PoliticsSS Marvelseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kcrf1f4ad0e-f4b3-42e5-8416-6a86d088e057-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kcrf1f4ad0e-f4b3-42e5-8416-6a86d088e057-415x250-IndiaHerald.jpgతెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కి మంత్రి కొప్పుల ఈశ్వర్‌ సవాల్‌ విసిరారు. గతంలో ఆయన సీఎం కేసీఆర్‌ను జైలులో పెట్టాలని విమర్శలు చేశారు. ఈ క్రమంలో కేసీఆర్‌ను జైల్లో పెట్టేముందు కాళేశ్వరం ప్రాజెక్ట్‌ చూడాలని బండి సంజయ్‌కు మంత్రి కొప్పుల ఈశ్వర్ హితువు పలికారు. కేసీఆర్ గురించి మాట్లాడే ముందు నోరు అదుపులో పెట్టుకోవాల‌ని, కేసీఆర్‌పై బండి సంజయ్ విచక్షణ లేకుండా మాట్లాడుతున్నారని బాల్క సుమన్ ఆగ్రహం వ్యక్తం చేశారుbandi sanjay;kcr;suman;vedhika;bharatiya janata party;telangana rashtra samithi trs;balka suman;telangana;mp;court;prime minister;mla;minister;aqua;central government;eshwarకేసీఆర్ గురించి మాట్లాడే ముందు నోరు అదుపులో పెట్టుకో బండి సంజయ్!కేసీఆర్ గురించి మాట్లాడే ముందు నోరు అదుపులో పెట్టుకో బండి సంజయ్!bandi sanjay;kcr;suman;vedhika;bharatiya janata party;telangana rashtra samithi trs;balka suman;telangana;mp;court;prime minister;mla;minister;aqua;central government;eshwarTue, 15 Dec 2020 22:45:00 GMTతెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కి మంత్రి కొప్పుల ఈశ్వర్‌ సవాల్‌ విసిరారు. గతంలో ఆయన సీఎం కేసీఆర్‌ను జైలులో పెట్టాలని విమర్శలు చేశారు. ఈ క్రమంలో కేసీఆర్‌ను జైల్లో పెట్టేముందు కాళేశ్వరం ప్రాజెక్ట్‌ చూడాలని బండి సంజయ్‌కు మంత్రి కొప్పుల ఈశ్వర్ హితువు పలికారు. కేసీఆర్‌కు ఉన్నది 40 ఎకరాల ఫామ్‌ హౌజేనని చెప్పారు. బీజేపీ నాయకులు డ్రామాలను కట్టిపెట్టాలని సూచించారు. 40 ఎకరాల ఫామ్‌హౌజ్ కోసం ఎవరైనా కాళేశ్వరం ప్రాజెక్టు కడతారా అని ప్రశ్నించారు. నీటి పారుదల ప్రాజెక్టులు కట్టే దమ్ము లేదు కానీ అనవసర ఆరోపణలు చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు.


‘‘అవినీతి నిరూపించు.. కోర్టుకు వెళ్లు. నీళ్లిచ్చే తెలివి లేదు కానీ ఇస్తే ఓర్వలేకపోతున్నారు.’’ అని కొప్పుల సవాలు విసిరారు. ఆరోపణలు నిరూపించే సత్తా ఉండాలని బండి సంజయ్‌ను మంత్రి నిలదీశారు. మంగళవారం కొడిమ్యాల మండలం తీర్మాలపూర్ రైతు వేదిక భవనాన్ని ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలోని పథకాలు దేశంలో ఎక్కడా కనిపించవని.. కానీ మన రాష్ట్రంలో సంక్షేమ పథకాల విలువ ప్రజలకు తెలియడం లేదని మంత్రి కొప్పుల ఈశ్వర్‌ వ్యాఖ్యానించారు. రైతులంతా ఒక్క వేదిక దగ్గర చేరి తమ సమస్యలను చర్చించుకోవచ్చని పేర్కొన్నారు. అసంఘటితంగా ఉన్న రైతులందరినీ ఒకచోట చేర్చేలా సీఎం కేసీఆర్‌ రైతువేదికల నిర్మాణానికి రూపకల్పన చేశారని తెలిపారు.



ప్రధాని మోదీతో సీఎం కేసీఆర్ అధికారిక సమావేశాన్ని బండి సంజయ్ రాజకీయం చేయడాన్ని టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ తప్పుబట్టారు. కేసీఆర్ గురించి మాట్లాడే ముందు నోరు అదుపులో పెట్టుకోవాల‌ని బండిని హెచ్చరించారు. కేసీఆర్‌పై బండి సంజయ్ విచక్షణ లేకుండా మాట్లాడుతున్నారని బాల్క సుమన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘కేంద్ర రాష్ర్ట ప్రభుత్వాల మ‌ధ్య సంబంధాలు అనేకం ఉంటాయి. వాటిలో భాగంగానే సీఎం కేసీఆర్ ఢిల్లీకి వెళ్లారు. ఈ విష‌యం కూడా తెలియ‌ని ఎంపీ బండి సంజ‌య్. సోయి లేకుండా ఇష్టమొచ్చిన‌ట్లు మాట్లాడుతున్నాడు. ప్రజ‌ల‌కు కూడా వాస్తవాలు చెప్పాల్సిన అవ‌స‌రం ఉంది.’’ అని అన్నారు.


మళ్ళి చరిత్ర తిరగరాసే దమ్ము ఆ రెండు సినిమాలకే .... కానీ అవి వర్కౌట్ అవుతాయా అని .....??

పశ్చిమ బెంగాల్లో రసవత్తర రాజకీయం..!

కొవిడ్ వ్యాక్సిన్ ఎంట్రీకి కౌంట్ డౌన్..!

వ్యవసాయ చట్టాలపై.. రైతులతో మోదీ మాటామంతీ..

ఆ సూర్య గ్రహణాన్ని చూడాలంటే..!

బిగ్‌బాస్-4: గ్రాండ్ ఫినాలేలో హాట్ హీరోయిన్ల ఆటపాట?

లండన్‌లో కొత్త రకం కరోనా.. మామూలు కన్నా వేగంగా వ్యాప్తి!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SS Marvels]]>