MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tarun-arthi-love5abcc769-d459-47de-82ff-8d8e217ff882-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tarun-arthi-love5abcc769-d459-47de-82ff-8d8e217ff882-415x250-IndiaHerald.jpgహీరో తరుణ్ తన పదేళ్ళ వయసులోనే చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమా రంగంలో కాలుమోపారు. రోజా రమణి, ఎస్. చక్రపాణి దంపతులకు 1983 హైదరాబాదులో తరుణ్ జన్మించారు. మణిరత్నం తెరకెక్కించిన అంజలి మూవీలో తరుణ్ చాలా బాగా నటించారు. tarun arthi love;mamata benerjee;aarthi;aarti agarwal;anjali;mamatha;prema;roja ramani;surya sivakumar;tarun;teja;roja;cinema;media;love;interview;hero;heroine;allu sneha;college;nijam;nuvve kavali;tarun kumar;chitramతరుణ్, ఆర్తి ల ప్రేమ గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన రోజా రమణితరుణ్, ఆర్తి ల ప్రేమ గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన రోజా రమణిtarun arthi love;mamata benerjee;aarthi;aarti agarwal;anjali;mamatha;prema;roja ramani;surya sivakumar;tarun;teja;roja;cinema;media;love;interview;hero;heroine;allu sneha;college;nijam;nuvve kavali;tarun kumar;chitramTue, 15 Dec 2020 15:06:00 GMTహీరో తరుణ్ తన పదేళ్ళ వయసులోనే చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమా రంగంలో కాలుమోపారు. రోజా రమణి, ఎస్. చక్రపాణి దంపతులకు 1983 హైదరాబాదులో తరుణ్ జన్మించారు. మణిరత్నం తెరకెక్కించిన అంజలి మూవీలో తరుణ్ చాలా బాగా నటించారు. ఈ మూవీలో నటించినందుకు గాను 1991 లో తరుణ్ కి బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ నేషనల్ ఫిలిం అవార్డు కూడా లభించింది. చైల్డ్ ఆర్టిస్ట్ గా మనసు మమత, సూర్య ఐపీఎస్, తేజ వంటి సూపర్ హైట్ చిత్రాల్లో తరుణ్ నటించి ప్రేక్షకులను బాగా మెప్పించారు. ఆ తరువాత ఏడు సంవత్సరాల పాటు సినిమాలకు దూరమై చదువు పూర్తి చేశారు.

2000లో నువ్వే కావాలి అనే సినిమాలో హీరోగా ఎంట్రీ ఇచ్చిన తరుణ్.. గతమైన నటనా ప్రతిభను కనబరిచి బెస్ట్ హీరోగా ఫిలిం ఫేర్ అవార్డు గెలుచుకున్నారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను కూడా తెచ్చిపెట్టింది. ఆ తర్వాత ప్రియమైన నీకు సినిమాలో నటించి హిట్ అందుకున్నారు. 2002వ సంవత్సరంలో "నువ్వు లేక నేను లేను" చిత్రంలో ఆర్తి అగర్వాల్ సరసన హీరోగా నటించారు. ఈ సినిమా షూటింగ్ సెట్స్ లో వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. తరుణ్ తన మూవీ లో నటించిన హీరోయిన్ ల తో కాలేజీ ఫ్రెండ్స్ లాగా మెలిగే వారట. సినిమా పూర్తయిన తర్వాత కూడా వారితో మంచి స్నేహితుడిగా ఉంటూ షాపింగ్ వెళ్లేవారట. దీంతో తరుణ్ హీరోయిన్లతో ఎఫైర్ పెట్టుకున్నారని పుకార్లు హల్చల్ చేసేవట.

ఈ విషయాలను తరుణ్ తల్లి రోజారమణి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చెప్పుకొచ్చారు. ఆర్తి అగర్వాల్ చాలా సైలెంట్ అని.. తాను ఆమెను కేవలం రెండుసార్లు మాత్రమే కలిశానని.. ఆమె ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని రోజా రమణి చెప్పుకొచ్చారు. తన కుమారుడితో ఆర్తి అగర్వాల్ కి ఎటువంటి సంబంధం లేదని చెప్పుకొచ్చిన ఆమె మీడియా వాళ్లు కేవలం తమ రేటింగ్ పెరగడానికే తప్పుడు వార్తలు ప్రచురించారని ఆమె మండిపడ్డారు. ఈ విషయం తమని బాధించిందని ఆమె చెబుతూ.. నిజంగా తరుణ్ ఆర్తి అగర్వాల్ ని ప్రేమించినట్లయితే తమకు చెప్పేవాడని.. కానీ ఎప్పుడూ కూడా తన కొడుకు ఆర్తి అగర్వాల్ గురించి చెప్పలేదని ఆమె అన్నారు.


ఆరుగురు ఎమ్మెల్యేలతో విజయశాంతి చర్చలు...?

పసుపు పాలతో మెమరీ పెరుగుతుందా...?

అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి ఫాలోయింగ్ మాములుగా లేదుగా...!

ఫైనల్స్ వచ్చినా గ్రూపుగానే .. ఆ ఇద్దరి మధ్యనే పోటీ...?

సోష‌ల్ మీడియాకు కేసీఆర్ అడ్డంగా దొరికారే.. కొంచెం వెయిట్ చేస్తే బాగుండేది...!

బిగ్‌బాస్-4 విన్నర్ ఆ కంటెస్టెంటేనా..?

వారికి ఉచితంగా వ్యాక్సిన్.. మోడీ మనసులో ఏముంది..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>