PoliticsP.Phanindraeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kamalhassan43e162f1-1288-44ce-9a54-e3126a346c62-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kamalhassan43e162f1-1288-44ce-9a54-e3126a346c62-415x250-IndiaHerald.jpgతమిళ నటుడు కమల్‌హాసన్‌‌కు చెందిన మక్కల్‌ నీది మయ్యం పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం షాక్‌ ఇచ్చింది. గత పార్లమెంట్‌ ఎన్నికల్లో మక్కల్ నీది మయ్యం పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం టార్చ్‌లైట్‌ గుర్తును కేటాయించింది. ఈ సమయంలో కమల్‌హాసన్‌, ఆయన పార్టీ నేతలు, కార్యకర్తలు పార్లమెంట్‌ ఎన్నికల్లో టార్చ్‌లైట్లు చేత పట్టుకుని తీవ్ర ప్రచారం చేశారు. kamalhassan;tamil;loksabha;assembly;mla;chennai;tamilnadu;central government;election commission;torchlight;partyకమల్ హాసన్‌కు షాకిచ్చిన ఈసీ.. ఊరుకోమంటున్న విశ్వనటుడుకమల్ హాసన్‌కు షాకిచ్చిన ఈసీ.. ఊరుకోమంటున్న విశ్వనటుడుkamalhassan;tamil;loksabha;assembly;mla;chennai;tamilnadu;central government;election commission;torchlight;partyWed, 16 Dec 2020 23:23:47 GMTతమిళ నటుడు కమల్‌హాసన్‌‌కు చెందిన మక్కల్‌ నీది మయ్యం పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం షాక్‌ ఇచ్చింది. గత పార్లమెంట్‌ ఎన్నికల్లో మక్కల్ నీది మయ్యం పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం టార్చ్‌లైట్‌ గుర్తును కేటాయించింది. ఈ సమయంలో కమల్‌హాసన్‌, ఆయన పార్టీ నేతలు, కార్యకర్తలు పార్లమెంట్‌ ఎన్నికల్లో టార్చ్‌లైట్లు  చేత పట్టుకుని తీవ్ర ప్రచారం చేశారు. దీంతో మక్కల్‌ నీది మయ్యం పార్టీ గుర్తు టార్చ్‌లైట్‌ అని ప్రజల్లోకి వెళ్లిపోయింది. అయితే కేంద్ర ఎన్నికల సంఘం పుదుచ్చేరిలో మాత్రమే మక్కల్ నీది మయ్యం పార్టీకి టార్చ్‌లైట్‌ గుర్తును కేటాయించింది. కానీ తమిళనాడులో మాత్రం ఆ గుర్తును ఇవ్వలేదు. ఇదే సమయంలో తమిళనాడులోని ఎంజీఆర్‌ మక్కల్‌ కట్చికి కేంద్ర ఎన్నికల సంఘం టార్చ్‌లైట్‌ గుర్తును కేటాయించింది. దీంతో మక్కల్ నీది మయ్యం కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. టార్చిలైటు గుర్తు వేరే పార్టీకి కేటాయించారని తెలుసుకున్న మక్కల్‌ నీదిమయ్యం నాయకుడు కమల్‌హాసన్‌ తీవ్ర అసంతృప్తి చెందుతున్నారు.

చట్ట ప్రకారం టార్చ్ లైట్ గుర్తు తమ పార్టీకి చెందుతుందని ఆయన వాదిస్తున్నారు. ఈ విషయంపై సైలెంట్‌గా ఉండమని, పోరాటం సాగిస్తామంటూ కమల్‌హాసన్‌ తెలిపారు. ఇదిలా ఉంటే.. ఆర్కేనగర్‌ ఎమ్మెల్యే టీటీవీ దినకరన్‌‌కు చెందిన అమ్మా మక్కల్‌ మున్నేట్ర కళగంకు కేంద్ర ఎన్నికల సంఘం కుక్కర్‌ గుర్తును కేటాయించింది. కుక్కర్ గుర్తును కేటాయించిన తరువాత ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా టపాకాయలు పేల్చి, మిఠాయిలు పంచుకున్నారు. గతంలో ఆర్కేనగర్‌ నియోజకవర్గంలో దినకరన్‌ కుక్కర్‌ గుర్తుతో పోటీ చేసి అన్నాడీఎంకే, డీఎంకేలను మట్టికరిపించి విజయం సాధించారు. ఆ ఎన్నికల తర్వాత కుక్కర్ చిహ్నాన్ని తమ పార్టీకే కేటాయించాలని దినకరన్‌ గత లోక్‌సభ ఎన్నికల్లో కేంద్ర ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశారు.

అయితే దిన్‌కర్ పార్టీకి చెందిన కొంతమంది నేతలు పోటీ చేసిన కొన్ని నియోజకవర్గాల్లో మాత్రమే కుక్కర్‌ గుర్తును కేంద్ర ఎన్నికల సంఘం కేటాయించింది. ఇతర నియోజకవర్గాల్లో వేరే గుర్తులను ఇచ్చింది. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో దిన్‌కరన్ పార్టీ నేతలందరూ కూడా కుక్కర్ గుర్తుపైనే బరిలో నిలవనున్నారు. దీంతో ఆ పార్టీ నేతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.







గ్రీన్ టీతో డయాబెటిస్ సమస్య శాశ్వతంగా దూరం అవుతుంది...

ఏలూరు వింత వ్యాధికి కారణమిదే.. బయటపెట్టిన అధికారులు

నిర్భయ తల్లి సంచలన ప్రతిజ్ఞ

రకుల్‌కు ఇల్లు కొనిచ్చిన రాజకీయ నేత? దీనిపై రకుల్ స్పందన ఇదీ!

సాగు చట్టాలా మజాకా.. దేశంలోనే తొలిసారి వ్యాపారికి జరిమానా!

ప్రేయసి కోసం సముద్రాన్ని దాటి.. చివరకు జైలు పాలైన లవర్!

పెద్ద సినిమాలు తొక్కిపడేస్తాయట...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Phanindra]]>