PoliticsP Subhadra devieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/trsd5021552-6151-4161-b984-aa63730751fc-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/trsd5021552-6151-4161-b984-aa63730751fc-415x250-IndiaHerald.jpgదుబ్బాక ఉప ఎన్నిక ముగిసింది. గ్రేటర్ ఎలక్షన్ తంతు పూర్తయింది. ఇక...ఎమ్మెల్సీ, ఖమ్మం, వరంగల్ గ్రేటర్ ఎన్నికలు మిగిలున్నాయి. అంతకు మించి నాగార్జున సాగర్ అసెంబ్లీ ఉప ఎన్నిక దూసుకొచ్చేస్తోంది. దాంతో, అన్ని పార్టీలు ఎలర్ట్ అవుతున్నాయి. గెలుపు గుర్రాలను బరిలోకి దించాలన్న కసరత్తు ప్రారంభించాయి.trs;nagarjuna akkineni;sridhar;tara;bharatiya janata party;telangana rashtra samithi trs;warangal;కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి;congress;district;media;assembly;mla;letter;janareddy;reddy;partyఇక నాగార్జున సాగర్లో ఎలక్షన్ హీట్ఇక నాగార్జున సాగర్లో ఎలక్షన్ హీట్trs;nagarjuna akkineni;sridhar;tara;bharatiya janata party;telangana rashtra samithi trs;warangal;కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి;congress;district;media;assembly;mla;letter;janareddy;reddy;partyTue, 15 Dec 2020 15:00:00 GMTదుబ్బాక ఉప ఎన్నిక ముగిసింది. గ్రేటర్ ఎలక్షన్ తంతు పూర్తయింది. ఇక...ఎమ్మెల్సీ, ఖమ్మం, వరంగల్ గ్రేటర్ ఎన్నికలు మిగిలున్నాయి. అంతకు మించి నాగార్జున సాగర్ అసెంబ్లీ ఉప ఎన్నిక దూసుకొచ్చేస్తోంది. దాంతో, అన్ని పార్టీలు ఎలర్ట్ అవుతున్నాయి. గెలుపు గుర్రాలను బరిలోకి దించాలన్న కసరత్తు ప్రారంభించాయి.


మరణించిన సిటింగ్ ఎమ్మెల్యే,నోముల నర్సింహయ్య కుటుంబ సభ్యులకు పోటీ చేసే అవకాశాన్నిఇవ్వాలని అధికార  టీఆరెస్ పార్టీ నిర్ణయించుకుంది. కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిగా జానా రెడ్డి పేరును దాదాపు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ప్రత్యామ్నాయంగా మరికొంతమంది పేర్లను కూడా అధిష్ఠానం పరిశీలిస్తోందని సమాచారం   జానారెడ్డి పార్టీ మారుతారంటూ, బీజేపీలో చేరుతారంటూ ప్రచారం ముమ్మరమైన నేపథ్యంలో ఆయన తాను పార్టీ మారడం లేదని, ఇదంతా మీడియా సృష్టేనంటూ ప్రకటన చేసారు. 


పార్టీ అధిష్టానం ఇష్ట ప్రకారం తాను నడుచుకుంటానని చెప్పారు. జానారెడ్డికి నాగార్జున సాగర్లో మంచి పట్టుంది. అంతకు ముందు రెండుసార్లు గెలిచిన ఆయన తెరాస అభ్యర్థి నోముల చేతిలో స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చెందారు. ఆ నియోజకవర్గంలో జానా రెడ్డి కి ఉన్న పట్టు ఆధారంగా కాంగ్రెస్ గెలిచి తీరుతుందని భావిస్తోంది. 
దుబ్బాక ఉప ఎన్నిక విజయం ఇచ్చిన ఉత్తేజంతో గ్రేటర్ ఎన్నికల్లో తెరాస ని చెమటలు పట్టించిన బీజేపీ నాగార్జున సాగర్ లో కూడా కాషాయ జెండా ఎగురవేయాలని పంతంతో ఉంది. 


ఈ సారి పార్టీ సీనియర్ నేత కడారి అంజయ్య యాదవ్, జిల్లా అధ్యక్షుడు కంకణాల శ్రీధర్ రెడ్డి బీజేపీ అగ్రనాయకులు కలసి తమకు పోటీ చేసే అవకాశం ఇవ్వాల్సిందిగా కోరినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే, రెండు పార్టీలకు గట్టి పోటీ ఇచ్చే అభ్యర్థి కోసం బీజేపీ అన్వేషిస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా ఇప్పటినుంచే ప్రధాన పార్టీలన్నీ నాగార్జున సాగర్ వైపు చూపు సారిస్తున్నారు. 



ప్రాణం తీసిన వివాహేతర సంబంధం

పసుపు పాలతో మెమరీ పెరుగుతుందా...?

అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి ఫాలోయింగ్ మాములుగా లేదుగా...!

ఫైనల్స్ వచ్చినా గ్రూపుగానే .. ఆ ఇద్దరి మధ్యనే పోటీ...?

సోష‌ల్ మీడియాకు కేసీఆర్ అడ్డంగా దొరికారే.. కొంచెం వెయిట్ చేస్తే బాగుండేది...!

బిగ్‌బాస్-4 విన్నర్ ఆ కంటెస్టెంటేనా..?

వారికి ఉచితంగా వ్యాక్సిన్.. మోడీ మనసులో ఏముంది..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P Subhadra devi]]>