PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/bandisanjayea2ec7b8-2802-43ca-a3f1-1e0be6461689-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/bandisanjayea2ec7b8-2802-43ca-a3f1-1e0be6461689-415x250-IndiaHerald.jpgసిఎం కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా రాష్ట్ర క్రయ విక్రయాల దస్తావేజులు, రిజిస్ట్రేషన్లు పారదర్శకంగా, సులువుగా అవినీతికి తావు లేకుండా ఎటువంటి మానవ జోక్యత లేకుండా, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగానికి ఊతమిచ్చే విధంగా ధరణి పోర్టల్ ను రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభించారని రోడ్లు మరియు భవనాల శాఖామాత్యులు, క్యాబినెట్ సబ్ కమిటీ చైర్మన్ వేముల ప్రశాంత్ రెడ్డి వెల్లడించారు. వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ పై మంత్రి వర్గ ఉపసంఘం సమావేశం అనంతరం మంత్రులు మీడియాతో మాట్లాడారు. 100 రోజుల విరామం అనంతరం ప్రభుత్వ ప్రధాన కార్kcr;kcr;kumaar;dharani;prasanth;hyderabad;vemula prashanth reddy;chief minister;cabinet;minister;good news;reddy;good newwz;prashant kishor;mantraరియల్ రంగానికి తెలంగాణా గుడ్ న్యూస్రియల్ రంగానికి తెలంగాణా గుడ్ న్యూస్kcr;kcr;kumaar;dharani;prasanth;hyderabad;vemula prashanth reddy;chief minister;cabinet;minister;good news;reddy;good newwz;prashant kishor;mantraTue, 15 Dec 2020 18:05:19 GMTకేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా రాష్ట్ర క్రయ విక్రయాల దస్తావేజులు, రిజిస్ట్రేషన్లు పారదర్శకంగా, సులువుగా అవినీతికి తావు లేకుండా ఎటువంటి మానవ జోక్యత లేకుండా, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగానికి ఊతమిచ్చే విధంగా ధరణి పోర్టల్ ను రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభించారని రోడ్లు మరియు భవనాల శాఖామాత్యులు, క్యాబినెట్ సబ్ కమిటీ చైర్మన్ వేముల ప్రశాంత్ రెడ్డి వెల్లడించారు. వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ పై మంత్రి వర్గ ఉపసంఘం సమావేశం అనంతరం మంత్రులు మీడియాతో మాట్లాడారు.

100 రోజుల విరామం అనంతరం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, అధికారుల బృందం అవిశ్రాంతంగా శ్రమించి  మంచి పోర్టల్ ను ప్రారంభించారని నిన్నటి నుంచే రిజిస్ట్రేషన్ ల ప్రక్రియ ప్రారంభమయ్యిందని అన్నారు. మొదట కొన్ని చిన్న చిన్న సమస్యలు వస్తాయని త్వరలోనే వీటి అన్నింటిని అధిగమించి ముందుకు వెళ్తామని అన్నారు. ప్రజలకు రియల్ ఎస్టేట్ వారికి రిజిస్ట్రేషన్ ప్రక్రియపై ఉన్న అపోహలు తొలగించి, అవగాహన కల్పిస్తామని ప్రజలకు అత్యంతవేగంగా, సులువుగా రిజిస్ట్రేషన్లు అయ్యేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

అన్ని వర్గాల వారి నుండి వచ్చిన సలహాలు, సూచనల ఆధారంగా ప్రజలకు సౌకర్యవంతంగా రిజిస్ట్రేషన్ లు జరగాలని సిఎం కేసీఆర్ క్యాబినెట్ సబ్ కమిటీని నియమించారని, సబ్ కమిటీ ఈ రోజు ఉదయం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, అధికారులతో సమావేశమై ప్రజలు, బ్యాంకర్లు, కొనుగోలు దారులు, అమ్మకం దారులు, వివిధ వర్గాల నుండి వచ్చిన సూచనలు, సలహాలను క్రోడీకరించి సమర్పించామని పేర్కొన్నారు. ఆగిన రిజిస్ట్రేషన్ ల బ్యాక్ లాగ్ లను పూర్తి చేయడానికి పని ఆధారంగా ఎక్కువ రిజిస్ట్రేషన్లు జరిగే కార్యాలయాలలో అదనపు ఉద్యోగులను నియమించి 3 నెలలలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. సేల్ డీడ్ లపై ఉన్న అపోహలను తొలగిస్తామన్నారు. కొనుగోలు దారులు, అమ్మకం దారులు తమకు సంబంధించిన స్వంత డాక్యుమెంట్లను రిజిస్ట్రేషన్ లో  డాక్యుమెంటేషన్ చేసుకోవచ్చు అని చెప్పారు.


స్పొర్ట్స్ : ధోని అప్పుడు కోహ్లీ ని కాపాడకపోతే ఏమైఉండేదో..!!

తేనెతో ఆశ్చర్యపరిచే స్కిన్ కేర్ బెనిఫిట్స్...!

నాకన్నా పెద్ద వాడు ఉన్నాడు లాక్ డౌన్ లో ప్రశాంతంగా ఉన్నా.. పెళ్లి గురించి మెగా మేనల్లుడు షాకింగ్ కామెంట్స్..!

గొడవ చాలా చిన్నది: వైసీపీ ఎంపీ

మళ్ళీ మహేష్ తో శృతి?

ఎడిటోరియల్ : పవన్ ను వాడుకుంటూ ఆడుకుంటున్నారా ?

పసుపు పాలతో మెమరీ పెరుగుతుందా...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>