Crimesavitri shivaleelaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/suicide7b6bb38c-dcc9-4295-acf7-170be1c134dd-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/suicide7b6bb38c-dcc9-4295-acf7-170be1c134dd-415x250-IndiaHerald.jpgతన స్నేహితుడితో సన్నిహితంగా ఉండటమే ఆమె పాలిట శాపమైంది. ఆ స్నేహమే ఆ ఆమె మెడకు యమ పాశమై కూర్చుంది. తొందరలో పెళ్లి పీటలెక్కాల్సిన ఆ యువతి కాటికి పయణమయ్యింది. ఆ స్నేహమే ఆమె చేసిన అతిపెద్ద తప్పు. నిండు ప్రాణాలను తీసేంత స్నేహం అంటే నమ్మకం కలగడం లేదు కదా. ఇదిస్టోరీ కాదు. ఒక యువతి నిండు ప్రాణాలు తీసిన దారుణ ఘటన. ఈ దారుణం సూర్యపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలంలో 4 రోజుల కిందట జరిగి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలానికి చెందిన ఓ యువతి(23) హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ హాస్పsuicide;vamsi;hyderabad;korcha;district;police;mandalam;marriage;murder.;allu snehaతనను పెళ్లి చేసుకోవడం లేదని ఆ యువతిని !తనను పెళ్లి చేసుకోవడం లేదని ఆ యువతిని !suicide;vamsi;hyderabad;korcha;district;police;mandalam;marriage;murder.;allu snehaWed, 16 Dec 2020 16:25:14 GMTపెళ్లి పీటలెక్కాల్సిన ఆ యువతి కాటికి పయణమయ్యింది. ఆ స్నేహమే ఆమె చేసిన అతిపెద్ద తప్పు. నిండు ప్రాణాలను తీసేంత స్నేహం అంటే నమ్మకం కలగడం లేదు కదా. ఇదిస్టోరీ కాదు. ఒక యువతి నిండు ప్రాణాలు తీసిన దారుణ ఘటన. ఈ దారుణం సూర్యపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలంలో 4 రోజుల కిందట జరిగి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలానికి చెందిన ఓ యువతి(23) హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ హాస్పటల్ లో ఉద్యోగం చేస్తుండేది. అయితే తనతో పాటు చదువుకున్న బొడ్డుపల్లి వంశీ అనే వ్యక్తి సదరు యువతి సన్నిహితంగా ఉండేవారు.

కొన్ని నెలలు వారు బాగానే ఉన్నా ఇద్దరి మధ్య చిన్న చిన్న గొడవలు జరిగాయి. దాంతో ఆ యువతి వంశీని దూరం పెట్టింది. ఈ క్రమంలోనే ఆ యువతికి అదే మండలానికి చెందిన వేరే వ్యక్తితో పెళ్లి ఫిక్స్ అయ్యింది. ఈ విషయం తెలుసుకున్నవంశీ ఆ యువతిని నన్నే పెళ్లి చేసుకోవాలి అంటూ బెదిరించాడు. కాని ఆయువతి ఏ మాత్రం బయపడలేదు. దాంతో వంశీ ఆ యువతితో సన్నిహితంగా ఉన్న ఫోటోలను పెళ్లి కొడుకు బంధువులకు పంపాడు. దాంతో ఈ పెళ్లి క్యాన్సిల్ అయ్యింది. దానితో ఊరుకోకుండా వంశీ తన స్నేహితులను సంప్రదించి వారిరువు క్లోజ్ గా ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో వైరల్ చేయమని చెప్పాడు. అతను చెప్పినట్టే వారు సోషల్ మీడియాలో పెట్టారు.

ఈ విషయం బయట అందరికీ తెలియడంతో ఆ యువతి తీవ్ర మనస్తాపానికి గురైంది. అక్కడ ఉండబట్టలేక ఆమె ఈ నెల 6న వాళ్ల పినతల్లి ఇంటికి బయలుదేరింది. అక్కడనుంచి ఈ నెల 10 న ఇంటికి వెళుతున్నానని చెప్పి బయల్దేరింది. కాని ఒక రోజు గడిచినా యువతి ఇంటికి రాకపోవడంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. అయితే మంగళవారం తమ వ్యవసాయ పొలంలో తమ కూతురు మృతదేహాన్ని చూసారు ఆ యువతి తల్లిదండ్రులు. అప్పటికే ఆమె శరీరం పూర్తిగా కుళ్లి పోయి కన్పించింది. దాంతో ఆమె 10 తేదీనే ఆత్మ హత్య చేసుకుందని నిర్దారించారు పోలీసులు. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు వంశీ, అతని స్నేహితులపై కేసు నమోదు చేసుకుని తగిన శిక్ష వేస్తామని హామీనిచ్చారు ఎస్సై ఏడుకొండలు.


'జెర్సీ' షూటింగ్ పూర్తి.. ఎమోషనల్ అయిన హీరో

రోజుకు 100మందికే కరోనా వ్యాక్సిన్?.. కేంద్రం ప్రకటన!

మైండ్ బ్లాక్ అయ్యే రెమ్యునరేషన్.. F3 కోసం అనీల్ రావిపుడికి అంత ఇస్తున్నారా..?

ఆ నెలలో సాగర్ ఉపఎన్నిక ఉంటుందట..

సీఎంల ఢిల్లీ పర్యటనపై రాజకీయాల్లో ఉత్కంఠ..!

ఇటు ఎస్ఈసీ...అటు సర్కార్ నడుమ స్థానిక సమరం

రైతుల ఉద్యమం వెనుక కీలక పాత్ర పోషిస్తున్న మహిళలు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - savitri shivaleela]]>