MoviesSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/aki52006c70-ba50-4814-acb7-54608730aeaa-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/aki52006c70-ba50-4814-acb7-54608730aeaa-415x250-IndiaHerald.jpgబిగ్ బాస్ సీజన్ ఫోర్ లో గత మూడు సీజనలలో చూడని చిత్రాలు ఎన్నో చోటు చేసుకున్నాయి. గత సీజన్లలో కూడా స్నేహాలు బంధాలు ఎమోషన్స్ ఉన్నా కూడా చివరికి వస్తున్న కొద్దీ ఎవరి ఆట వారు ఆడారు. దాంతో గేం స్పిరిట్ కనిపించింది. అందరికీ గెలుపు అవకాశాలు ఉంటాయనిపించింది. కానీ ఈ సీజన్ లో మాత్రం టాప్ ఫైవ్ కి చేరినా గ్రూపులను వీడడంలేదు. అఖిల్, సోహేల్, హారిక ఒక గ్రూప్ గా ఉండడం ఆడియన్స్ గమనిస్తున్నారు. aki;nagarjuna akkineni;abhijith;akhil akkineni;bigboss;audience;winner;winner1;houseఫైనల్స్ వచ్చినా గ్రూపుగానే .. ఆ ఇద్దరి మధ్యనే పోటీ...?ఫైనల్స్ వచ్చినా గ్రూపుగానే .. ఆ ఇద్దరి మధ్యనే పోటీ...?aki;nagarjuna akkineni;abhijith;akhil akkineni;bigboss;audience;winner;winner1;houseTue, 15 Dec 2020 12:00:00 GMTబిగ్ బాస్ సీజన్ ఫోర్ లో గత మూడు సీజనలలో చూడని చిత్రాలు ఎన్నో చోటు చేసుకున్నాయి. గత సీజన్లలో కూడా  స్నేహాలు బంధాలు ఎమోషన్స్ ఉన్నా కూడా చివరికి వస్తున్న కొద్దీ ఎవరి ఆట వారు ఆడారు. దాంతో గేం స్పిరిట్ కనిపించింది. అందరికీ గెలుపు అవకాశాలు ఉంటాయనిపించింది. కానీ ఈ సీజన్ లో మాత్రం టాప్ ఫైవ్ కి చేరినా గ్రూపులను వీడడంలేదు. అఖిల్, సోహేల్, హారిక ఒక గ్రూప్ గా ఉండడం ఆడియన్స్ గమనిస్తున్నారు.

అలాగే ఆరియానాను వారు టార్గెట్ చేయడాన్ని కూడా దృష్టిలో ఉంచుకుంటున్నారు. ఇక కూల్ గా గేం ఆడుతున్న అభిజిత్ మీద కూడా సోహెల్ గేమ్స్ సరిగ్గా ఆడలేదంటూ కామెంట్స్ చేస్తూ టైటిల్ గెలిచేందుకు అనర్హుడు అన్నట్లుగా మాట్లాడాడు. కానీ బయట మాత్రం సీన్ వేరేగా ఉంది. అభిజిత్ ఆరియానా ఆట వ్యక్తిగతంగా ఉంది. వారు ప్రతీ టాస్క్ తన శక్తిమేరకు ఆడిన సంగతి గమనించే ఆడియన్స్ వారిని ఆ ప్లేస్ కి తెచ్చారన్నది మాత్రం మిగిలిన హౌస్ మేట్స్ ఇక్కడ  మరచిపోవడమే విశేషం.

ఇక తనను గేం సరిగ్గా ఆడలేదు అని సోహెల్ అన్నా కూడా తన ఎమోషన్స్ ని అణచుకుని కూల్ గా మేనేజ్ చేసిన అభిజిత్ కంటే టైటిల్ విన్నర్ ఎవరుంటారు అన్నది కూడా హౌస్ మేట్స్ గమనించలేకపోతున్నారు. అఖిల్ తాను సోలోగా ఆడానని ఫస్ట్ ఫైనలిస్ట్ ని తానేనని చెప్పుకున్నా సోహేల్ చేసిన త్యాగంతోనే అతను విన్ అయిన సంగతి అందరికీ తెలుసు. హోస్ట్ నాగార్జున కూడా సోహెల్ త్యాగం చేశాడని అఖిల్ ఎదుటే  చెప్పిన సంగతి  గుర్తుంది.

ఇక అఖిల్ టికెట్ టూ ఫినాలే విషయంలో సోహెల్ హెల్ప్ తీసుకునే చివరి రౌండ్ వరకూ వచ్చిన సంగతి కూడా  ఆడియన్స్ కి గుర్తుంది. అందువల్ల అతను టైటిల్ విన్నర్ తానేనని ఎంత నమ్మకంగా ఉన్నా ఇవి మైనస్ గానే ఉంటాయని అంటున్నారు. ఇక సోహేల్ తాను కోపంతో సీజన్ చివరి దాకా  ఉన్నానని అంగీకరించాక టైటిల్ విన్నర్ గా ఎలా అర్హుడవుతాడో కూడా ఆలోచించాల్సిందే అని అంటున్నారు. హారిక‌ మొదట అంతా అభిజిత్ తో కలసి తన ఓట్లు పెంచుకుందని ఇపుడు ప్లేట్ ఫిరాయించి అఖిల్ సోహెల్ తో కలసిందని కూడా ఆడియన్స్ లో అభిప్రాయం ఉంది.

మొత్తానికి చూస్తే బోల్డ్ పాప్ ఆరియానా సోలోగా ఆడుతూ ఇంతదాక రావడం ఆడియన్స్ సింపతీనే కాదు, మార్కులను కూడా సంపాదించింది అని అంటున్నారు. అలాగే అభిజిత్ కూడా తన కూల్ మేనేజ్మెంట్ తో హౌస్ లో సెంటర్ అట్రాక్షన్ అయ్యాడని అంటున్నారు. ఈ ఇద్దరిలోనే విన్నర్, రన్నర్ ఉంటారని మాత్రం అంతా చెప్పేస్తున్నారు.




ప్రపంచంలోనే అతి పెద్ద ద్విచక్ర వాహన ఫ్యాక్టరీ ఇదే.. కానీ..!!

సోష‌ల్ మీడియాకు కేసీఆర్ అడ్డంగా దొరికారే.. కొంచెం వెయిట్ చేస్తే బాగుండేది...!

బిగ్‌బాస్-4 విన్నర్ ఆ కంటెస్టెంటేనా..?

వారికి ఉచితంగా వ్యాక్సిన్.. మోడీ మనసులో ఏముంది..?

ఇదేం పొత్తు ' బాసూ ' ? బీజేపి పై జన సైనికులు ఫైర్ ?

రాజకీయాలకు గంటా గుడ్ బై...?

చైనాకు మరో భారీ షాకిచ్చిన భారత ప్రభుత్వం




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>