MoviesP Subhadra devieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/chiranjeevi9684ac7a-79c7-4227-a9e7-fe15ec1fae57-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/chiranjeevi9684ac7a-79c7-4227-a9e7-fe15ec1fae57-415x250-IndiaHerald.jpg'ఆచార్య'... మెగా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తోన్న మెగా ప్రాజెక్టు. సెకండ్ ఇన్నింగ్స్ లో వైవిధ్యభరితమైన కథలను ఎంచుకుంటున్న చిరుని తెరపై వెంటనే చూడాలని అభిమానులలో ఆరాటం నెలకొంది. ఎంటర్టైన్మెంట్ తో పాటు సందేశాన్ని కలిపే డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తమ అభిమాన హీరో చిరంజీవిని చూడాలని అభిమానులు తెగ ఆత్రుత పడుతున్నారు. ఇందులో రాంచరణ్ పోషించే పాత్ర ఎలా ఉంటుందో, ఆ పాత్ర ఏమిటో తెలుసుకోవాలని ప్రేక్షకులు కుతూహలంతో ఉన్నారు. అందుకే ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్chiranjeevi;chiranjeevi;kumaar;shiva;allu arjun;arya;kajal aggarwal;koratala siva;sukumar;ram madhav;cinema;blockbuster hit;director;lord siva;hero;khaidi.;letter;heroine;success;arjun 1;research and analysis wing;khaidi new;gangothri;aryaa;lover'ఆర్య'ని ఫాలో అవుతోన్న 'ఆచార్య'?'ఆర్య'ని ఫాలో అవుతోన్న 'ఆచార్య'?chiranjeevi;chiranjeevi;kumaar;shiva;allu arjun;arya;kajal aggarwal;koratala siva;sukumar;ram madhav;cinema;blockbuster hit;director;lord siva;hero;khaidi.;letter;heroine;success;arjun 1;research and analysis wing;khaidi new;gangothri;aryaa;loverTue, 15 Dec 2020 12:00:00 GMT'ఆచార్య'... మెగా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తోన్న మెగా ప్రాజెక్టు. సెకండ్ ఇన్నింగ్స్ లో వైవిధ్యభరితమైన కథలను ఎంచుకుంటున్న చిరుని తెరపై వెంటనే చూడాలని అభిమానులలో ఆరాటం నెలకొంది. ఎంటర్టైన్మెంట్ తో పాటు సందేశాన్ని కలిపే డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తమ అభిమాన హీరో చిరంజీవిని చూడాలని అభిమానులు తెగ ఆత్రుత పడుతున్నారు. ఇందులో రాంచరణ్ పోషించే పాత్ర ఎలా ఉంటుందో, ఆ పాత్ర ఏమిటో తెలుసుకోవాలని ప్రేక్షకులు కుతూహలంతో ఉన్నారు. అందుకే ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ కి సంబంధించిన ఒక న్యూస్ ఇండస్ట్రీలో హల్చల్ చేస్తోంది.



అదేమిటంటే... ఈ సినిమా మే7న రిలీజ్ కానుందట. ఇప్పుడు ఈ రిలీజ్ డేట్ అనేది మెగా అభిమానుల్లో చర్చనీయాంశం అయింది. ఎందుకంటే సరిగ్గా ఈ తారీఖున పదిహేడు సంవత్సరాల క్రితం అల్లు అర్జున్ నటించిన 'ఆర్య' సినిమా రిలీజ్ అయింది. బన్నీ కెరీర్ లో ఈ సినిమాబ్లాక్ బస్టర్ గా నిలిచి ఆయనకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. ఈ సినిమా తరువాతే మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన బన్నీ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది సక్సెస్ ఫుల్ హీరోలలో ఒకరిగా పేరు సంపాదించాడు.



బన్నీ కెరీర్ ని మలుపు తిప్పిన మే 7వ తారీఖునాడే మెగాస్టార్ చిరంజీవి 'ఆచార్య' రిలీజ్ కాబోతోందని ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. దాంతో, రాబోయే 'ఆచార్య' సినిమా రిజల్ట్ ని అప్పటి 'ఆర్య' సినిమా రిజల్ట్ తో అప్పుడే పోల్చడం మొదలుపెట్టేసారు మెగా అభిమానులు. మొదటి సినిమా 'గంగోత్రి' తరువాత బన్నీ నటించిన సినిమా 'ఆర్య'. సుకుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ మూవీలో బన్నీ వన్ సైడ్ లవర్ గా నటించి మెప్పించాడు. 



చిరంజీవికి సెకండ్ ఇన్నింగ్స్ ప్రకారం 'ఆచార్య' అనేది మూడవ సినిమా. 'ఖైదీ నెంబర్ 150'లో ఆయనతో ఆడిపాడిన కాజల్ అగర్వాలే ఇందులో కూడా హీరోయిన్ గా నటిస్తోంది. సో, మొత్తానికి 'ఆచార్య' సినిమా రిలీజ్ డేట్ ప్రకారం కూడా అభిమానుల్లో మంచి క్రేజ్ సంపాదించుకొంది అన్న మాట. మరి, 'ఆర్య' సినిమా ఎలాగైతే బన్నీ కెరీర్ లో టర్నింగ్ పాయింట్ గా నిలిచిందో... 'ఆచార్య' సినిమా చిరంజీవి కెరీర్ లో అలా నిలుస్తుందో లేదో చూడాలని ప్రేక్షకులు భావిస్తున్నారు. మొత్తానికి ఈ సినిమా రిలీజ్ కోసం అభిమానుల ఎదురుచూపులు మొదలయ్యాయి. 




ప్రపంచంలోనే అతి పెద్ద ద్విచక్ర వాహన ఫ్యాక్టరీ ఇదే.. కానీ..!!

ఫైనల్స్ వచ్చినా గ్రూపుగానే .. ఆ ఇద్దరి మధ్యనే పోటీ...?

సోష‌ల్ మీడియాకు కేసీఆర్ అడ్డంగా దొరికారే.. కొంచెం వెయిట్ చేస్తే బాగుండేది...!

బిగ్‌బాస్-4 విన్నర్ ఆ కంటెస్టెంటేనా..?

వారికి ఉచితంగా వ్యాక్సిన్.. మోడీ మనసులో ఏముంది..?

ఇదేం పొత్తు ' బాసూ ' ? బీజేపి పై జన సైనికులు ఫైర్ ?

రాజకీయాలకు గంటా గుడ్ బై...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P Subhadra devi]]>