MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/actress-saitha0c3bc621-0615-44b0-b34a-a0da944125ec-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/actress-saitha0c3bc621-0615-44b0-b34a-a0da944125ec-415x250-IndiaHerald.jpgఒక్కోసారి మనం చాలా మందికి సహాయం చేస్తుంటాము. తీరా.., మన దాకా వచ్చే సరికి ఎవ్వరూ స్పందించరు. సామాన్యులే కాదు సెలబ్రెటీలు కూడా ఇలా మోసపోతుంటారు. ఒకప్పటి స్టార్ హీరోయిన్ సరితా కూడా ఈ లిస్ట్ లో ఉన్నారంటే మీరు నమ్ముతారా? నమ్మి తీరాలి.actress saitha;kamal hassan;soundarya;vijayashanti;maya;saritha;srividhya;suhasini;urmila;district;cinema;history;chennai;girl;heroineఎంతో మందికి డబ్బింగ్ చెప్పిన సరిత కు జరిగిన చేదు సంఘటనఎంతో మందికి డబ్బింగ్ చెప్పిన సరిత కు జరిగిన చేదు సంఘటనactress saitha;kamal hassan;soundarya;vijayashanti;maya;saritha;srividhya;suhasini;urmila;district;cinema;history;chennai;girl;heroineTue, 15 Dec 2020 12:27:12 GMTహీరోయిన్ సరితా కూడా ఈ లిస్ట్ లో ఉన్నారంటే మీరు నమ్ముతారా? నమ్మి తీరాలి. సరిత స్వచ్ఛమైన తెలుగు అమ్మాయి. ఆమెది గుంటూరు జిల్లా. తెలుగు మీద మంచి పట్టు ఉంది. కానీ.., చెన్నై లో ఎక్కువ కాలం పెరిగింది.

సరితా 15 ఏళ్ళు కూడా నిండక ముందే సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమానే కమల్ హాసన్ తో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. అదే 'మరో చరిత్ర' మూవీ. ఆ సినిమా ఇండస్ట్రీలో సంచనాలు సృష్టించింది. కట్ చేస్తే.., సరిత స్టార్ హీరోయిన్ అయిపోయింది. తక్కువ వయసులోనే సరితా ఎక్కువ క్రేజ్ దక్కించుకుంది. కమల్, రజనీ వంటి స్టార్స్ పక్కన  వరుసగా నటించింది. అయితే.., హీరోయిన్ గా ఇంత క్రేజ్ ఉన్నప్పుడే ఆమె డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా తన ప్రయాణాన్ని మొదలు పెట్టారు. అప్పట్లో చాలా మంది హీరోయిన్స్ తెలుగు వారే అయినా.., వారికి కెరీర్ స్టార్టింగ్ లో డబ్బింగ్ చెప్పడం వచ్చేది కాదు. ఆ లోటుని సరిత భర్తీ చేసి.., చాలా సినిమాలు విడుదల కావడానికి సహాయపడింది. అలా..,  సుహాసిని,విజయశాంతి,సౌందర్య,నగ్మ, టబు, ఊర్మిళ, నదియా,కుష్బూ ఒకరేమిటి ఎందరో హీరోయిన్స్ కెరీర్స్ నిలబెట్టిన ఘనత సరితకే దక్కుతుంది. కోపం, బాద, సంతోషం, ఉత్సాహం ఇలా ఏ భావాన్నైనా తన గొంతులో అలవోకగా పలికించేయగలరు సరిత.

ఇక ఒకానొక దశలో సరిత డబ్బింగ్ చెప్పే పని అయితేనే సినిమాకి డేట్స్ ఇస్తాము అని స్టార్ హీరోయిన్స్ తేల్చి చెప్పేవారు. అంతలా సరితా తన గాత్రంతో ప్రేక్షకులను మాయ చేసింది. అయితే.. డబ్బింగ్ విషయంలో ఇంత మందికి సహాయ పడ్డ సరితకి.. అదే డబ్బింగ్ విషయంలో ఓ హీరోయిన్ హ్యాండ్ ఇచ్చారట. సరిత కెరీర్ చివరి దశలో ఓ  మళయాళ సినిమాలో నటించింది. కెరీర్ నిలబడాలంటే ఆ సినిమా ఆడటం చాలా అవసరం. తన క్యారెక్టర్ కి చెప్పిన డబ్బింగ్ సరితకి నచ్చక పోవడంతో  హీరోయిన్ శ్రీవిద్యను డబ్బింగ్ చెప్పమని కోరారట. కానీ.., శ్రీవిద్య అప్పుడు సరితకు సహాయం చేయలేదట. ఈ విషయం తనని చాలా బాధ పెట్టింది అని సరిత చెప్పుకొచ్చింది.


టి20 మ్యాచ్ లో క్యాచ్ కోసం గొడవ.. సహచరున్ని కొట్టబోయిన క్రికెటర్..?

పసుపు పాలతో మెమరీ పెరుగుతుందా...?

అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి ఫాలోయింగ్ మాములుగా లేదుగా...!

ఫైనల్స్ వచ్చినా గ్రూపుగానే .. ఆ ఇద్దరి మధ్యనే పోటీ...?

సోష‌ల్ మీడియాకు కేసీఆర్ అడ్డంగా దొరికారే.. కొంచెం వెయిట్ చేస్తే బాగుండేది...!

బిగ్‌బాస్-4 విన్నర్ ఆ కంటెస్టెంటేనా..?

వారికి ఉచితంగా వ్యాక్సిన్.. మోడీ మనసులో ఏముంది..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>