PoliticsGiddaluri Srinivasa Raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/rajinikanth-follows-pawan-kalyan-footsteps16c8eb45-67c5-427e-8e2c-dac83265eb54-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/rajinikanth-follows-pawan-kalyan-footsteps16c8eb45-67c5-427e-8e2c-dac83265eb54-415x250-IndiaHerald.jpgసూపర్ స్టార్ రజినీకాంత్, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ని ఫాలో అవుతున్నారు. పాలిటిక్స్ లో రజినీకంటే పవన్ కల్యాణే సీనియర్ కాబట్టి.. ఆయనకు ఫాలో అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. పార్టీ పెట్టడం, ప్రచారం చేయడం.. ఇలాంటి విషయాల్లో పోలికలు లేవు కానీ.. బీజేపీతో దోస్తీ విషయంలో మాత్రం ఇద్దరి మధ్యా పోలిక ఉన్నట్టు తెలుస్తోంది. జనసేన పెట్టిన తర్వాత తొలిసారిగా పవన్ కల్యాణ్ ఒంటరిగా పోటీ చేయలేదు. బీజేపీ, టీడీపీతో కలసి పోటీ చేశారు. ఇప్పుడు కూడా పవన్ బీజేపీతో సయోధ్యలోనే ఉన్నారు. rajini pavan;pawan;rajinikanth;pawan kalyan;tara;bharatiya janata party;narendra modi;janasena;rajani kanth;january;media;prime minister;december;assembly;janasena party;partyపవన్ కల్యాణ్ బాటలో రజినీకాంత్..పవన్ కల్యాణ్ బాటలో రజినీకాంత్..rajini pavan;pawan;rajinikanth;pawan kalyan;tara;bharatiya janata party;narendra modi;janasena;rajani kanth;january;media;prime minister;december;assembly;janasena party;partyTue, 15 Dec 2020 12:00:00 GMTసూపర్ స్టార్ రజినీకాంత్, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ని ఫాలో అవుతున్నారు. పాలిటిక్స్ లో రజినీకంటే పవన్ కల్యాణే సీనియర్ కాబట్టి.. ఆయనకు ఫాలో అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. పార్టీ పెట్టడం, ప్రచారం చేయడం.. ఇలాంటి విషయాల్లో పోలికలు లేవు కానీ..  బీజేపీతో దోస్తీ విషయంలో మాత్రం ఇద్దరి మధ్యా పోలిక ఉన్నట్టు తెలుస్తోంది. జనసేన పెట్టిన తర్వాత తొలిసారిగా పవన్ కల్యాణ్ ఒంటరిగా పోటీ చేయలేదు. బీజేపీ, టీడీపీతో కలసి పోటీ చేశారు. ఇప్పుడు కూడా పవన్ బీజేపీతో సయోధ్యలోనే ఉన్నారు.

ప్రస్తుతం రజినీకాంత్ కూడా పార్టీ పెట్టబోతున్నారు. డిసెంబర్ 31న ప్రకటన చేసి, జనవరి 1నుంచి కార్యకలాపాలు మొదలు పెట్టబోతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన పార్టీ పెట్టిన ఏడాదిలోనే అసెంబ్లీ ఎన్నికలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆ దశలో రజినీ, పవన్ ని ఫాలో అవుతారని తెలుస్తోంది. తొలి ఎన్నికల్లో రజినీ ఒంటరిగా పోటీ చేసే అవకాశం దాదాపు కనిపించడంలేదు.
ఎందుకంటే రజినీ ముందు ఒంటరిగా పోటీ చేసేంత టైమ్ లేదు. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసుకోవడంతో పాటు అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపిక కష్టంగా మారుతుంది. ప్రచారంలో భాగంగా అన్ని నియోజకవర్గాల్లో రజనీకాంత్ తిరిగే పరిస్థితి కూడా లేదు. దీనికి తోడు ఒంటరిగా పోటీ చేస్తే విజయావకాశాలు తక్కువగా ఉంటాయి. ఇలా పార్టీ స్థాపించి అలా అధికారం దక్కించుకునే రోజులు ఇప్పుడు లేవని విశ్లేషకులు చెబుతున్నారు. సింగిల్ గా వస్తే పార్టీకి ఫండింగ్ ఉండదు. ఆర్థికంగా పరిపుష్టిగా ఉండే వాళ్లని ఎన్నుకుంటే అభిమానులు హర్ట్ అవుతారు. అందుకే రజినీకాంత్ సింగిల్ గా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్ని ఎదుర్కొనే విషయంలో ఆలోచనలో పడ్డారని అంటున్నారు.

దీంతో ఆయన అనివార్యంగా రజినీ ఎవరో ఒకరి సపోర్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆధ్యాత్మిక రాజకీయాలు చేస్తానంటున్నారు కాబట్టి.. పనిలో పనిగా తన భావాలతో సరిపోయే బీజేపీ మద్దతు తీసుకుంటే ఎలా ఉంటుందనే ఆలోచన కూడా చేస్తున్నారట. ఇటీవల రజినీకాంత్ పుట్టినరోజు సందర్భంగా ప్రధాని మోదీ  సోషల్ మీడియా వేదికగా విష్ చేశారు. దీంతో రజినీ బీజేపీకి దగ్గరవుతున్నారనే సంకేతాలు వెలువడుతున్నాయి. బీజేపీతో పొత్తు పెట్టుకునే విషయంలో రజినీ, పవన్ కల్యాణ్ ని ఫాలో అవుతారని అర్థమవుతోంది.


ప్రపంచంలోనే అతి పెద్ద ద్విచక్ర వాహన ఫ్యాక్టరీ ఇదే.. కానీ..!!

ఫైనల్స్ వచ్చినా గ్రూపుగానే .. ఆ ఇద్దరి మధ్యనే పోటీ...?

సోష‌ల్ మీడియాకు కేసీఆర్ అడ్డంగా దొరికారే.. కొంచెం వెయిట్ చేస్తే బాగుండేది...!

బిగ్‌బాస్-4 విన్నర్ ఆ కంటెస్టెంటేనా..?

వారికి ఉచితంగా వ్యాక్సిన్.. మోడీ మనసులో ఏముంది..?

ఇదేం పొత్తు ' బాసూ ' ? బీజేపి పై జన సైనికులు ఫైర్ ?

రాజకీయాలకు గంటా గుడ్ బై...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Giddaluri Srinivasa Rao]]>