PoliticsP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan0e4274f9-f7fd-43d2-944c-1177935e4a7f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan0e4274f9-f7fd-43d2-944c-1177935e4a7f-415x250-IndiaHerald.jpgరాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ ఢిల్లీ పర్యటన కి వెళ్ళింది చాలా తక్కువే అని చెప్పాలి.. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఢిల్లీ వెళ్లి అక్కడి నేతలని కలిసిన జగన్ ఇప్పటివరకు సానుకూలంగా ఏమీ సాధించలేదు.. ప్రజలు కోరుకున్నట్లు స్పెషల్ స్టేటస్ ఊసే ఎత్తడం లేదు, పోలవరం విషయం ఇంకా అలానే ఉంది.. ఈ నేపథ్యంలో కేంద్రం పై ఒత్తిడి చేసి అయినా సరే రాష్ట్రానికి కావాల్సింది సాధించుకోవాలని ఓ వైపు ప్రజలు కూడా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో జగన్ ఢిల్లీ పర్యటన ఇప్పుడు ఆసక్తికరంగా ఉంది.. jagan;modi;amit shah;amala akkineni;tara;delhi;jagan;amith shah;chief minister;minister;polavaram project;central governmentహస్తిన లో జగన్ ఇవి సాధించేనా..?హస్తిన లో జగన్ ఇవి సాధించేనా..?jagan;modi;amit shah;amala akkineni;tara;delhi;jagan;amith shah;chief minister;minister;polavaram project;central governmentTue, 15 Dec 2020 20:00:00 GMTజగన్ ఢిల్లీ పర్యటన కి వెళ్ళింది చాలా తక్కువే అని చెప్పాలి.. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఢిల్లీ వెళ్లి అక్కడి నేతలని కలిసిన జగన్ ఇప్పటివరకు సానుకూలంగా ఏమీ సాధించలేదు.. ప్రజలు కోరుకున్నట్లు స్పెషల్ స్టేటస్ ఊసే ఎత్తడం లేదు, పోలవరం విషయం ఇంకా అలానే ఉంది.. ఈ నేపథ్యంలో కేంద్రం పై ఒత్తిడి చేసి అయినా సరే రాష్ట్రానికి కావాల్సింది సాధించుకోవాలని ఓ వైపు ప్రజలు కూడా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు.  ఈ నేపథ్యంలో జగన్ ఢిల్లీ పర్యటన ఇప్పుడు ఆసక్తికరంగా ఉంది..

ఇటీవలే వ్యవసాయ బిల్లు ప్రవేశ పెట్టబోతున్న సమయంలో ఢిల్లీ కి వెళ్ళిన జగన్ మళ్ళీ ఇన్ని రోజులకు హస్తిన కు పయనమయ్యారు..ఇక్కడ కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో సీఎం భేటీ అవుతారు.ఆ తర్వాత మరింత మంది నేతలు, అధికారులను కలిసే అవకాశం ఉందని సమాచారం. ఇటీవలే తెలంగాణా ముఖ్యమంత్రి ఢిల్లీ లో మోడీ తో సహా, పలువురి నేతలని కలిసారు.. ఈ నేపథ్యంలో ఆ వెంటనే జగన్ ఢిల్లీ కి వెళ్ళడం ఇప్పుడు చర్చనీయంశామైంది.. ఏపీకి సంబంధించిన కీలకాంశాలను సీఎం జగన్ ప్రస్తావించబోతున్నారు అని తెలుస్తుంది.

పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఆమోదించిన లెక్కలకు కేంద్రం నుంచి అంగీకారం లభించాల్సి ఉంది. అదే సమయంలో పాలనా వికేంద్రీకరణ చట్టం అమలులో అడ్డుపుల్లల విషయంపై సీఎం ప్రస్తావించే అవకాశం ఉంది. రాష్ట్రంలో ప్రతీ అంశంలోనూ న్యాయస్థానాల ద్వారా ప్రతిపక్షాలు సృష్టిస్తున్న ఆటంకాలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి ఇప్పటికే జగన్ తీసుకెళ్లారు. వాటిలో నేటికీ కొన్ని అంశాలలో కోర్టు తీరు పూర్తిగా మారినట్టు కనిపించడం లేదని భావిస్తున్నారు. అదే సమయంలో సీఎం జగన్ గతంలోనే సుప్రీంకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి స్థానానికి ఆశావాహుల జాబితాలో ముందున్న ఎన్ వీ రమణపై నేరుగా సీజేకి ఫిర్యాదు చేశారు. జగన్ లేఖలను కోర్టు ధిక్కారణ గా పరిగణించాలని పలువురు కోరినప్పటికీ అటార్నీ జనరల్ ససేమీరా అన్నారు. అయితే సేజే మాత్రం సరైన సమయంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందనే ప్రచారం సాగింది. దాంతో ఈ అంశం కూడా ప్రస్తావనకు వచ్చే వాటిలో ఉంటుందనే అభిప్రాయం ఉంది.


ఎన్టీయార్ కోరిక అలా తీర్చిన బాపు ?

లండన్‌లో కొత్త రకం కరోనా.. మామూలు కన్నా వేగంగా వ్యాప్తి!

రానా కూడా జై కొట్టేశాడుగా...?

8 ఎపిసోడ్స్.. కోటి రెమ్యూనరేషన్.. సమంత నువ్వు సూపరంతే..!

భయపడడం భారత్ రక్తంలో లేదు..ముకేశ్ అంభాని !!

స్పొర్ట్స్ : ధోని అప్పుడు కోహ్లీ ని కాపాడకపోతే ఏమైఉండేదో..!!

తేనెతో ఆశ్చర్యపరిచే స్కిన్ కేర్ బెనిఫిట్స్...!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>