Technologyyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/technology/sports_videos/pub-g-indiabc986554-f3b8-48b1-a92e-d4fe25834b7b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/technology/sports_videos/pub-g-indiabc986554-f3b8-48b1-a92e-d4fe25834b7b-415x250-IndiaHerald.jpgపబ్‌జీ.. ప్రపంచపు గేమింగ్ రంగాన్ని వేరే స్థాయికి తీసుకెళ్లిందనడంలో సందేహం లేదు. యువత, పిల్లలు అనే తేడా లేకుండా ఈ గేమ్‌కు అందరూ అడిక్ట్ అయిపోయారు. భారత్‌లోనూ ఈ గేమ్‌కు కోట్లలో వీరాభిమానులున్నారు. పీసీ, మొబైల్ వెర్షన్‌లలో.. pub g india;india;geum;application;central government‘పబ్‌జీ ఇండియా’తో జాగ్రత్త..!‘పబ్‌జీ ఇండియా’తో జాగ్రత్త..!pub g india;india;geum;application;central governmentTue, 15 Dec 2020 13:05:00 GMTఇంటర్నెట్ డెస్క్: పబ్‌జీ.. ప్రపంచపు గేమింగ్ రంగాన్ని వేరే స్థాయికి తీసుకెళ్లిందనడంలో సందేహం లేదు. యువత, పిల్లలు అనే తేడా లేకుండా ఈ గేమ్‌కు అందరూ అడిక్ట్ అయిపోయారు. భారత్‌లోనూ ఈ గేమ్‌కు కోట్లలో వీరాభిమానులున్నారు. పీసీ, మొబైల్ వెర్షన్‌లలో అందుబాటులో ఉన్న ఈ గేమ్‌ను ఆడుతూనే యువత కాలం గడిపేసింది. కానీ కొద్ది రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం ఈ గేమ్‌ను భారత్‌లో నిషేధించింది. డేటా చోరీ జరుగుతోందన్న ఆరోపణల నేపథ్యంలో దీనిని బ్యాన్ చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఈ గేమ్‌ను తిరిగి భారత్‌లోకి తీసుకొచ్చేందుకు పబ్‌జీ ప్రయత్నిస్తోంది.

పబ్‌జీ దక్షిణ కొరియాకు చెందిన గేమ్ అయినప్పటికీ.. ఈ గేమ్ మొబైల్ వెర్షన్‌లో చైనాకు చెందిన టెన్‌సెంట్ కంపెనీ 10శాతం వాటాను కలిగిఉంది. అయితే భారత్‌లో ఈ గేమ్‌ను మళ్లీ  తీసుకొచ్చేందుకు పబ్‌జీ చైనాతో తెగదెంపులు చేసుకునేందుకూ సిద్ధమైంది. అంతేకాదు పబ్‌జీ ఇండియా పేరుతో ఓ కొత్త వెర్షన్‌ను సైతం తీసుకొచ్చింది. చైనా సర్వర్లలో డేటాను నిల్వ చేయడాన్ని ఆపివేసింది. ఈ నేపథ్యంలో త్వరలో ఈ గేమ్ మళ్లీ భారతీయ యువత చేతుల్లోకి వస్తుందన్న వార్తలు ఊపందుకున్నాయి.

కొంతమంది కేటుగాళ్లకు ప్రస్తుతం ఈ వార్తలే అదనుగా మారాయి. పబ్‌జీ ఇండియా అప్లికేషన్ వచ్చేసిందని, దానికి సంబంధించిన ఏపీకే(అప్లికేషన్ ఫైల్)ను ఇక్కడనుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలంటూ కొన్ని వెబ్‌సైట్‌లలో తమ లింకులను పోస్ట్ చేస్తున్నారు. అయితే ఇది నిజమని నమ్మిన కొంతమంది వాటిని క్లిక్ చేసి గేమ్ డౌన్‌లోడ్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ గేమ్ డౌన్‌లోడ్ కాకపోవడంతో రెండు తిట్లు తిట్టుకుని బ్రౌజర్ క్లోజ్ చేసేస్తున్నారు. అయితే ఇక్కడ అసలు మోసం సైలెంట్‌గా జరిగిపోతోంది.

మీరు క్లిక్ చేసిన లింక్‌లో అప్పటికే కేటుగాళ్లు ప్రమాదకరమైన మాల్వేర్‌ను జొప్పించి ఉంటారు. మీరు మీ కంప్యూటర్, మొబైల్‌తో ఆ లింక్‌పై క్లిక్ చేయగానే అది యాక్టివేట్ అవుతుంది. మీ ప్రయేయం లేకుండానే కొన్ని సీక్రెట్ అప్లికేషన్లు మీ సిస్టంలో డౌన్‌లోడ్ అయిపోతాయి. అది మీకు తెలియను కూడా తెలియదు. ఇక అప్పటినుంచి మీ మొబైల్‌ లేదా కంప్యూటర్‌పై అవతలి వారికి యాక్సెస్ వెళ్లిపోతుంది. మీ పర్సనల్ డేటాను చోరీ చేసేస్తారు. ఒకవేళ అందులో ఏదైనా పర్సనల్ డేటా ఉంటే వాటిని అడ్డుపెట్టుకుని మిమ్మల్ని బ్లాక్‌మెయిల్ చేసేందుకూ వారు వెనుకాడరు.

కాబట్టి.. పబ్‌జీ ఇండియాకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి, పబ్‌జీ ప్రధాన సంస్థ నుంచి అధికారిక ప్రకటన వచ్చేవరకు ఎట్టిపరిస్థితుల్లోనూ ఆన్‌లైన్‌లో సెర్చింగులు ఆపేయండి. ఒకవేళ ఎక్కడైనా దానికి సంబంధించిన లింకులు కనపడినా.. క్లిక్ చేయకండి.





టి20 మ్యాచ్ లో క్యాచ్ కోసం గొడవ.. సహచరున్ని కొట్టబోయిన క్రికెటర్..?

పసుపు పాలతో మెమరీ పెరుగుతుందా...?

అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి ఫాలోయింగ్ మాములుగా లేదుగా...!

ఫైనల్స్ వచ్చినా గ్రూపుగానే .. ఆ ఇద్దరి మధ్యనే పోటీ...?

సోష‌ల్ మీడియాకు కేసీఆర్ అడ్డంగా దొరికారే.. కొంచెం వెయిట్ చేస్తే బాగుండేది...!

బిగ్‌బాస్-4 విన్నర్ ఆ కంటెస్టెంటేనా..?

వారికి ఉచితంగా వ్యాక్సిన్.. మోడీ మనసులో ఏముంది..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>