PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/id-venkaiah-statement-created-sensation-among-yellow-batch63f9cd0a-31fe-490f-a077-9b2efbb4522b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/id-venkaiah-statement-created-sensation-among-yellow-batch63f9cd0a-31fe-490f-a077-9b2efbb4522b-415x250-IndiaHerald.jpgఅన్నదాతల ప్రగతిలోనే దేశాభివృద్ధి ఉందని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. స్వర్ణభారత్ ట్రస్ట్ స్థాపన వెనుక ఉద్దేశాల్లో రైతుల ప్రగతి కూడా ఒకటి అని ఆయన అన్నారు. రైతునేస్తం, ముప్పవరపు ఫౌండేషన్ అవార్డుల ప్రదానం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రైతుల ఆదాయం పెంచే దిశగా కేంద్ర ప్రభుత్వం, పలు రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న కార్యక్రమాలు అభినందనీయం అని ఆయన వెల్లడించారు. ఇటీవల నెలకొన్న పరిణామాల నేపథ్యంలో రైతులు, కేంద్ర ప్రభుత్వం మధ్య చర్చలు ఫలప్రదం కావాలని తన ఆకాంక్ష అన్నారు. విడ్ పరిస్థితుల్లోనూ ఆహారోvenkaiah naidu;pragathi;culture;professor;central government;venkaiah naiduవెంకయ్య నాయుడు కీలక వ్యాఖ్యలువెంకయ్య నాయుడు కీలక వ్యాఖ్యలుvenkaiah naidu;pragathi;culture;professor;central government;venkaiah naiduWed, 16 Dec 2020 17:19:03 GMTఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు.  స్వర్ణభారత్ ట్రస్ట్ స్థాపన వెనుక ఉద్దేశాల్లో రైతుల ప్రగతి కూడా ఒకటి అని ఆయన అన్నారు.  రైతునేస్తం, ముప్పవరపు ఫౌండేషన్ అవార్డుల ప్రదానం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రైతుల ఆదాయం పెంచే దిశగా కేంద్ర ప్రభుత్వం, పలు రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న కార్యక్రమాలు అభినందనీయం అని ఆయన వెల్లడించారు. ఇటీవల నెలకొన్న పరిణామాల నేపథ్యంలో రైతులు, కేంద్ర ప్రభుత్వం మధ్య చర్చలు ఫలప్రదం కావాలని తన ఆకాంక్ష అన్నారు.

విడ్ పరిస్థితుల్లోనూ ఆహారోత్పత్తి పెంచే దిశగా అన్నదాతల కృషి మరువలేనిదని ఆయన వెల్లడించారు. అన్నదాతలకు చేయూతనిచ్చేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరిన్ని ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలి అని పేర్కొన్నారు. చదువుకున్న యువత, తమ విజ్ఞానంతో వ్యవసాయ రంగం అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. శాస్త్రవేత్తలు, అధికారులు, పాత్రికేయులు ముగ్గురూ కలిసి త్రిమూర్తుల్లా రైతుల కోసం సమన్వయంతో పని చేయాలని సూచనలు చేసారు. రైతుల కష్టం కేవలం వారి కోసం మాత్రమే కాదని, లోకానికి అన్నం పెట్టడానికని తెలియజేసిన ఉపరాష్ట్రపతి, అమ్మ తర్వాత అంత గొప్పమనసు రైతన్నలదే అని వెల్లడించారు.

హైదరాబాద్‌లోని ముచ్చింతల్ స్వర్ణభారత్ ట్రస్ట్ లో ‘రైతు నేస్తం’, ‘ముప్పవరపు ఫౌండేషన్’ సంయుక్తంగా నిర్వహించిన  అవార్డుల ప్రదానోత్సవానికి విచ్చేసిన ఆయన ప్రొఫెసర్ సర్వారెడ్డి వెంకురెడ్డికి ‘జీవన సాఫల్య పురస్కారాన్ని’, బ్రిగేడియర్ పోగుల గణేశం గారికి ‘కృషిరత్న’ పురస్కారాలను అందించారు. ఇటీవల ముప్పవరపు ఫౌండేషన్ సహకారంతో, రైతునేస్తం నిర్వహించిన ‘పల్లె పథం’ వ్యవసాయ లఘుచిత్రాల పోటీల్లో విజేతలకు బహుమతులు అందించారు. వీరితో పాటు రైతులు, విస్తరణ విభాగ అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యవసాయ పాత్రికేయులు తదితరులకు సైతం పురస్కారాలు వెంకయ్య అందజేశారు.వ్యవసాయానికి విజ్ఞానం మరింత చేరువ కావాలంటే ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని జరగాలని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. మంచిని ప్రోత్సహించడం భారతీయ సంస్కృతి అన్నారు.


'జెర్సీ' షూటింగ్ పూర్తి.. ఎమోషనల్ అయిన హీరో

రోజుకు 100మందికే కరోనా వ్యాక్సిన్?.. కేంద్రం ప్రకటన!

మైండ్ బ్లాక్ అయ్యే రెమ్యునరేషన్.. F3 కోసం అనీల్ రావిపుడికి అంత ఇస్తున్నారా..?

ఆ నెలలో సాగర్ ఉపఎన్నిక ఉంటుందట..

సీఎంల ఢిల్లీ పర్యటనపై రాజకీయాల్లో ఉత్కంఠ..!

ఇటు ఎస్ఈసీ...అటు సర్కార్ నడుమ స్థానిక సమరం

రైతుల ఉద్యమం వెనుక కీలక పాత్ర పోషిస్తున్న మహిళలు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>