏర్పడి బ్రేకప్ అయినట్లు వార్తలు వచ్చాయి.

ఆ క్రమంలో కంగనా రనౌత్ హీరో హృతిక్ పై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. అలా ఈ ప్రేమ వ్యవహారం లో ఇరువురి మధ్య "మెయిల్" రచ్చ మొదలైంది. కంగనా తో తనకు ఎటువంటి సంబంధం లేదని.. అయినా ఆమె జిమెయిల్ అకౌంట్ నుండి వందలకొద్దీ మెయిల్స్ వస్తున్నాయని... దీని కారణంగా తన ఇమేజ్ దెబ్బతింటుందని 2016లో పోలీసులకు ఫిర్యాదు చేశారు హృతిక్. అయితే ఆ కేసుపై ఎటువంటి పురోగతి లేదని, ఇప్పటికైనా దానిపై దృష్టి సారించాలంటూ హృతిక్‌ తరఫు లాయర్‌ మహేష్‌ జెఠ్మలానీ ముంబై పోలీసులకు తాజాగా లేఖ రాశారు. విషయాన్ని తెలుసుకున్న కంగనా రనౌత్ స్పందిస్తూ తన మాజీ ప్రియుడు హృతిక్ రోషన్ పై మండిపడ్డారు.

అతడి ఏడుపుగొట్టు కథ మళ్లీ మొదటికొచ్చింది. అతనితో బ్రేకప్‌ అయ్యి, అతని ప్రేమకు  విడాకులు తీసుకుని చాలా ఏళ్లు అవుతోంది. అయినా జరిగిన దాన్ని మరచి అతడి ముందుకు సాగడం లేదు. వేరే మహిళతో డేటింగ్‌ చేయడానికి ఇష్టపడటం లేదు. నా వ్యక్తిగత  నా జీవితంలో ఎదురైన సమస్యలను అధిగమించి  ధైర్యంగా నేను ముందుకు సాగుతుంటే హృతిక్ మళ్లీ అదే డ్రామా రిపీట్ చేస్తున్నాడు. ఈ చిన్నపాటి ఎఫైర్‌ గురించి ఇంకా ఎంత కాలం టైం వేస్ట్ చేసుకుంటావు హృతిక్ ‌’అంటూ  కంగనా  హృతిక్‌ రోషన్‌పై విమర్శలు విసిరారు. 


అమరావతి ఏకైక రాజధాని... జగన్ పప్పులు ఉడకవా..?

ఏపీ స్థానిక ఎన్నిక‌లు ఇప్ప‌ట్లో లేన‌ట్లేనా..? కోర్టు విచార‌ణ సారాంశం అదేనా...?

భారీ బడ్జెట్ 'రామాయణం'.. డైలాగ్స్ రాసేసిన మాటల మాంత్రికుడు!

పశ్చిమ బెంగాల్లో రసవత్తర రాజకీయం..!

కొవిడ్ వ్యాక్సిన్ ఎంట్రీకి కౌంట్ డౌన్..!

వ్యవసాయ చట్టాలపై.. రైతులతో మోదీ మాటామంతీ..

ఆ సూర్య గ్రహణాన్ని చూడాలంటే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>