PoliticsPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/is-high-court-shocks-yellow-batch-on-three-capitals-and-guest-house-construction-cases0e05f3b7-f693-48ce-b0b1-4daab2afcf86-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/is-high-court-shocks-yellow-batch-on-three-capitals-and-guest-house-construction-cases0e05f3b7-f693-48ce-b0b1-4daab2afcf86-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.. న్యాయ వ్యవస్థ పై సోషల్ మీడియా లో అసభ్య కరమైన పోస్టులు పెట్టడం జరిగింది.. ఈ నేపథ్యంలో ఆంద్రప్రదేశ్ హైకోర్టులో సోషల్ మీడియాలో జడ్జిలు, న్యాయ వ్యవస్థపై అభ్యంతరకర పోస్టింగ్‌లు, వ్యాఖ్యలు చేసిన కేసు విచారణ జరిగింది. ఈ కేసు దర్యాప్తును నాలుగు నెలల్లో పూర్తి చేస్తామని హైకోర్టుకు సెంట్రల్ బ్యూరో అఫ్ ఇన్వెస్టిగేషన్ తెలిపింది. ఆ వివరాలను పరిగణనలోకి తీసుకున్న జస్టిస్‌ రాకేశ్‌కుమార్‌, జస్టిస్‌ జె.ఉమాదేవితో కూడిన ధర్మాసనం దర్యాప్తుపై తదుపరి స్థాయి నివేదికను ap-high court;india;andhra pradesh;high court;media;court;cbi;letter;international;marchజడ్జిలపై చేసిన అభ్యంతర పోస్టుల గురించి విచారణ చేసేందుకు సిబిఐ కి డెడ్ లైన్ ఇచ్చిన ఏపీ హైకోర్టు....జడ్జిలపై చేసిన అభ్యంతర పోస్టుల గురించి విచారణ చేసేందుకు సిబిఐ కి డెడ్ లైన్ ఇచ్చిన ఏపీ హైకోర్టు....ap-high court;india;andhra pradesh;high court;media;court;cbi;letter;international;marchTue, 15 Dec 2020 15:15:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.. న్యాయ వ్యవస్థ పై సోషల్ మీడియా లో అసభ్య కరమైన పోస్టులు పెట్టడం జరిగింది.. ఈ నేపథ్యంలో ఆంద్రప్రదేశ్   హైకోర్టులో సోషల్ మీడియాలో జడ్జిలు, న్యాయ వ్యవస్థపై అభ్యంతరకర పోస్టింగ్‌లు, వ్యాఖ్యలు చేసిన కేసు విచారణ జరిగింది. ఈ కేసు దర్యాప్తును నాలుగు నెలల్లో పూర్తి చేస్తామని హైకోర్టుకు సెంట్రల్ బ్యూరో అఫ్ ఇన్వెస్టిగేషన్  తెలిపింది. ఆ వివరాలను పరిగణనలోకి తీసుకున్న జస్టిస్‌ రాకేశ్‌కుమార్‌, జస్టిస్‌ జె.ఉమాదేవితో కూడిన ధర్మాసనం దర్యాప్తుపై తదుపరి స్థాయి నివేదికను మార్చి 30 లోపల  కోర్టుకు సమర్పించాలని కోరుతూ విచారణను మార్చి 31కి వాయిదా వేయడం జరిగింది.

హైకోర్టు జడ్జీలు, న్యాయవ్యవస్థ ప్రతిష్ఠను దిగజార్చేలా, న్యాయమూర్తులపై అభ్యంతరకరంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.. కొందరు కామెంట్స్  చేశారు. ఈ వ్యవహారంలో పలువురిపై సీఐడీకి ఫిర్యాదు చేసినా చర్యలు లేవని హైకోర్టు అప్పటి ఇంఛార్జి రిజిస్ట్రార్‌ జనరల్‌ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది.దీనిపై  విచారణ జరిపిన ధర్మాసనం గత అక్టోబర్‌ 12న దర్యాప్తును సీబీఐకి అప్పగించింది.

ఈ పిటిషన్‌పై విచారణలో సీబీఐ పీపీ చెన్నకేశవులు వాదనలు వినిపించారు. కోర్టుకు మొదటి స్థాయి నివేదికను సీబీఐ సమర్పించిందని.. న్యాయవ్యవస్థపై పోస్టులు  పెట్టిన వారు వివిధ దేశాల్లో ఉన్నారని తెలిపారు. అంతర్జాతీయ సర్వీస్ ప్రొవైడర్ల నుంచి సమాచారం సేకరిస్తున్నామని.. వివిధ సామాజిక మాధ్యమ సంస్థలకు నోటీసులు ఇచ్చామని కోర్టుకు వివరించారు.

విదేశాల్లో ఉన్న నలుగురు నిందితుల్ని గుర్తించామని.. ఇంకా మరో ముగ్గురి వివరాలు తెలియాల్సి ఉందన్నారు. దర్యాప్తు పూర్తి చేయడానికి నాలుగు నెలల సమయం కావాలని కోరారు...అందుకు  ధర్మాసనం మార్చి 31కి విచారణను వాయిదా వేసింది.ఇక ఇలాంటి మరెన్నో అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరిన్నో విషయాలు గురించి తెలుసుకోండి...





నయీం కు టెర్రరిస్ట్ లతో సంబంధాలు ?

పసుపు పాలతో మెమరీ పెరుగుతుందా...?

అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి ఫాలోయింగ్ మాములుగా లేదుగా...!

ఫైనల్స్ వచ్చినా గ్రూపుగానే .. ఆ ఇద్దరి మధ్యనే పోటీ...?

సోష‌ల్ మీడియాకు కేసీఆర్ అడ్డంగా దొరికారే.. కొంచెం వెయిట్ చేస్తే బాగుండేది...!

బిగ్‌బాస్-4 విన్నర్ ఆ కంటెస్టెంటేనా..?

వారికి ఉచితంగా వ్యాక్సిన్.. మోడీ మనసులో ఏముంది..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>