Viralyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/vaccine7d93aeda-a0ee-4b1b-8461-4c1c57dc95d6-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/vaccine7d93aeda-a0ee-4b1b-8461-4c1c57dc95d6-415x250-IndiaHerald.jpgకరోనా నియంత్రణ కోసం అనేక దేశాలు ప్రయత్నిస్తున్నాయి. ఆయా దేశాల్లోని అనేక మెడికల్ సంస్థలు వ్యాక్సిన్ తయారీలో మునిగిపోయాయి. ఈ నేపథ్యంలోనే అమెరికాకు చెందిన ఫీఫైజర్, మొడెర్నా, రష్యాకు సంబంధించి స్పుత్నిక్-వి, ఇంగ్లండ్‌లోని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన.. vaccine;virginia;vఆ వ్యాక్సిన్ మాకొద్దు మహాప్రభో!ఆ వ్యాక్సిన్ మాకొద్దు మహాప్రభో!vaccine;virginia;vWed, 16 Dec 2020 16:12:16 GMTవాషింగ్టన్: కరోనా నియంత్రణ కోసం అనేక దేశాలు ప్రయత్నిస్తున్నాయి. ఆయా దేశాల్లోని అనేక మెడికల్ సంస్థలు వ్యాక్సిన్ తయారీలో మునిగిపోయాయి. ఈ నేపథ్యంలోనే అమెరికాకు చెందిన ఫీఫైజర్, మొడెర్నా, రష్యాకు సంబంధించి స్పుత్నిక్-వి, ఇంగ్లండ్‌లోని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన వ్యాక్సిన్‌, భారత్‌కు చెందిన కొవ్యాక్సిన్ వంటి వ్యాక్సిన్‌లు ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా పేరుపొందాయి. వీటిలో కొన్నింటికి అనేక దేశాల్లో అత్యవసర వినియోగానికి అనుమతులు కూడా లభించాయి. అయితే ఇలా అత్యవసర పరిస్థితుల్లో వినియోగించేందుకు అనుమతి పొందిన వ్యాక్సిన్‌లను తీసుకునేందుకు అనేకమంది అమెరికన్లు అంగీకరించడం లేదు.

ఈ రకమైన కరోనా టీకాలను ప్రభుత్వ కుట్రగా కూడా వారు భావిస్తున్నారు. ఈ అనుమానాలను దూరం చేసేందుకు అక్కడి ప్రభుత్వాలు విస్తృత ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. దీనికి సంబంధించి వర్జీనియా కామన్‌వెల్త్ యూనివర్శిటీ నిర్వహించిన ఓ సర్వేలో షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. అదేంటంటే ఏకంగా 50 శాతం అమెరికన్లు అత్యవసర అనుమతి ఉన్న వ్యాక్సిన్ తీసుకోవడానికి వ్యతిరేకంగా ఉన్నారట.

దాదాపు 788 మంది అమెరికన్లపై నిర్వహించిన ఈ సర్వేలో.. అత్యవసర అనుమతులు మాత్రమే ఉన్న టీకాలను తాము వేయించుకోమని 394 మంది తేల్చి చెప్పారట. అయితే పూర్తి స్థాయి అనుమతులు లభించిన తరువాత తాము టీకా వేయించుకుంటామని చెప్పారు. ఇటీవల కొందరు వలంటీర్లలో సైడ్ ఎఫెక్ట్స్ తలెత్తుతున్నట్టు వార్తలు వస్తున్నాయని, వీటివల్ల తామలో ఆందోళన కలుగుతోందని చెబుతున్నారు.

అంతేకాదు వయోధికలు కంటే యువతే టీకా పట్ల సానుకూల వైఖరితో ఉన్నారట. నల్లజాతి వారి కంటే శ్వేతజాతి వారికే కరోనా టీకాలను విశ్వసిస్తున్నట్టు తేలింది. ఈ పరిణామం అమెరికన్ అధికార వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అమెరికన్ల నల్లజాతి వారు అధికంగా కరోనా బారినపడ్డారని, ఈ పరిస్థితుల్లో వీరు టీకాను వ్యతిరేకిస్తే పరిస్థితి మరింత దిగజారే ఆస్కారం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.                 


'జెర్సీ' షూటింగ్ పూర్తి.. ఎమోషనల్ అయిన హీరో

రోజుకు 100మందికే కరోనా వ్యాక్సిన్?.. కేంద్రం ప్రకటన!

మైండ్ బ్లాక్ అయ్యే రెమ్యునరేషన్.. F3 కోసం అనీల్ రావిపుడికి అంత ఇస్తున్నారా..?

ఆ నెలలో సాగర్ ఉపఎన్నిక ఉంటుందట..

సీఎంల ఢిల్లీ పర్యటనపై రాజకీయాల్లో ఉత్కంఠ..!

ఇటు ఎస్ఈసీ...అటు సర్కార్ నడుమ స్థానిక సమరం

రైతుల ఉద్యమం వెనుక కీలక పాత్ర పోషిస్తున్న మహిళలు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>