PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/chandrababuf252dfaf-8590-4e03-942a-5c577cf9f323-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/chandrababuf252dfaf-8590-4e03-942a-5c577cf9f323-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో అమరావతి ఉద్యమానికి బిజెపి అనుకూలంగా వ్యాఖ్యలు చేస్తుంది. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అమరావతి ఉద్యమానికి అనుకూలంగా వ్యాఖ్యలు చేయడం రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది. ఇక తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేసారు. తెదేపా కేంద్ర కార్యాలయంలో పొట్టి శ్రీరాములు, వల్లభాయ్ పటేల్ వర్దంతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, పార్టీ నేతలు కీలక వ్యాఖ్యలు చేసారు.chandrababu,tdp,amaravathi,ap;bharatiya janata party;jagan;amaravati;andhra pradesh;narendra modi;telugu;capital;tdp;central government;sardar vallabhai patel;partyసోము ప్రకటనతో చంద్రబాబు హ్యాపీసోము ప్రకటనతో చంద్రబాబు హ్యాపీchandrababu,tdp,amaravathi,ap;bharatiya janata party;jagan;amaravati;andhra pradesh;narendra modi;telugu;capital;tdp;central government;sardar vallabhai patel;partyTue, 15 Dec 2020 13:57:08 GMTఆంధ్రప్రదేశ్ లో అమరావతి ఉద్యమానికి బిజెపి అనుకూలంగా వ్యాఖ్యలు చేస్తుంది. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అమరావతి ఉద్యమానికి అనుకూలంగా వ్యాఖ్యలు చేయడం రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది. ఇక తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేసారు. తెదేపా కేంద్ర కార్యాలయంలో పొట్టి శ్రీరాములు, వల్లభాయ్ పటేల్ వర్దంతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, పార్టీ నేతలు కీలక వ్యాఖ్యలు చేసారు.

పొట్టి శ్రీరాములు విగ్రహానికి, సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూల మాల వేసి నివాళులు అర్పించిన చంద్రబాబు... రాజధాని గురించి మాట్లాడారు.  సర్దార్ వల్లభాయ్ పటేల్  దేశాన్ని ఐక్యం చేస్తే పొట్టిశ్రీరాములు తెలుగువారిని ఐక్యం చేశారు అని ఆయన వెల్లడించారు. భాషా ప్రయుక్త రాష్ట్రాలకు పొట్టిశ్రీరాములు నాంది పలికారు అని ఆయన చెప్పుకొచ్చారు. త్యాగానికి మారుపేరుగా నిలిచారు అని ఆయన అన్నారు. పొట్టి శ్రీరాములు స్పూర్తితోనే విభజన ఆంధ్రప్రదేశ్ ని అగ్రస్థానంలో నిలబెట్టేందుకు కృషి చేశాం అని ఆయన తెలిపారు.

రూపాయి ఖర్చులేకుండా అదనపు ఆదాయం వచ్చే విధంగా అమరావతి కి శ్రీకారం చుట్టాం అని ఆయన తెలిపారు. అన్ని ప్రాంతాల వారు అమరావతి పోరాటానికి సహకరిస్తుంటే జగన్ కు ఎందుకు పట్టుదల అని నిలదీశారు. భాజపా కూడా ఉద్యమానికి సహకరిస్తూ మోదీ కూడా సానుకూలమని ప్రకటించారు అని అన్నారు.   ఏపీకి జరుగుతున్న అన్యాయం చూసి పొట్టి శ్రీరాములు ఆత్మ కూడా క్షోభిస్తుందని విమర్శించారు. నవ్యాంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్4 నిర్వహించటమే సబబు అని ఆయన పేర్కొన్నారు. వైకాపా ది దుర్మార్గపు, దుష్ట పరిపాలన అని మండిపడ్డారు. రౌడీలకు అడ్డాగా ఏపీని మార్చేశారు అని ఆగ్రహం వ్యక్తం చేసారు. వైకాపా మాదిరి తెదేపా ప్రభుత్వమూ అరాచకాలు చేసి ఉంటే ఒక్కరు కూడా బయట తిరిగేవారు కాదు అన్నారు.


గుడ్ న్యూస్ .. భారీగా పడిపోయిన బంగారం ధరలు.. !!

పసుపు పాలతో మెమరీ పెరుగుతుందా...?

అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి ఫాలోయింగ్ మాములుగా లేదుగా...!

ఫైనల్స్ వచ్చినా గ్రూపుగానే .. ఆ ఇద్దరి మధ్యనే పోటీ...?

సోష‌ల్ మీడియాకు కేసీఆర్ అడ్డంగా దొరికారే.. కొంచెం వెయిట్ చేస్తే బాగుండేది...!

బిగ్‌బాస్-4 విన్నర్ ఆ కంటెస్టెంటేనా..?

వారికి ఉచితంగా వ్యాక్సిన్.. మోడీ మనసులో ఏముంది..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>