PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/ganta-srinivas-raoa0bbb8ca-c4c7-4c18-a397-e8e1a3ca58ce-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/ganta-srinivas-raoa0bbb8ca-c4c7-4c18-a397-e8e1a3ca58ce-415x250-IndiaHerald.jpgటీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు... గంటా శ్రీనివాసరావు విషయంలో గత కొంతకాలంగా అనుసరిస్తున్న శైలి ఆశ్చర్యంగా ఉంది. ఆయన విషయంలో అసలు చంద్రబాబు ఆలోచన ఎలా ఉంది ఏంటి అనేది అందరూ కూడా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న పరిస్థితి. గంటా శ్రీనివాసరావు పార్టీ లో ఉంటారా లేదా అనేది అసలు ఎవరికీ స్పష్టత రావడం లేదు. అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని పెద్దగా ఇబ్బంది పెట్టే విధంగా వ్యాఖ్యలు చేయడం లేదు. ఇక మూడు రాజధానులు అంశానికి సంబంధించి కూడా ఆయన పెద్దగా మాట్లాడటం లేదు. ఇక విశాఖ జిల్లాలో భూ అక్రమాలు ఎకganta srinnivas rao;manu;andhra pradesh;janasena;telugu;vishakapatnam;assembly;tdp;janasena party;partyరాజకీయాలకు గంటా గుడ్ బై...?రాజకీయాలకు గంటా గుడ్ బై...?ganta srinnivas rao;manu;andhra pradesh;janasena;telugu;vishakapatnam;assembly;tdp;janasena party;partyTue, 15 Dec 2020 08:46:55 GMTటీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు... గంటా శ్రీనివాసరావు విషయంలో గత కొంతకాలంగా అనుసరిస్తున్న శైలి ఆశ్చర్యంగా ఉంది. ఆయన విషయంలో అసలు చంద్రబాబు ఆలోచన ఎలా ఉంది ఏంటి అనేది అందరూ కూడా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న పరిస్థితి. గంటా శ్రీనివాసరావు పార్టీ లో ఉంటారా లేదా అనేది అసలు ఎవరికీ స్పష్టత రావడం లేదు. అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని పెద్దగా ఇబ్బంది పెట్టే విధంగా వ్యాఖ్యలు చేయడం లేదు. ఇక మూడు రాజధానులు అంశానికి సంబంధించి కూడా ఆయన పెద్దగా మాట్లాడటం లేదు.

ఇక విశాఖ జిల్లాలో భూ అక్రమాలు ఎక్కువగా జరుగుతున్నాయని ఆరోపణలు ఎక్కువగా ఉన్నాయి. అయినా సరే వాటి విషయంలో ఏ మాట మాట్లాడటం లేదు అని చెప్పాలి. రాజకీయంగా ఈ పరిస్థితులు కాస్త భిన్నంగా ఉన్నాయి అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. గంటా శ్రీనివాసరావు ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఉంటారా లేదా ఏంటి అన్నది ఎవరికీ అర్థం కావడం లేదు. అయితే ఇప్పుడున్న పరిస్థితి ఆధారంగా చూస్తే గంటా శ్రీనివాసరావు రాజకీయాల నుంచి తప్పుకునే ఆలోచనలో ఉన్నారని ఆయన ఏ పార్టీలోకి వెళ్లాలో అర్థంకాని పరిస్థితిలో ఉన్నారని ఏ పార్టీలో కి వెళ్ళినా సరే తనకు మరో పార్టీ నుంచి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది అని ఆలోచన గంటా శ్రీనివాసరావు వ్యక్తం చేస్తున్నారని అంటున్నారు.

వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తు ఉంటుందా లేదా అనేది చెప్పటం ఇప్పుడు కష్టంగానే ఉంది. వైసీపీలోకి వెళ్లిన దాదాపు అదే పరిస్థితి ఉంది. భారతీయ జనతా పార్టీలోకి వెళ్తే అసలు ఆ పార్టీ ఏపీలో మనుగడ సాగిస్తున్నదా లేదా అనేది చెప్పలేని పరిస్థితిలో ఉంది. జనసేన పార్టీ పరిస్థితి సంగతి కూడా తెలిసింది. ఈ పరిస్థితులను అంచనా వేసిన ఆయన త్వరలోనే రాజకీయాల నుంచి తప్పుకుని వ్యాపారాలు చేసుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.


ఆసీస్ కి పెద్ద షాక్.. ఆ ఫాస్ట్ బౌలర్ మ్యాచ్ నుంచి ఔట్...

ఇదేం పొత్తు ' బాసూ ' ? బీజేపి పై జన సైనికులు ఫైర్ ?

చైనాకు మరో భారీ షాకిచ్చిన భారత ప్రభుత్వం

బుల్లిపిట్ట: ఏ బ్రౌజర్ వాడినా ప్రమాదమే?.. కొత్త మాల్‌వేర్ అటాక్!

మహేష్ సెంటిమెంటు.. అభిమానులకు నిరుత్సాహం?

టేక్‌ఆఫ్‌కు సిద్దంగా విమానం.. ఇంతలో ఓ వ్యక్తి రన్‌పైకి వచ్చి..

రేటు పెంచిన ఓటీటీ హీరో.. పారితోషికం డబుల్!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>